Comedian Venu Madhav
-
త్వరలోనే గవర్నర్‌ను కలుస్తా: వేణుమాధవ్
హన్మకొండ: తాను చనిపోయానన్న తప్పుడు వార్తలపై ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రులు నాయిని, తలసానిలను కలిసి ఫిర్యాదు చేసిన స్టార్ కమెడియన్ వేణుమాధవ్ త్వరలోనే గవర్నర్ ను సైతం కలుస్తానని చెప్పారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వేణుమాదవ్ అభిమానుల సందేహాలపై స్పందించారు. 'నేను చనిపోయానంటూ వచ్చిన పుకార్లు కొందరు బుద్ధిలేని గాడిదలు పనిలేక చేసిన ఆరోపణలు' అని అన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. (చదవండి: స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్) (చదవండి: తలసానిని కలసిన వేణుమాధవ్) -
రోత పుట్టించిన వేణుమాధవ్
విజయవాడ: టీడీపీ గురువారం నిర్వహించిన మహిళా గర్జన సభలో సినీ హాస్య నటుడు వేణుమాధవ్ ప్రసంగం అభ్యంతరకరంగా సాగింది. 'మీ (మహిళల) భర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం పెట్టొద్దు, ఇంట్లోకి రానీయొద్దు, ఆ టైంలో అసలు దగ్గరకు రానీయొద్దు అంటూ వెలికి కామెడీ చేశారు. దీంతో వేదిక పై ఉన్న మహిళలు కొంత అసహనానికి గురికాగా, వేదిక కింద ఉన్న మహిళలు ఏవగించుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్‌సింగ్ ఎవరి పైనైనా పోటీ చేయగలనంటూ పిట్టలదొరలా మాట్లాడారు. జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పది నిమిషాల్లోనే ముగించేశారు. అనంతరం ఆయన కుర్చునేందుకు సీటు కూడా దొరక్కపోవడంతో కాగిత వెంకట్రావ్, పక్కనే కొద్ది సేపు సర్దుకుని కూర్చుని తరువాత వేదిక దిగి వెళ్లిపోయారు. -
డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పలేకే...
బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు పలకలేకే కొన్ని సినిమాల్లో వేషాలను వదులుకున్నానని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తెలిపారు. సతీసమేతంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘సంప్రదాయం’తో అరంగేట్రం సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1996లో వచ్చిన సంప్రదాయం నా తొలి సినిమా. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నా మిమిక్రీ ప్రదర్శనను కృష్ణారెడ్డి, ఆ సినిమా నిర్మాత అచ్చిరెడ్డి చూశారు. వెంటనే ఆ సినిమాలో వేషం ఇచ్చారు. ఆ సినిమాకు నాకు ఇచ్చిన పారితోషకం రూ.70వేలు. అదే పదిలక్షలుగా ఫీల్ అయ్యాను. అగ్రహీరోలందరితోనూ నటించా మొత్తం 586 సినిమాలలో నటించాను. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, నితిన్...ఇలా అందరితోనూ నటించాను. సింహాద్రి, దిల్, సంప్రదాయం నాకు కమెడియన్‌గా మంచి పేరు తెచ్చాయి. చార్లీచాప్లిన్, రాజబాబు, బ్రహ్మనందం బాగా ఇష్టమైన హాస్యనటులు. ప్రస్తుతం నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య, శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు చిత్రం, అల్లరి నరేష్ లడ్డుబాబు, ఈ సత్తిబాబు దర్శకత్వంలో అల్లరినరేష్ నటిస్తున్న చిత్రం, నట్టికుమార్ దర్శకత్వంలో వస్తున్న యుద్ధం, చిరంజీవి మేనల్లుడు వరుణ్ తేజ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న రే చిత్రం, శివాజీ హీరోగా వస్తున్న చిత్రాలకు క మిట్ అయ్యా. ఆడపిల్లలను వేధించే వారిని, హింసించేవారిని కఠినంగా శిక్షించాలని సత్యదేవుడిని వేడుకున్నా. కాగా.. సత్యదేవుని ఆలయం వద్ద వేణుమాధవ్ దంపతులకు ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు ఘనంగా స్వాగతం పలికారు.