సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: కార్మిక సంఘాలు
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శికి కార్మిక సంఘాలు సోమవారం సమ్మెనోటీసును ఇచ్చాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలనీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ఈ సమ్మె నోటీసులో పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 14 వేలు రూపాయలు ఉండాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. సమ్మెనోటిసులో జీహెచ్ఎంసీ కార్మికులు కూడా భాగస్వాములైనారు. ఈ నెల 22 తర్వాత ఏ రోజైనా సమ్మెకు సిద్ధపడతామని హెచ్చరిక జారీ చేశారు.