competitive
-
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఇకపై యోగా కూడా ‘క్రీడ’
న్యూఢిల్లీ: భారత్లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తింపునిచ్చింది. ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది. జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల’ను పైలట్ చాంపియన్షిప్గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్రౌండ్ చాంపియన్షిప్, టీమ్ చాంపియన్షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
పోటీతత్వంతో అభివృద్ధి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందాయాని, మరికొన్ని జిల్లాలు వెనకబడి ఉంటాయని మోదీ అన్నారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నట్లే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందన్నారు. పోటీ తత్వం వల్ల రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి చెందుతాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం పోటాపోటీ
6666... రూ.62వేలు! ఖిలా వరంగల్ : వరంగల్ ఆర్టీఏ కార్యాలయం లో సోమవారం ఫ్యాన్సీ నంబర్ టీఎస్03 ఈ ఎం 6666కు ఇద్దరు వాహనదారులు పోటీ ప డ్డారు. రవాణాశాఖ ఈ నంబర్కు రూ.30 వేలు ధర నిర్ణయించింది. అయితే, ఇద్దరు పోటీకి రా గా ఆర్టీఓ మాధవరావు పర్యవేక్షణలో వేలం పా ట నిర్వహించారు. హన్మకొండకు చెందిన కె. వి శాల్ రూ.31,500 వరకు వేలంలో పాల్గొన్నారు. అయితే, గోపాలపురానికి చెందిన నడిపల్లి విజ్జన్రావు రూ.62వేలు పాడడంతో ఆయనకు టీ ఎస్ 03 ఈఎం 6666 నంబర్ కేటాయించారు. -
వలంటీర్ల పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
♦ ఒక్కో పోస్టుకు పది మంది పోటీ ♦ 1,224 ఖాళీలకు 11,481 మంది దరఖాస్తు ♦ వారంలోగా ఎంపిక ప్రక్రియ పూర్తి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు.. భారీ వేతనమూ రాదు.. కానీ పోటీ మాత్రం విపరీతంగా ఉంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లా విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. సోమవారం సాయంత్రానికి దరఖాస్తు గడువు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,224 ఖాళీల భర్తీకి విద్యాశాఖ ఉపక్రమించగా.. ఏకంగా 11,481 మంది దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో విద్యా వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. రిజర్వేషన్ల పద్ధతిలోనూ.. వలంటీర్ల నియామక భర్తీని స్థానికత, రోస్టర్ పద్ధతితోపాటు ప్రభుత్వం రిజర్వేషన్లను పాటిస్తోంది. కుల రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈమేరకు దరఖాస్తులను స్వీకరించారు. అరుుతే రిజర్వేషన్ల పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించగా.. ఏకంగా ఒక్కో పోస్టుకు సగటున 10మంది దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్థానికులకు మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించినప్పటికీ వేలల్లో దరఖాస్తులు రావడంతో అధికారులు గందరగోళంలో పడ్డారు. రెగ్యులర్ పద్ధతిలో భర్తీచేస్తే ఈ సంఖ్య మూడింతలు కానుంది. ఉప్పల్ మండలంలో మూడు ఖాళీలకుగాను 281 దరఖాస్తులు వచ్చారుు. జిల్లాలో అత్యధికంగా బషీరాబాద్ మండలంలో 827 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా తాండూరు మండలం నుంచి 797 దరఖాస్తులు, కుల్కచర్ల మండలంలో 743 దరఖాస్తులతో వచ్చారుు. వాలంటీర్ల భర్తీ ప్రక్రియ వారంలోగా పూర్తిచేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.