The contractor
-
టీటీడీ డీఈఈకి 15 రోజుల రిమాండ్
రాజమండ్రి క్రైం: ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(రాజమండ్రి) రామకృష్ణారావుకు ఏసీబీ కోర్టు 15 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 8న శ్రీకాకుళం, 16న విజయనగరం జిల్లాల్లో జరిగిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాలకు సంబంధించిన బిల్లులు రూ. 3.93 లక్షలు మంజూరుకు పృధ్వీరాజ్ అనే కాంట్రాక్టర్ నుం చి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ డీఈఈ రామకృష్ణారావు బుధవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే రామకృష్ణారావును గురువారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరచగా అతడికి 15 రోజులపాటు రిమాండ్ విధించినట్టు ఏసీబీ రాజమండ్రి రేంజ్ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. అలాగే అతడి ఇంటిలో సోదాలు చేయగా.. ఒక స్థలం... ఒక ఇంటికి సంబంధించిన పత్రాలు దొరికాయని, అవి న్యాయబద్ధంగానే ఉన్నాయని వివరించారు. -
ఏసీబీ వలలో టీటీడీ డీఈఈ
- రూ.30 వేలతో పట్టించిన కాంట్రాక్టర్ రాజమండ్రి: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐదు జిల్లాల అధికారి) రామకృష్ణారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు బుధవారం చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రామచంద్రరరావు విలేకరులకు వెల్లడించారు. ఆయ న కథనం ప్రకారం..టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా మర్రిపాడు గ్రామం, ఈ నెల 16న విజయనగరం జిల్లా కూనేరు గ్రామంలో శ్రీనివాస కల్యాణాలు జరిగాయి. ఈ కల్యాణాల పనులను విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం రేవిడి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బి.పృథ్వీరాజ్ టెండర్ ద్వారా దక్కించుకున్నారు. ఆ రెండు కల్యాణాల పనులకు పృథ్వీరాజ్‌కు రూ.3.93 లక్షలు ఖర్చయింది. టీటీడీ(రాజమండ్రి) ఏఈ ఆ మొత్తం బిల్లుకు ఎం బుక్ తయారు చేసి రాజమండ్రి కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్డీఈఈ) రామకృష్ణారావుకు పంపారు. రూ. 30 వేలకు బేరం కాంట్రాక్టర్ బిల్లు మంజూరు చేయాలంటే డీఈఈ ఎం బుక్‌ను విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వద్దకు పంపాలి. అయితే బిల్లు మంజూరుకు తనకు రూ.40 వేలు సమర్పించుకోవాలని డీఈఈ రామకృష్ణారావు కాంట్రాక్టర్ పృథ్వీరాజ్‌ను డిమాండ్ చేశారు. దీంతో పృథ్వీరాజ్ రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ రాజమండ్రి రేంజ్ డీఎస్పీ రామచంద్రరావు పథకం ప్రకారం వల వేసి బుధవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా డీఈఈ రామకృష్ణారావును పట్టుకున్నారు. కెమికల్స్‌తో కూడిన రంగును నోట్లకు పూసి పృథ్వీరాజ్‌కు ఇచ్చి పంపారు. ఆ తర్వాత పది నిముషాలకు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి రామకృష్ణారావు చాంబర్‌కు వెళ్లి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు డీఈఈ చాంబర్లో పలు పత్రాలను పరిశీలించారు. అదుపులోకి తీసుకున్న రామకృష్ణారావును గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. సీఐ రాజశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
నిరుపయోగంగా పీపీఈలు
- వృథాగా అగ్నిమాపక శాఖ జవాన్ల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ - కొనుగోలు చేసినవి 2,320.. - ఉపయోగిస్తున్నవి 620 - శరీర ఆకృతికి తగ్గట్టు - లేకపోవడం వల్లే ధరించడం లేదన్న సిబ్బంది సాక్షి, ముంబై: అగ్నిమాపక శాఖ జవాన్ల రక్షణ కోసం కొనుగోలు చేసిన ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్మెంట్’ (పీపీఈ) లు కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోతున్నాయి. మంటలు ఆర్పివేసే ప్రయత్నంలో గాయపడకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన మొత్తం 2,320 పీపీఈలలో 620 మాత్రం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. మిగతావన్నీ ఆయా అగ్నిమాపక కేంద్రాలలో పనికిరాకుండా పడున్నాయి. సదరు యూనిఫాంలు జవాన్ల శరీర ఆకృతికి తగ్గట్టుగా లేకపోవడంతో వాటిని ధరించడం లేదని తెలుస్తోంది. అయితే బాధ్యులైన సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) అధికారులు వారిని వెనకేసుకొస్తున్నారు. వృథాగా యూనిఫాంలు..