రోత పుట్టించిన వేణుమాధవ్ | Comedian Venu Madhav objectionable speech in TDP Mahila Garjana | Sakshi
Sakshi News home page

రోత పుట్టించిన వేణుమాధవ్

Published Fri, Mar 28 2014 3:15 PM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

రోత పుట్టించిన వేణుమాధవ్ - Sakshi

రోత పుట్టించిన వేణుమాధవ్

విజయవాడ: టీడీపీ గురువారం నిర్వహించిన మహిళా గర్జన సభలో సినీ హాస్య నటుడు వేణుమాధవ్ ప్రసంగం అభ్యంతరకరంగా సాగింది.  'మీ (మహిళల) భర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే అన్నం పెట్టొద్దు, ఇంట్లోకి రానీయొద్దు, ఆ టైంలో అసలు దగ్గరకు రానీయొద్దు అంటూ వెలికి కామెడీ చేశారు. దీంతో వేదిక పై ఉన్న మహిళలు కొంత అసహనానికి గురికాగా, వేదిక కింద ఉన్న మహిళలు ఏవగించుకున్నారు. 

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్‌సింగ్ ఎవరి పైనైనా పోటీ చేయగలనంటూ పిట్టలదొరలా మాట్లాడారు. జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పది నిమిషాల్లోనే ముగించేశారు. అనంతరం ఆయన కుర్చునేందుకు సీటు కూడా దొరక్కపోవడంతో కాగిత వెంకట్రావ్, పక్కనే కొద్ది సేపు సర్దుకుని కూర్చుని తరువాత వేదిక దిగి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement