confirmed karunakarareddi
-
తిరుపతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : తిరుపతి నగరాన్ని జిల్లాలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి పరిధిలోని ఇందిరానగర్‌లో శనివారం పార్టీ నాయకులు చంద్రారెడ్డి(న్యాయవాది), గౌరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్కావెంజర్స్ కాలనీలో పార్టీ నాయకులు హనుమంత్‌నాయక్, విష్ణు ఆధ్వర్యంలో ప్రజాబాట సాగింది. కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తున్నానని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటికీ అనేక సమస్యలను పరిష్కరించానని చెప్పారు. రాష్ట్ర సమైక్యత, తిరుపతి సమస్యలపై అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే మాట్లాడని విధంగా గొంతెత్తి చాటానని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే తిరుపతి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెబుతానని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం ఆయనదేనన్నారు. ఆరేళ్ల పాలనలో ఏ నాయకుడూ చేయలేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మహానేత వైఎస్.రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. జగనన్న అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాల మాఫీ, అమ్మఒడి, ఫీజురీయింబర్స్ మెంట్ తదితర పథకాలతో భరోసా కల్పిస్తారని చెప్పా రు. సీమాంధ్రులుగా ఉండి రాష్ట్ర విభజనకు సహకరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అడుగడుగునా నీరాజనం తిరుపతి పరిధిలోని ఇందిరానగర్‌లో ప్రజాబాట కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అడుగడుగునా హారతులతో మహిళలు నీరాజనం పలికారు. మిమ్మల్నే తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మహిళలంతా కరుణాకరరెడ్డి చేతిలో చెయ్యి వేసి ముక్త కంఠంతో చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్కే.బాబు, ఎంవీఎస్, మణి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, ఎస్కే.ముస్తఫా, ఈశ్వర్, సునీల్, నారాయణరెడ్డి, నాథముని, గోవిందరెడ్డి, ఎస్డీ.శేఖర్, లతారెడ్డి, ముంజుల, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ పాలనలోనే బడుగుల అభ్యున్నతి
జగనన్న నాయకత్వం కోసం ప్రజల ఎదురుచూపు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గుర్తు చేశారు. తిరుపతి పరిధిలోని గాంధీపురం, దాసరిమఠం, ఎస్బీఐ కాలనీ ప్రాంతాల్లో బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకుడు మణ్యం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ప్రజాబాటలో కరుణాకరరెడ్డికి ఆ ప్రాంత ప్రజలు అడుగడుగునా హారతులతో ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న అధికారంలోకి వస్తేనే తామంతా బాగుపడతామని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే చేసే ఐదు సంతకాలతో పేదల జీవితాల్లో వెలుగులు వెదజల్లుతాయని స్పష్టం చేశారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శ్రీవారి పవిత్రతను ప్రపంచదేశాలకు చాటిచెప్పానని కరుణాకరరెడ్డి తెలిపారు. దళితుల కోసం దళిత గోవిందం ఏర్పాటు చేశానన్నారు. తుడా చైర్మన్‌గా అనేక మురికివాడల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన తిరుపతి నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, నల్లాని బాబు, సుబ్బు, నాగరాజు, మణ్యం మునిరెడ్డి, ఆమోస్‌బాబు, ఉమాపతి, కోటూరు ఆంజనేయులు, కే.అమరనాథరెడ్డి, తాల్లూరి ప్రసాద్, బాకా మణి, శివ, బాబు, రాజ, ప్రశాంత్, మహేష్, శీను, మోహన్, బాలకృష్ణ, గురవయ్య పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎమ్మార్‌పల్లె కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్లు వైఎస్ఆర్ సీపీలో చేరిక తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి, తిరుమలయ్య, మబ్బు నాదమునిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎంఆర్‌పల్లె మాజీ కాంగ్రెస్ వార్డు మెంబర్లతో పాటు వందలాది మంది యువత ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంఆర్‌పల్లె పరిధిలోని ఎస్వీనగర్ వద్ద పార్టీ నాయకుడు ఎంవీఎస్.మణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో, శ్రీనివాసనగర్‌లో పార్టీ నాయకుడు యేసు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా చెయ్యి చెయ్యి కలిపి ఏకమై వైఎస్ఆర్ సీపీని గెలిపించుకుని తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటి నుంచి కంటిపై కునుకు లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. టీడీపీలోలాగా వైఎస్ఆర్ సీపీలో వర్గాలు, కుమ్ములాటలు ఉండవన్నారు. వైఎస్ఆర్ సీపీ క్రమశిక్షణకు మారు పేరు అన్నారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలంతా ఒక్కటిగా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామన్నారు. తండ్రి ఆశయసాధన, ప్రజల అభ్యున్నతికై జగనన్న పడుతున్న శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తించి రాబోయే ఎన్నికల్లో వైఎసార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పథకాలకన్నా మరిన్ని ఎక్కువగా ప్రవేశపెడతారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సోదరి భూమన సుగుణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులను నమ్మవద్దని ప్రజలకోసం పనిచేసే కరుణాకరరెడ్డి వంటి నాయకుడిని ఆదరించి గెలిపిం చాలని కోరారు. పార్టీ నాయకులు ఎస్కే. బాబు, కట్టా జయరాంయాదవ్, సాకం ప్రభాకర్, ముద్రనారాయణ, మునిసుబ్రమణ్యం, లక్ష్మి, సుభాషిణి, పార్టీలో చేరిన వారు పి. సుబ్రమణ్యం, ఎ. సుధాకర్, మోహనయ్య, రమణయ్య, సోమశేఖర్, సుమంత్, మురళి, రాజగోపాల్, నాగేశ్వరరావు, జయప్రకాష్, లోకనాధం, సతీష్‌బాబు, మౌనిక, నాగమణితో పాటు వందలాది మంది యువత ఉన్నారు.