తెలుగు తమ్ముళ్ల 'కెవ్వు కేక' | TDP workers played kevvu keka song in Mahila Garjana | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల 'కెవ్వు కేక'

Published Fri, Mar 28 2014 2:05 PM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

తెలుగు తమ్ముళ్ల 'కెవ్వు కేక' - Sakshi

తెలుగు తమ్ముళ్ల 'కెవ్వు కేక'

విజయవాడ: రానున్న ఎన్నికల్లో మహిళా ఓట్లు కీలకం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మహిళా ఓటర్ల కోసం పలు హామీలు గుప్పిస్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం మహిళలను అవమానపరిచేలా ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో టీడీపీ గురువారం నిర్వహించిన మహిళాగర్జన తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం కారణంగా అభాసుపాలయింది.

'కెవ్వు కేక' పాట పేరడీతో టీడీపీని, చంద్రబాబును పొగడుతూ ప్రదర్శించిన నృత్యాలతో మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఎదురయింది. తెలుగు తమ్ముళ్లు ఊగిపోతూ అభ్యంతరకరంగా నృత్యాలు చేయడంతో సభలో మహిళలు తలదించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి ఐటెం పాటలు వాడడం సముచితంగా లేదని పలువురు మహిళలు వ్యాఖ్యానించారు. టీడీపీ నిర్వహించిన మహిళా గర్జన ఎన్నికల ప్రచార సభలా లేదని, సినిమా ప్రచార సభలా ఉందని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement