consuming illicit liquor
-
తమిళనాడులో కల్తీ సారాకు 18 మంది బలి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన 18 మంది బుధవారం మరణించారు. మరో 90 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులలో ప్రవీణ్, సురేష్, శేఖర్, మోహన్, జగదీశ్, సుబ్రమణియన్, మణి ఉన్నారు. మరో ముగ్గురు సాయంత్రం మృతి చెందారు. ఈ సమాచారంతో కల్తీ సారా, సారా సేవించిన వారంతా ఆస్పత్రులకు పరుగులు తీశారు. ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 90 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, కల్తీ సారా తాగి మరణించినట్టుగా వైద్య పరీక్షల్లో తేలలేదని కళ్లకురిచ్చి కలెక్టర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్‌కుమార్‌ను బదిలీ చేసింది. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచి్చకి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. -
పెరుగుతున్న అలీగఢ్ కల్తీ మద్యం మృతుల సంఖ్య
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 22కు చేరింది. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలియజేశారు. వారంతా జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. లోధా, ఖైర్, జవాన్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో 15 మంది వ్యక్తులు ఈ కల్తీ మద్యం కారణంగా మరణించారని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ శుక్రవారం వెల్లడించారు. కేసుకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలానిది నైతాని చెప్పారు. లిక్కర్ కల్తీకి కారణమని భావిస్తున్న అనిల్ చౌధరి కూడా వారిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. అనిల్ సన్నిహితులైన రిషి శర్మ, విపిన్ యాదవ్‌ల కోసం గాలిస్తున్నామన్నారు. వారిపై రూ 50 వేల రివార్డు ప్రకటించినట్లు చెప్పారు. అనిల్ చౌధరికి మంచి రాజకీయ పలుకుబడి ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. (చదవండి: అనాథ పిల్లలకు ఉచిత విద్య) -
కల్తీమద్యం తాగి 15 మంది మృతి
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 15 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేర్పించారు. కర్సియాలోని ఓ లైసెన్స్డ్ అమ్మకందారుడి దుకాణం నుంచి కొనుగోలు చేసిన కల్తీ మద్యం తాగడం వల్లే వారంతా మరణించినట్లు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. దోషులుగా తేలిన వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్ స్పష్టం చేశారు. లోథా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు మరణాలు సంభవించాయి. కర్సియాలో మరో 6 మంది మరణించినట్లు సమాచారం అందింది. వీరంతా ఒకే చోట మద్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్పారు. మరికొంత మంది సైతం అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లిక్కర్ షాపు సీజ్ చేసి శాంపిల్స్‌ను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఎక్సైజ్ విభాగం అడిషనల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, హెడ్ కాన్‌స్టేబుల్‌లను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై శాఖాసంబంధిత విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. -
బీహార్‌లో దారుణం..12 మంది మృతి
-
బీహార్‌లో దారుణం..12 మంది మృతి
ఓ వైపు మద్య నిషేధం కొనసాగుతుండగానే.. మరోవైపు 12 మంది వ్యక్తులు అక్రమ మద్యం సేవించి తమ జీవితాలను అర్థాంతరంగా కోల్పోయారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లాలో స్థానిక ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. మద్య నిషేధం కొనసాగుతున్న తమ ప్రాంతంలో స్థానిక ప్రజలు అక్రమ మద్యం సేవించారు. ఆ మద్యం తాగిన వెంటనే వారు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వారిని వెంటనే ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కొంతమంది పరిస్థితి విషమంగా మారడంతో గోరఖ్‌పూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఐదుగురు చికిత్స జరుగుతుండగానే మద్యలోనే ప్రాణాలను వదిలారు. ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతిచెందినట్టు వెల్లడవుతోంది. అక్రమమద్యం సేవించడం వల్లనే వీరు మృతిచెందారని కుటుంబీకులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. ముందస్తు రిపోర్టులు సైతం అక్రమ మద్యానికే వీరు బలైనట్టు వెల్లడిస్తున్నాయి. కానీ స్థానిక పోలీసులు, అధికారులు మాత్రం తమ నిర్లక్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి దీన్ని ఖండిస్తున్నారు. మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ బ్యాన్ దీర్ఘకాలంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని మెరుగుపరుస్తుందా అనే సందేహం నెలకొంటోంది. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.