Committee of the Fatherland
-
సర్పంచ్ అధికారాలకు తప్పని కత్తెర
జన్మభూమి కమిటీలకు మరింత పెత్తనం ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పోటీగా ఉంచే యోచన జేబీ కమిటీల ముందు డమ్మీలుగా మారిన అధికారులు నేటినుంచి ప్రారంభం కానున్న జన్మభూమి గ్రామసభలు పలమనేరు: జన్మభూమి కమిటీల పేరిట చంద్రన్న ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులతో పాలన చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వీరి కారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ఈ కమిటీల ప్రోద్బలంతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ అధికారులు పూర్తిగా డమ్మీలుగా మారారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్లకు ఏమాత్రం అధికారాలు లేకుండా చేయడంపై పలమనేరు నియోజకవర్గంలోని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పథకానికి కమిటీలే కీలకం ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమపథకాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా, రాష్ట్ర, ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సుల్లో సైతం అధికారులతో పాటు వీరు పాల్గొంటున్నారు. అధికారులు ప్రభుత్వ పథకాల సమాచారం తదితర వివరాలను వీరికి తప్పకుండా తెలియజేస్తున్నారు. వీరు సిఫారసు చేస్తే గానీ పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారులతో పాటు లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూర్చొబెట్టారు. ఇక రుణమాఫీకి సంబంధించి అర్హులైన వారి విచారణలు, తప్పులు సరిదిద్దుకునే అవకాశంలోనూ వీరిదే హవా. ఇలా ప్రతి అంశంలోనూ జేబీ కమిటీ సభ్యులే కీలకంగా మారారు. నేటినుంచి సాగే జన్మభూమి గ్రామసభల్లో వీరికి మరింత పెత్తనం కట్టబెట్టడం మరింత వివాదంగా మారింది. స్థానికసంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తూ సర్పంచ్ల అధికారాలకు కత్తెర వేయడంపై సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నేటి నుంచి జరిగే గ్రామసభల్లో వివాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జన్మభూమి క మిటీల పెత్తనాన్ని అడ్డుకోండి
జగన్కు ప్రజాప్రతినిధుల వినతి నక్కపల్లి: ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువగా ఉంటోందని, దీన్ని అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్లు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించారు. గోకులపాడు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్మోహన్రెడ్డికి నక్కపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జాతీయరహదారిపై వందలాది మంది కార్యకర్తలు,నాయకులు, మహిళలు ఉండడంతో ఆయన వాహనం దిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ల పెత్తనం గురించి వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావులు వివరించారు. లబ్ధిదారుల ఎంపికలో పచ్చపాతం చూపిస్తున్నారని వాపోయారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు విలువలేకుండా పోతోందని వివరించారు. పార్టీతరపున కోర్టును ఆశ్రయించి టీడీపీవారి ఆగడాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. రుణాలు మాపీ వర్తించలేదని పలువురు డ్వాకామహిళలు జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. పొదుపు సొమ్మును వడ్డీలకు జమచేసుకుంటున్నారని, చంద్రబాబు మోసం చేశాడన్నారు. ఇందుకు జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ దీనిపై పార్టీ తరపున రాజీలేనిపోరాటం చేస్తున్నామన్నారు. జన్మభూమి కమిటీల విషయం పార్టీలో చర్చించి తగునిర్ణయం తీసుకుంటామన్నారు. జగన్ను కలిసిన వారిలో పార్టీనాయకులు మణిరాజు, పొడగట్లపాపారావు, జోగారావు, లొడగలచంద్రరావు, శేషారత్నం, ఎరిపల్లిశ్రీను, వెలగా ఈశ్వరరావు, గొర్లి నర్సింహమూర్తి, తిరుపతిరావు, మూలపర గోవిందు, గోసల కాసులమ్మ, కోమర్తి బాబూరావు, ముసలయ్య, వీసంరాజు ఉన్నారు.