communist party leaders
-
శ్రీలంక తరహా సంక్షోభం దేశంలోనూ రావొచ్చు: సీపీఐ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశంలోనూ శ్రీలంక తరహా ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పుట్టుకొచ్చే ప్రజా ఆందోళనలకు నాయకత్వం వహించేందుకు వామపక్ష పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి. ఇందుకు సైద్ధాంతికంగా ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలి..’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. మతో న్మాద బీజేపీని ఎదుర్కొవాలంటే సీపీఐ, సీపీఎంల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి పని చేయాలని అన్నారు. ఇందుకు 2 పార్టీల జాతీయ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా సోమవారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. మతోన్మాద బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలి ‘నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమైంది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రజల మధ్య అంతరాలూ పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమై, ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రమైన అసహ నం, ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. మరోవైపు మోదీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మగా మారారు. బహుళ మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారు. హిందూమత రాజ్యస్థాపనే లక్ష్యంగా చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. మతోన్మాద బీజేపీని, దాని వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని రాజా పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం ‘మోదీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, నేతలపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు లెప్టినెంట్ గవర్నర్, గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పటినుంచే ఏకమై పని చేయాలి..’ అని రాజా స్పష్టం చేశారు. ఐక్యత చాటుతాం: రామకృష్ణ కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై వామపక్ష మేధావులంతా చర్చించాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. అక్టోబర్‌లో విజయవాడ కేంద్రంగా నిర్వహించే జాతీయ మహా సభల సందర్భంగా వామపక్ష పార్టీలన్నీ భుజం భుజం కలిపి భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఐక్యతను చాటి చెబుతాయని చెప్పారు. సీపీఐ ప్రతిపాదనను సమర్థిస్తున్నా: తమ్మినేని సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూని స్టులంతా ఏకం కావాలనే సీపీఐ ప్రతిపా దనను సమర్థిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలి పారు. మతోన్మాద బీజేపీకి ప్రత్యా మ్నా య శక్తిగా నిలబడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్మాదంతో, ఉద్వేగంతో ప్రజలను రెచ్చగొడు తోందని, ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమా దకారిగా మారిందని విమర్శించారు. సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధమే లేదు: సురవరం తెలంగాణ సాయుధ పోరాటానికి, బీజేపీకి సంబంధమే లేదని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్లు కూడా తామే పోరాటం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఈ పోరాటానికి పూర్తిగా కమ్యూనిస్టులే నాయకత్వం వహించారని తెలిపారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
ప్రజల గుండె చప్పుడు
పరిచయం అక్కర్లేని పేరు కామ్రేడ్ బొమ్మగాని ధర్మ భిక్షం. కమ్యూనిస్టు పార్టీకే కాకుండా, అన్ని పార్టీలు వర్గాలు, ప్రాంతాలకు అతీ తంగా మూడు నాలుగు తరాలకు నాయకత్వం వహించి, నాయకులను అందించిన మహోన్నతుడు. ఆయన జీవి తంలో అనేక కోణాలు ప్రస్ఫుటమవుతాయి. విద్యార్థి నాయకునిగా, స్పోర్ట్స్‌మన్‌గా, జర్నలిస్టుగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, సంఘసంస్కర్తగా, శాసనసభ్యునిగా, లోక్‌సభ సభ్యునిగా, కార్మికోద్యమ నాయకునిగా అమోఘమైన పాత్రను నిర్వర్తరించారు. బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం జన్మించారు. పిన్నవయస్సులోనే జాతీయ భావాలను పునికిపుచ్చుకున్న గొప్ప యోధుడు ఆయన. విద్యా ర్థిగా ఉంటూనే సూర్యాపేట పాఠశాలలో నిజాం నవాబు జన్మదిన వేడుకలలో పరేడ్ నిర్వహించకుండా విద్యార్థుల చేత బహిష్కరింపజేసిన సంఘటన ఆ రోజుల్లో నైజాం సంస్థానంలో సంచలనం సృష్టిం చింది. చదువే గగనమైన ఆ రోజుల్లో విద్యార్థులకు విద్యనందించాలని గొప్ప సంకల్పంతో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ గురించి తెలుసుకొని... ఆయన విద్యార్థిగా ఉంటూనే ప్రజా విరాళాలు సేక రించి సూర్యాపేటలో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వసతితోపాటు విద్యను అందించారు. సూర్యాపేటలో నడుస్తున్న రెడ్డి హాస్టల్ వార్షికోత్సవ సభకు వచ్చిన డాక్టర్ రాజబహదూర్ వెంకటరామి రెడ్డి... ఒంటి చేత్తో ధర్మభిక్షం విరాళాలు సేకరించి హాస్టల్ నిర్వహిస్తున్న తీరును తెలుసుకొని అబ్బుర పడ్డారు. ‘‘ఒక చేతితో విరాళాల సేకరణ చేసి, మరొక చేతితో విద్యార్థులకు విద్యను అందించడానికి ధర్మం చేసిన వ్యక్తి పేరు కేవలం భిక్షం కాదు, నేటి నుండి ఆయన ధర్మభిక్షం’’ అని కొనియాడారు. ధర్మభిక్షం నిర్వహించిన హాస్టల్ అనేక మంది యోధులను తెలం గాణ సాయుధ పోరాటానికి అందించిన కార్ఖానాగా నిలిచింది. అందులో ఒకరైన పసునూరు వెంకట్‌రెడ్డి వీరమరణం కూడా పొందారు. మాజీ మంత్రి ఉప్పు నూతల పురుషోత్తంరెడ్డి, అలనాటి సినీనటుడు ప్రభా కర్‌రెడ్డి కూడా ఆయన హాస్టల్ విద్యార్థులే. వీరు ఆయనను గురుతుల్యులుగా భావించేవారు. ధర్మభిక్షం ఆంధ్రమహాసభ పట్ల ఆకర్షితుడై ఆ తరువాత పరిణామ క్రమంలో కమ్యూనిస్టుగా రూపాంతరం చెందారు. యువకునిగా ఉన్న సమ యంలోనే ధర్మభిక్షంను ప్రమాదకరమైన వ్యక్తిగా నాటి నిజాం ప్రభుత్వం ప్రకటించడంతో, ఆయన 40వ దశకంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే నిజాం వ్యతిరేక పోరాటానికి యువకులను, కార్యకర్తలను సమీకరించి సాయుధ పోరాటానికి భూమికను సిద్ధం చేశారు. ధర్మభిక్షం బైట ఉంటే ప్రమాదమనే ఉద్దేశ్యంతో అనేక కుట్రలతో ఆయనను అరెస్టు చేసి సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో ఐదేళ్ళపాటు జైల్లో ఉంచారు. జైలు నుండి విడుదలై హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్ని కల్లో సూర్యాపేట నుండి పోటీ చేసి అత్యధిక మెజా రిటీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో ఏర్పడిన నకిరేకల్ నియోజకవర్గం నుండి, 1962లో నల్ల గొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. 1991, 1996లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రజలు సంఘటితమై ఉద్యమాలు చేయడం ద్వారానే సమస్యల పరిష్కా రంతో పాటు, హక్కులు సాధిం చుకోవచ్చని ధర్మభిక్షం బలంగా విశ్వసించే వారు. ఆయన పెట్టిన సంఘాలు కోకొల్లలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్మికుల సంఘం, హోటల్ వర్కర్స్ సంఘం, లారీ డ్రైవర్స్ యూని యన్, గీతకార్మికుల సంఘం... ఇలా ఆయన అనేక సంఘాలు స్థాపించారు. ఐదుసార్లు చట్టసభ లకు ఎన్నికైనా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి. ఆయన మరణించి 15 ఏళ్లవుతున్నది. ఈ తరానికి ధర్మభిక్షం సేవలు, పోరాట పటిమను అందించాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రత్యేకించి ప్రభుత్వం మీదా ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియజేయడానికి ఇంకా ఎన్నో కార్యక్ర మాలు చేపట్టాలి. -చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
‘ప్రభుత్వం మెడలు వంచుతాం’
అనంతపురం అర్బన్ : ‘చంద్రబాబుకు రాయలసీమ కరువు, ఇక్కడి రైతులు, కూలీలు, ప్రజల కష్టాలు కనిపించడం లేదు. కరువు గురించి కనీసం మాట్లాడటం లేదు. రైతులను ఆదుకోకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే రాయలసీమలోని నాలుగు జిల్లాల బంద్ చేపడతాం. అంతిమంగా ప్రభుత్వం మెడలు వంచుతామ’ని సీపీఎం, సీపీఐ నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల ‘కరువుపై రాయలసీమ బైఠాయింపు’ కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వి.రాంభూపాల్, డి.జగదీశ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబుళేసు, మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి పాల్గొని.. ప్రసంగించారు. సీఎం చంద్రబాబు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు తప్ప సీమ రైతులను ఆదుకుందామనే కనీస స్పృహ లేదని మండిపడ్డారు. రెయిన్గన్ల ద్వారా ఆరు లక్షల ఎకరాల్లో పంటను కాపాడామంటూ రైతులను, ప్రజలను మోసం చేశారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దగా చేశారని, ఉపాధి కూలీలకు సీమలో రూ.250 కోట్ల బకాయిలను చెల్లించలేదని తెలిపారు. కరువు, పంటలకు గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడటం లేదని, దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం కల్పించింది లేదని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల సీపీఎం, సీపీఐ నాయకులు చలమయ్య, రామాంజినేయులు, ఈశ్వరయ్య, షడ్రక్, జిల్లా నాయకులు ఎంవీ రమణ, కాటమయ్య, జాఫర్, నారాయణస్వామి, మల్లికార్జున, నాగేంద్ర, లింగమయ్య, సీపీఐ ఎంఎల్ నాయకుడు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
చైనా నేతల జూదం జోరు!
మకావ్ వైభోగానికి మూల కారణమైన కస్టమర్లు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులే. ‘ప్రజా సేవలో’ నానా గడ్డి కరిచిన అభినవ కుబేరులు ‘ప్రపంచ పాప నగరి’లో ఖర్చు చేసి సేద తీరుతారు. నిఘా నేత్రాలకు దొరక్కుండా కమ్యూనిస్టు కుబేరుల ముచ్చట తీర్చే ప్రత్యేక రహస్య జూద మందిరాలూ ఉంటాయి. జూదగృహాల ప్రపంచ రాజధాని ఏది? అమెరికాలోని లాస్‌వేగస్ ఆ హోదాను కోల్పోయింది. చైనాలో ఒక ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా ఉన్న ‘మకావ్’ ప్రపంచ జూదగృహాలకు నేటి రాజధాని. పోర్చుగల్ చిట్టచివరి వలస మకావ్ 1999లో చైనా చేతికి వచ్చింది. ‘కమ్యూనిస్టు’ పాలనలో అది ‘మహర్దశను’ అందుకుంది. ‘తూర్పు లాస్‌వేగస్’గా ఒకప్పుడు మసక వెలుతుర్లో, పొగాకు ధూమం నిండిన ఇరుకు గదుల జూదశాలలకు మకావ్ సెలవు పలికేసింది. వాటికి అనుబంధంగా ఉండే వ్యభిచార గృహాలు కూడా అదృశ్యమైపోయాయి. మహారాజ ప్రాసాదాలను తల దన్నే అద్భుత, విలాస భవనాల ధగధగలతో అలరారే కేసినోలు 33 అవతరిం చాయి. లాస్‌వేగస్‌ను ‘పడమటి మకావ్’గా పిలుచుకోవాల్సిందే. గత ఏడాది మకావ్ కేసినోల టర్నోవర్ లాస్వేగస్తో పోలిస్తే ఆరు రెట్ల కంటే ఎక్కువ... 3,800 కోట్ల డాలర్లు! మకావ్ జూదగృహాలను పావనం చేసే వారిలో కుబేరులూ ఉంటారు. చేతి చమురు వదుల్చుకునే మధ్యతరగతి వారూ ఉంటారు. చైనాలో జూదం నిషిద్ధం. దక్షిణ చైనా సముద్ర తీరంలోని మకావ్‌కు చైనా జూదరులు బారు లు తీరుతారు. అయితే మకావ్ వైభోగానికి మూల కారణమైన కస్టమర్లు మాత్రం కమ్యూనిస్టుపార్టీ నేతలు, ప్రభుత్వాధికారులే. ‘ప్రజా సేవలో’ నానా గడ్డికరిచిన అభినవ కుబేరులు ‘ప్రపంచ పాప నగరి’లో ఖర్చు చేసి సేద తీరుతారు. వెనీషియన్ కేసినో ప్రపంచంలోనే అతి పెద్ద జూదగృహం. అక్కడి కేసినోల ముందు అత్యంత విలాసవంతమైన స్టార్ హోటళ్లు ఎం దుకూ కొరగావనిపిస్తాయి. ఆహార విహా రాలు, బార్లు, పబ్బులు, విడిది సకల సౌకర్యాలు అక్కడే. లాస్వేగస్లాగే స్ట్రిప్ టీజ్ నగ్ననృత్యాలకు కొదవలేదు. అయితే అడుగడుగునా చైనా ప్రభుత్వ నిఘా నేత్రాలు తప్పవు. వాటికి దొరక్కుండా కమ్యూనిస్టు కుబేరుల ముచ్చట తీర్చే ప్రత్యేక రహస్య జూద మంది రాలూ ఉంటాయి. జూదం బకాయిల కోసం కోర్టులకు ఎక్కలేమనే దిగులు అక్కర్లేదు. మకావ్‌కు అరవై కిలోమీటర్ల దూరంలోని హాంకాంగ్ కూడా చైనాలోని ప్రత్యేక పరిపాలనా ప్రాంతమే. అక్కడి మాఫియా గ్యాంగులు కమ్యూనిస్టు నేతలకంటే ముందే వారికి కావాల్సిన డబ్బును అక్కడకు చేరవేస్తాయి, బకాయిల గొడవా చూసుకుంటాయి. ఎన్ని ఉంటేనేం? సకల వ్యసనాలకు రాణి వ్యభిచారం లేకపోయాక? ఆ దిగులూ అక్కర్లేదు. మకావ్ ‘డేటింగ్ గర్ల్స్’కు ప్రసిద్ధి. ఆసియా ‘ప్రేమ పక్షులు’ రోజులు, వారాల లెక్కన కొనుక్కునే ‘ప్రేమ’ను నిజమైన ప్రేమానురాగాలతో, సేవాభావంతో రంగరిం చి మరీ అందిస్తారని ప్రతీతి. అందుకే మకావ్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ‘డేటింగ్ గర్ల్స్’ సేవలు వ్యభిచారమేనని అల్లరి చేసేవాళ్లకు ఆ యువతులు స్వచ్ఛందంగా అక్కడికి చేరినవారేనని గుర్తు చేస్తుంటారు. అదీ నిజమే. కాకపోతే వాళ్లకు చైనా ప్రధాన భూభాగంలో ముసలి తల్లిదండ్రులో, పిల్లలో ఉంటారు. వారి పోషణ కోసం, సుఖసంతోషాల కోసం ‘స్వచ్ఛందంగా’నే వాళ్లు ప్రేమను అమ్ముకుంటారు. ఇటీవలి కాలంలో చైనా నూతన నాయకత్వం అవినీతి భరతం పట్టేస్తామంటోంది. దీంతో అవినీతి చక్రవర్తులు ఎందుకైనా మంచిదని తమ విహారాల స్థానా న్ని సింగపూర్‌కు మారుస్తున్నారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతటా జూదగృహ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. చైనాకు ధీటైన ప్రాం తీయ శక్తిగా మారాలని ఆరాటపడుతున్న మన ప్రభుత్వం కూడా మకావ్ లాగే వీసాలు అవసరం లేని ఓ జూద నగరాన్ని నిర్మించడా నికి పూనుకోదని ఆశిద్దాం. - పి. గౌతమ్