commissioner post
-
నీలగిరి మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది?
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీ కమిషనర్ పోస్టు.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దశాబ్ద కాలంలో 20మందికి పైగా కమిషనర్లు మారారు. వచ్చిన వారు చాలావరకు తరచు లాంగ్లీవ్లు ఎందుకు పెడుతున్నారో అంతుచిక్కడం లేదు. అయితే అధికారులు స్వతంత్రంగా, రాజకీయాలకతీతంగా వ్యవహరించకపోవడం ఓ కారణంగా తెలుస్తోంది. దీనికితోడు స్థానికంగా ఉండే కీలకమైన ప్రజా ప్రతినిధులతోపాటు ఆయా పార్టీలలో ఉన్న ముఖ్య నాయకులను గమనంలోకి తీసుకోకుండా ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కొంతమంది రాజకీయ నాయకుల వ్యవహారశైలి, అధికారుల అత్యుత్సాహం ఇందుకు తోడవుతోంది. ఇక్కడ పనిచేయాలంటే కత్తి మీద సామే అనే స్థాయికి ప్రచారం తీసుకువచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే మున్సిపాలిటీలో ఉద్యోగంలోకి ఎక్కి ఇక్కడే రిటైర్డ్ అయిన వారు సైతం ఉన్నారు. కమిషనర్ లేని సమయంలో ఇన్‌చార్జ్‌ల పాలనలోనూ దాదాపు ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఉద్యోగులు కూడ అవకాశాలను బట్టి నాయకుల రాజకీయ నాయకుల చంకన చేరడం, నాయకులు సైతం వారిని వెనకేసుకురావడం ఇక్కడి మున్సిపాలిటీలో సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. ఆగిన ఫైల్స్ ... ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌కుమార్ గత మే నెలలో బాధ్యతలు స్వీకరించారు. గత నెల 7వ తేదీనుంచి 28వ తేదీ వరకు సెలవులో పెట్టారు. దానిని నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించుకున్నారు. విధుల్లో చేరిన ఆయన కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ సెలవుపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ ఈనెల 10వ తేదీ వరకు సెలవు పెట్టుకున్నా..తన సెలవును పొడిగించుకునే అవకాశం ఉంది. ఆయన డిజిటల్ సంతకం కూడా ఇంకా మారలేదు. వారం రోజులుగా కమిషనర్ లేక అనేక ఫైల్స్ ఆగిపోతున్నాయి. సంతకాల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం కమిషనర్ లేకపోవడం, ఎవరికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించకపోవడంతో పాలనకు అంతరాయం కలుగుతోంది. మున్సిపాలిటీ చుట్టూ రాజకీయాలు ... కొంతకాలంగా నీలగిరి మున్సిపాలిటీ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఇక్కడే ఉండడంతో మున్సిపాలిటీపై ఆధిపత్యంలో తమదే పైచేయిగా ఉండాలనే తాపత్రయం దశాబ్ధం నుంచి నడుస్తుంది. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం వారు మున్సిపాలిటీ రాజకీయాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలో ఎవరి పార్టీ అధికారంలో ఉంటే వారికి నచ్చిన అధికారులను ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. దాంతో అధికారులు కూడా ఆదే పార్టీ వారికి కొంత సానుకూలంగా ఉండడం, వారి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలాంటి సమస్యల తలెత్తి వివాదాస్పదంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య రగడ జరగడం, ఉద్యోగుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు వెళ్లడం తదితర కారణాలతో ఇక్కడికి వస్తున్న కమిషనర్లు ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. -
కమిషనర్ పోస్టుకు పోటాపోటీ
వైద్యవిధాన పరిషత్‌లో పైరవీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విధానపరిషత్ కమిషనర్ పోస్టుకోసం పోటాపోటీగా యత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని 212 ప్రభుత్వ ఆస్పత్రులకు అధిపతి, కమిషనరే కావడంతో ఈ పదవికోసం ఐదారుగురు వైద్యులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. సీనియారిటీలు, పదోన్నతుల ప్రాతిపదిక నియామకం అనే ప్రాథమిక సూత్రాలు పనిచేయకపోవడంతో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి లేదా ముఖ్య కార్యదర్శికి నచ్చిన వాళ్లే కమిషనర్లు అవుతున్నారు. ప్రస్తుత కమిషనర్ ఈనెల 31తో పదవీ విరమణ చేసేలోగానే ఇన్చార్జిగా కమిషనర్‌ను నియమించాల్సి ఉంది. వైద్య విధానపరిషత్‌లోని విజిలెన్స్ అధికారి డాక్టర్ కనకదుర్గతో పాటు, కార్యదర్శి గోపీకృష్ణలు ప్రస్తుతం ఈ పోస్టుకు పోటీపడుతున్నారు. కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్ జయకుమారి, ఏపీశాక్స్‌లో జేడీగా ఉన్న జయచంద్రారెడ్డి కూడా రేసులో ఉన్నారు. అయితే, హెచ్ఐవీ కిట్ల కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డిపై ఇటీవలే అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి, ఆయనకు కమిషనర్ పోస్టు దక్కకపోవచ్చని ఓ అధికారి అన్నారు. మరో ఇద్దరు కూడా కమిషనర్ పదవికి పోటీలో ఉన్నట్టు తెలిసింది. ఆశావహులంతా, వారం రోజులుగా అటు ముఖ్యమంత్రి చుట్టూ, ఇటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. తమకు నచ్చిన అధికారి కమిషనర్‌గా వస్తే బావుంటుందనే ఆశతో ఆస్పత్రుల నిర్వహణను చూసే కాంట్రాక్టర్లూ రంగంలోకి దిగారు. కమిషనర్ పోస్టుతోపాటు పరిషత్ కార్యదర్శిని నియమించేందుకు, పదోన్నతుల కమిటీ (డీపీసీ)ని శనివారం ఏర్పాటు చేశారు. నచ్చిన ఓ అధికారిని కార్యదర్శిగా నియమించడానికి రంగం సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై సీఎం పేషీనుంచి ఒత్తిళ్లు రావడంతో ముఖ్య కార్యదర్శి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది!