concessional fares
-
ట్రైన్ టికెట్ ధరలపై రాయితీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : దేశంలో రైల్వే ఛార్జీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులపై అశ్విని వైష్ణవ్ రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు జర్నలిస్ట్‌లు రైల్వే ఛార్జీలపై పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే ఇస్తుంది కదా సీనియర్ సిటిజన్ల కోసం ప్రీ-కోవిడ్‌కు ముందు ఉన్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.. ‘‘ ఇండియన్ రైల్వే ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్‌పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు అయ్యే ట్రైన్ టికెట్ ధర రూ. 100 అయితే, రైల్వే కేవలం రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది రూ. 55 రాయితీ ఇస్తోంది.’’ అని అన్నారు. రాయితీలపై అదే మాట కోవిడ్-19 లాక్ డౌన్ ముందు అంటే మార్చి 2020లో రైల్వే శాఖ టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు, అక్రేడియేటెడ్ జర్నలిస్ట్‌లకు 50 శాతం రాయితీ కల్పించింది. లాక్డౌన్ సమయంలో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జూన్ 2022లో పూర్తి స్థాయి పునఃప్రారంభమైనప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించలేదు. అప్పటి నుండి ఈ సమస్య పార్లమెంటులో పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయాల్లో వైష్ణవ్ పై విధంగా స్పందించారు. ఆర్టీఐలో ఏముందంటే? అంతకుముందు, మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై స్పందిస్తూ భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని తెలిపింది. -
సీనియర్ సిటిజన్లకు రాయితీల రద్దుతో.. రైల్వే శాఖకు రూ.2,242 కోట్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల టికెట్ రాయితీలరద్దుతో 2022–23లో అదనంగా రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50%, 60 ఏళ్లు దాటిన పురుషులు, ట్రాన్స్జెండర్లకు 40% టికెట్ ధరలో రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి దీన్ని నిలిపేసిన రైల్వే శాఖ ఇప్పటిదాకా పునరుద్ధరించలేదు. -
సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
-
ప్రత్యేక రైళ్లు : వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైళ్లు ఈ రోజు (మంగళవారం) నుంచి మళ్లీ పట్టాలెక్కనున్నాయి. 15 రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో రాయితీలకు సంబంధించి రైల్వే శాఖ స్పష్టత నిచ్చింది. మొదట ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వమని ప్రకటించిన రైల్వే శాఖ తాజాగా విద్యార్థులు, దివ్యాంగులు, రోగులకు ఊరటనిచ్చింది. కొంతమంది రోగులకు, దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే రాయితీ ధరల్లో టికెట్లు అందుబాటులో వుంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రయాణాలు ఎక్కువ చేయకుండా మూడు కేటగిరీలకు తప్ప ఇతరులకు రైల్వే టికెట్లలో రాయితీలు ఇవ్వకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. (తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు ఇవీ) అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యుటీఎస్), ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) టిక్కెట్ల రాయితీలపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. విద్యార్థులు, 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులకు మాత్రమే రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది. కాగా కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 కొనసాగుతుండగా, దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) -
రాయితీలపై రైల్వేల నష్టం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ రాయితీల కారణంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. ప్రయాణీకుల చార్జీల్లో ఇచ్చిన వివిధ రకాల రాయితీల కారణంగా 2015-16 సం.రంలో రూ 1,602 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ రాజ్యసభలో శుక్రవారం చెప్పారు. సీనియర్ సిటిజెన్, రోగులు, ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్, ఇజ్జత్ పథకం కింద నెలవారీ సీజన్ టిక్కెట్లలో ఇచ్చిన కన్సెషన్ కారణంగా ఈ ఆదాయాన్ని కోల్పోయినట్టు సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి ప్రకటించారు. యుద్ధం వితంతువులు, పత్రికా ప్రతినిధులు, అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు, ప్రధాని శ్రమ అవార్డు గ్రహీతలు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అవార్డు గ్రహీతలు తదితర 24 కేటగిరీల లో భారతీయ రైల్వే ఛార్జీల రాయితీని కల్పిస్తోంది. -
రూ. 829 నుంచి విమాన టికెట్లు!
వర్షాకాలం మొదలవ్వడంతో విమాన చార్జీలు కూడా తగ్గుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ తన కొత్త ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని రూ. 829 నుంచి స్వదేశీ విమాన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వదేశంలో చేసే విమాన ప్రయానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ స్కీంలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మాత్రం ఇండిగో ప్రకటించలేదు. అన్నింటికంటే తక్కువగా ఇంఫాల్-గువాహటి మార్గంలో టికెట్ రూ. 829కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అయితే ఇతర రూట్లలో మాత్రం టికెట్ల ధరలు దానికంటే కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2,486, ఢిల్లీ -చెన్నై మార్గంలో రూ. 3,338 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. అయితే ఇండిగో వెబ్సైట్లో చూస్తే మాత్రం ఢిల్లీ-ముంబై మార్గంలో వచ్చే వారానికి టికెట్ రూ. 5వేలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటినుంచి అమలవుతుందో ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా లాంటి అనేక సంస్థలు వర్షాకాలం ఆఫర్లను ప్రకటించాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.