నాకు ఎక్కడా బ్రాంచ్‌లు లేవు
నాకు ఎక్కడా బ్రాంచీలు లేవంటున్నారు సీనియర్ హాస్యనటుడు గౌండర్ మణి. ఈ బ్రాం చీల వ్యవహారం ఏమిటని ఆశ్చర్య పడుతున్నారా.! ప్రస్తుతం హాస్యనటులుగా దుమ్ము రేపుతున్న సంతానం, వివేక్, వడివేలుకు ముందు తరం హాస్యనటుడు గౌండర్ మణి. 1990 ప్రాంతంలో సెంథిల్, గౌండర్‌మణి కామెడీ లేని సినిమా ఉండదు. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా కొన్ని చిత్రాలు చేసిన గౌండర్ మణి చాలాకాలం తెర మరుగయ్యారు. తాజాగా మళ్లీ హీరో అవతారంతో తెరపైకి రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 49వో, వ్యవసాయ దారుల ఇతి వృత్తాన్ని ఆవిష్కరించే ఈ చిత్రంలో గౌండర్ మణి పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది.
ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెర మీదకు త్వరలో రానుంది. తాజాగా, ఎనక్కు వేరు ఎంగుం కిలైగల్ కడయాదు (నాకు ఎక్కడా బ్రాంచీలు లేవు) చిత్రంలో గౌండర్ మణి సరికొత్త గెటప్‌తో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తనదైన మార్కు చిత్రంగా , వినోదాల విందు గా ఉంటుందని దర్శకుడు గణపతి బాల కుమారన్ అంటున్నారు. ఈయన దర్శకుడు సుశీంద్రన్ శిష్యు డు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ, మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న గౌండర్మణికి తన కథనచ్చడంతో నటించేందుకు వెం టనే అంగీకరించారన్నారు.
ఇందులో గౌండర్ మణి సినిమా షూటింగ్‌లకు అద్దెకు నడిపే క్యారవన్ వ్యాన్ యజమానిగా నటిస్తున్నారని వివరించారు. ఆ విధంగా ఆయన చెన్నై నుంచి మదురైకు వెళ్లే మధ్యలో జరిగే వినోద భరిత సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతి వృత్తంగా పేర్కొన్నారు. జయరాం ప్రొడక్షన్స్ పతాకంపై జే షణ్ముగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై, తిరుచ్చి, మదురై, రామనాధపురం ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.