పరారీలో వనిత ...?
బంజారాహిల్స్: హాస్యనటుడు విజయ్సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత కోసం జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులుగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల వద్ద పోలీసుల నిఘా ఉంచారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఆరోపణలపై నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న వనితకు నోటీసులు జారీ చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులను ప్రశ్నించారు.
అయితే తన కుమార్తె సూర్యాపేటలో ఉందని ఆమె తల్లి చెప్పింది. వనిత ఫోన్ సిగ్నల్స్ పరిశీలించగా రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను విచారిస్తే ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. రెండు బృందా లుగా ఏర్పడ్డ పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు.