దళారుల గుప్పిట్లో కాలేజీ సీట్లు | college seats in brokers hand | Sakshi
Sakshi News home page

దళారుల గుప్పిట్లో కాలేజీ సీట్లు

Published Sat, Jun 7 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

దళారుల గుప్పిట్లో  కాలేజీ సీట్లు

దళారుల గుప్పిట్లో కాలేజీ సీట్లు

 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విద్యావ్యవస్థ దళారులతో భ్రష్టుపట్టింది. అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేకంటే దళారులను ఆశ్రరుుస్తే ఇట్టే పనైపోతోంది. దీంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీన దాదాపు అన్ని విద్యాసంస్థలను తెరిచారు. అరుునప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విద్యాసంస్థల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు.
 
ఎల్‌కేజీ నుంచి ప్లస్ టూ వరకు కనీస విద్యార్హతను తమ పిల్లకు కలిగించాలని అధిక శాతం మంది ఆశ పడుతున్నారు. తమ ఆశలు ఆశయాలకు అనుగుణంగా విద్యా సంస్థను ఎంచుకుని సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కోరిన చోట, కోరిన విద్యాసంస్థల్లో సీటు కావాలంటే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. టిప్ టాప్ డ్రస్సుతో కారుల్లో తిరిగే దళారులు విద్యాసంస్థల యాజమాన్యం, అధికారులతో ఉన్న పరిచయాలను ఁక్యాష్* చేసుకుంటున్నారు.
 
యాజమాన్య, అధికారుల వాటా కోసం బ్రోకర్లే వారధిగా నిలుస్తున్నారు. సీట్ల కోసం విద్యాసంస్థల కార్యాలయాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు పడుతుండగా బ్రోకర్లు మాత్రం ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. యాజమాన్యాలతో వారి చొరవచూసి విద్యాసంస్థ ఉద్యోగిగా భ్రమపడిన తల్లిదండ్రులు వారంతా బ్రోకర్లని తెలుసుకుని ఖిన్నులవుతున్నారు. తన బిడ్డ ప్లస్‌టూ 94 శాతం మార్కులతో పాసైంది, సీటు కోసం కాలేజీకి వెళితే రూ.2 లక్షలు తెమ్మన్నారని ప్లాట్‌ఫాంపై పూలమ్ముకునే మహిళ వాపోయింది. తమ వంటి పేదలకు లక్షలు ఎక్కడి నుంచి వస్తారుు, ఉన్నత చదువులు పెద్దలకేనా, పేదలకు లేవా అని ఆవేదన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం ప్రత్యేక ఫిర్యాదుల విభాగంలో లిఖిత పూర్వక ఫిర్యాదును ఇస్తున్నట్లు ఆమె పేర్కొంది.
 
డీపీఐలోనూ బ్రోకర్లదే పెత్తనం
విద్యాసంస్థల్లో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్ (డీపీఐ) కార్యాలయంలోనూ దళారులు హవా కొనసాగుతోంది. వారు దర్జాగా లోనికి ప్రవేశించడం, సీటు కోసం సంబంధిత అధికారి నుంచి సిఫార్సు లెటర్‌ను తీసుకోవడం నిమిషాల్లో జరిగిపోతోంది. పనుల నిమిత్తం నిజాయితీగా వచ్చేవారికంటే బ్రోకర్లకే అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు.
 
బ్రోకర్ల పెత్తనాన్ని కొందరు అధికారులు సహించలేకున్నా ఁనలుగురితోపాటు నారాయణ* అనే మంత్రాన్ని జపిస్తూ బ్రోకర్లకు సహకరిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెరిచారు. అరుునప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విద్యాసంస్థల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఎల్‌కేజీ నుంచి ప్లస్ టూ వరకు కనీస విద్యార్హతను తమ పిల్లకు కలిగించాలని అధిక శాతం మంది ఆశ పడుతున్నారు.
 
 తమ ఆశలు ఆశయాలకు అనుగుణంగా విద్యా సంస్థను ఎంచుకుని సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కోరి న చోట, కోరిన విద్యాసంస్థల్లో సీటు కావాలం టే రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. టిప్ టాప్ డ్రస్సుతో కారుల్లో తిరిగే దళారులు విద్యాసంస్థల యాజమాన్యం, అధికారులతో ఉన్న పరి చయాలను క్యాష్ చేసుకుంటున్నారు. యాజ మాన్య, అధికారుల వాటా కోసం బ్రోకర్లే వారధిగా నిలుస్తున్నారు. సీట్ల కోసం విద్యాసంస్థల కార్యాలయాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు పడుతుండగా దళారులు మాత్రం ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
 
యాజమాన్యాలతో వారి చొరవచూసి విద్యాసంస్థ ఉద్యోగిగా భ్రమపడిన తల్లిదండ్రులు వారు దళారులని తెలుసుకుని ఖిన్నులవుతున్నారు. తన బిడ్డ ప్లస్‌టూ 94 శాతం మార్కులతో పాసైంది, సీటు కోసం కాలేజీకి వెళితే రూ.2 లక్షలు తెమ్మన్నారని ప్లాట్‌ఫాంపై పూలమ్ముకునే మహిళ వాపోయింది. తమ వంటి పేదలకు లక్షలు ఎక్కడి నుంచి వస్తారుు, ఉన్నత చదువులు పెద్దలకేనా, పేదలకు లేవా అని ఆవేదన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం ప్రత్యేక ఫిర్యాదుల విభాగంలో లిఖిత పూర్వక ఫిర్యాదును ఇస్తున్నట్లు పేర్కొంది.
 
 డీపీఐలోనూ దళారుల పెత్తనం: విద్యాసంస్థల్లో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్ (డీపీఐ) కార్యాలయంలోనూ దళారుల హవా కొనసాగుతోంది. వారు దర్జాగా లోనికి ప్రవేశించడం, సీటు కోసం సంబంధిత అధికారి నుంచి సిఫా ర్సు లెటర్‌ను తీసుకోవడం నిమిషాల్లో జరిగి పోతోంది. పనుల నిమిత్తం నిజాయితీగా వచ్చేవారికంటే దళారులకే అధికారులు ప్రాధాన్యంనిస్తున్నారు. దళారుల పెత్తనాన్ని కొందరు అధికారులు సహించలేకున్నా ‘నలుగురితోపాటు నారాయణ’ అనే మంత్రాన్ని జపించాల్సి వస్తోంది. దీంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement