Company assets
-
ఆదాయాలు క్షీణించినా.. లాభాలు స్థిరమే
ముంబై: ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలో.. భారత కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలను కోల్పోయినా.. తమ లాభాలను మాత్రం తెలివిగా కాపాడుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు/క్యూ1)లో కంపెనీల ఆదాయాలు ఏకంగా 31 శాతం మేర పడిపోగా.. అదే సమయంలో లాభాల క్షీణత 3.6 శాతానికే పరిమితమైనట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఓ నివేదికలో తెలియజేసింది. 489 కంపెనీల క్యూ1 ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఇక్రా ఈ వివరాలను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. మొదటి రెండు నెలలు (ఏప్రిల్, మే) దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడమే కారణంగా పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడం వల్ల జూన్ త్రైమాసికానికి ముందు వరుసగా మూడు త్రైమాసికాల్లోనూ కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. జూన్ త్రైమాసికంలో మాదిరి భారీ క్షీణతను ఎప్పుడూ చూడలేదని ఇక్రా స్పష్టం చేసింది. ‘‘తయారీ, పారిశ్రామిక, నిర్మాణ, వినియోగ కార్యకలాపాలపై క్యూ1లో ఎక్కువ భాగం నియంత్రణలు కొనసాగాయి. ఇదే ప్రధానంగా కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించింది’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. నివేదికలోని అంశాలు..: వినియోగ ఆధారిత రంగాలలో ఆదాయాల క్షీణత ఎక్కువగా ఉంది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 జూన్ క్వార్టర్లో ఆదాయాలు సగం మేర పడిపోయాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో, కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల వినియోగదారులు ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. విచక్షణారహిత వినియోగం కిందకు వచ్చే ఎయిర్‌లైన్స్, హోటళ్లు, రిటైల్, ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడింది. అదే ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ గూడ్స్ విభాగాలపై తక్కువ ప్రభావం పడింది. పన్నుకు ముందస్తు మార్జిన్లు క్యూ1లో 3.6 శాతానికి పరిమితమయ్యాయి. అంతక్రితం మార్చి త్రైమాసికంలో మార్జిన్లు 4.3 శాతంగా ఉన్నాయి. మార్జిన్లు ఎక్కువగా ప్రభావితమైన వాటిల్లో ఎయిర్ లైన్స్, హోటళ్లు, రిటైల్, హెల్త్ కేర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ రంగాలున్నాయి. చారిత్రక కనిష్టాలకు పడిపోయిన మార్జిన్లు ప్రస్తుత త్రైమమాసికం నుంచి క్రమంగా మెరుగుపడతాయి. -
అరబిందో చేతికి అమెరికా కంపెనీ
రూ. 810 కోట్లతో నాట్రోల్ కొనుగోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. నాట్రోల్కు చెందిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ పూర్తయినట్లు అరబిందో ఫార్మా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత నెలలో నాట్రోల్ అమ్మకానికి జరిగిన బిడ్డింగ్‌లో రూ. 810 కోట్లు (13.25 బిలియన్ డాలర్లు) కోట్ చేయడం ద్వారా అరబిందో ఫార్మా మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం కంపెనీ ఆస్తులు, బ్రాండ్‌తో పాటు కొన్ని రుణాలు కూడా అరబిందో పరం కానున్నాయి. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌష్టికాహార మార్కెట్లో వేగంగా విస్తరించే అవకాశం లభిస్తుందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. -
భూముల విలువనూ పంచేసింది
-
భూముల విలువనూ పంచేసింది
ఆర్టీసీ ఆస్తుల విభజనపై దుమారం బట్టబయలైన ప్రైవేట్ కన్సల్టెన్సీ నివేదిక ఆమోదానికి నేడు ఆర్టీసీ బోర్డు సమావేశం అగ్గిమీద గుగ్గిలమవుతున్న టీ అధికారులు నిజాం కాలం నాటి భూముల పంపకమా అని మండిపాటు హైదరాబాద్: ఆర్టీసీ స్థిరాస్తుల పంపిణీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ నిర్మాణాలతోపాటు, వాటి భూముల విలువను కూడా లెక్కించి ఇరు రాష్ట్రాలకు పంచుతూ విభజన కమిటీ నియమించిన ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక రూపొం దించింది. ఉమ్మడి ఆర్టీసీకి సం బంధించిన చివరి బోర్డు సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూడటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. బోర్డు ఆమో దం తర్వాత ఈ నివేదికను కేంద్రం నియమించిన షీలాబిడే కమిటీకి అందించనున్నారు. అక్కడి నుంచి అది నేరుగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. అయితే నగరంలోని సంస్థ స్థిరాస్తులు పూర్తిగా తెలంగాణకే దక్కాల్సి ఉండగా ప్రైవేట్ కన్సల్టెన్సీ మాత్రం వివాదాస్పదరీతిలో వాటిని మూల్యాంకనం చేయడంతో తెలంగాణ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఆమోదించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నివేదికలో తెలంగాణకు ఏ రకంగా నష్టం జరిగిందో వివరిస్తూ తెలంగాణ ఆర్టీసీ అధికారులు గురువారం సంస్థ ఎండీని కలిసి ఓ వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. మరో ప్రతిని సీఎంవోకు పంపారు. శుక్రవారం జరిగే బోర్డు సమావేశం ఉద్రిక్తంగా మారే అవకాశముంది. వివాదాస్పద అంశాలివే.. ►గత మే 15న ఆర్టీసీ రూపొందించిన విభజన నివేదికలో తెలంగాణ ఆర్టీసీ నష్టాలను రూ.1094 కోట్లుగా చూపారు. డిపోలవారీగా ఉన్న రికార్డుల ప్రకారం దీన్ని రూపొందించారు. షిలాబిడే నియమించిన ప్రైవేటు కన్సల్టెన్సీ జనాభా ఆధారంగా ఉమ్మడి ఆర్టీసీ నష్టాలను పంచి తెలంగాణ వా టాను రూ.1678 కోట్లుగా చూపింది. ఫలితంగా తెలంగాణకు అప్పుల భారం పెరగనుంది. ►ఆర్టీసీ 1956కు పూర్వమే ఏర్పడింది. దీంతో దీని స్థిరాస్తులు తెలంగాణకే చెందుతాయనేది స్థానిక వాదన. కానీ దీనికి విరుద్ధంగా ప్రధాన కార్యాలయం బస్‌భవన్, తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి, మియాపూర్‌లోని బస్ బాడీ వర్క్‌షాపుల భూముల విలువను కూడా లెక్కించి 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ. 240 కోట్లు, తెలంగాణకు రూ. 154 కోట్లు దక్కుతాయని తేల్చారు. ► అనంతపూర్‌లో ఆర్టీసీ ఆధీనంలోని పవన విద్యుత్తు ప్రాజెక్టు కరెంటును పదేళ్లపాటు పంచుకుని తర్వాత ప్రాజెక్టును ఆంధ్రకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ లెక్కన హైదరాబాద్‌లోని ఆస్తుల విషయంలో మరోలా వ్యవహరించినట్లు గా తెలంగాణ అధికారులు ఎత్తి చూపుతున్నారు. ► తార్నాక ఆసుపత్రి భవనం ఉన్న భూమికి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ జరగని ఆస్తి విలువను లెక్కించి పంచడం నిబంధనలకు విరుద్ధమన్నది తెలంగాణ వాదన. ► బస్ భవన్‌లోని నిర్మాణాల విలువను రూ.15 కోట్లు, భూమి విలువ రూ.100 కోట్లుగా చూపా రు. భవనం విలువను మాత్రమే పంచితే సరిపోతుందని తెలంగాణ అధికారుల వాదిస్తున్నారు.