రూ. 20.67 కోట్ల నష్టం అగ్నిప్రమాదాలు జరిగినపుడు మంటలను ఆర్పే ప్రయత్నంలో జవాన్లకు హాని జరగకుండా 2009లో బీఎంసీ పరిపాలనా విభాగం జాకెట్లు, ప్యాంట్లు, టీ షర్టులు, షూస్, హెల్మెట్లు, టార్చ్లైట్లు ఇలా ఒక్కో సెట్లో 15 వస్తువులు ఉండే 2,320 పీపీఈలు కొనుగోలు చేసింది. వీటిని మెసర్స్ టెక్నోట్రేడ్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా చైనా నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం బీఎంసీ పరిపాలన విభాగం రూ.29.34 కోట్లు చెల్లించింది. కానీ జవాన్ల శరీర కొలతల ప్రకారం వాటిని తయారు చేయకపోవడంతో ఫిర్యాదు చేశారు. సరిపోయిన 620 పీపీఈలు వినియోగిస్తున్నారు. మిగతావన్నీ వృథాగా పడి ఉండడంతో బీఎంసీకి వాటి ద్వారా రూ.20.67 కోట్ల నష్టం వాటిల్లింది. నిరూపయోగంగా ఉన్న యూనిఫాంలను మార్చి ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నిరాకరించారు. మరోవైపు ఇచ్చిన గడువుకంటే రెండు నెలలు ఆలస్యంగా సామాగ్రి డెలివరీ చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా రూ.1.12 కోట్లు జరిమాన వసూలు చే యాల్సి ఉంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బుధవారం స్థాయి సమితిలో ఈ అంశాన్ని చర్చించారు. దీనిపై ఆడిట్ సిబ్బంది నిలదీశారు. కొలతల ప్రకారం యూనిఫాంలు తయారుచేసి ఇచ్చే బాధ్యత కాంట్రాక్టర్‌దేనని, అయినప్పటికి ఎందుకు నిర్లక్ష్యం చేశార ని ఆడిటర్లు అగ్నిమాపక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యం జరిగినందుకు నష్టపరిహారంగా 10 శాతం జరిమానా వసూలు చేయాలని సూచించారు. -
రోడ్డునపడ్డ విద్యార్థులు
కోవెలకుంట్ల: విద్యా శాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సోమవారం 60 మంది విద్యార్థులు రోడ్డునపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలోని గాంధీనగర్ ప్రాంతానికి 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో మొదట ఏడేళ్లు కొట్టంలో నిర్వహించారు. అనంతరం రామిరెడ్డి అనే వ్యక్తి తాత్కాలిక ప్రాతిపదికన అద్దె లేకుండా ఉచితంగా భవనాన్ని ఇవ్వడంతో ఆరు సంవత్సరాలుగా అందులో నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులున్న ఈ పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాల కోసం కేటాయించిన 10 సెంట్ల స్థలం ఆక్రమణకు గురికావడంతో సొంత భవనం నిర్మాణాన్ని ప్రారంభించలేదు. చివరికి 2012లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని, ఆక్ర మణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుని విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో రెండు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 9 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఏడాదిన్నర కిందట గదుల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా ఒక గది నిర్మాణం మాత్రమే పూర్తయింది. తన భవనాన్ని ఖాళీ చేయాలని ఏడాది కిందట భవన యజమాని రామిరెడ్డి విద్యాశాఖ అధికారులను కోరారు. గదుల నిర్మాణం పూర్తి కావపోవడంతో ఈ ఏడాది కూడా అందులోనే తరగతులను నిర్వహిస్తున్నారు. పదేపదే చెప్పినప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం రామిరెడ్డి వచ్చి, భవనాన్ని ఖాళీ చేయాలని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను బయటికి పంపి, ఖాళీ చేశారు. తరగతులను ఎక్కడ నిర్వహించాలో తెలియక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయలు సందిగ్ధంలో పడ్డారు. చివరికి పూర్తి అయిన ఒక గదిలోనే ఐదు తరగతులకు చెందిన 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టారు. కాగా.. ఇప్పటిదాకా కాంట్రాక్టర్‌కు రూ.6.50 లక్షలు చెల్లించామని, నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా డబ్బు చెల్లిస్తామని సర్వశిక్ష అభయాన్ ఈఈ భాస్కర్ తెలిపారు. త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించామన్నారు.