Cooking gas cylinders
-
Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్) బేసిక్ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది. ఉజ్వల రాయితీ గడువు పెంపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ముడి జనపనారకు మరో రూ.285 ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది. రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. -
వంటిల్లు.. వర్ధిల్లే..
పానీపూరీ నుంచి పావుబాజీ దాకా.. ఇడ్లీ నుంచి చపాతీ, వడ దాకా.. మిర్చీ నుంచి ఆలూబజ్జీ.. జిలేబీ దాకా.. కేక్‌లు.. ఐస్‌క్రీమ్‌లు.. స్వీట్లు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో వైవిధ్యభరితమైన వంటలు. చవులూరించే నలభీమపాకాలు.. జిహ్వ.. వాహ్వా అనే రుచులు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనాల దాకా రకరకాల వెరైటీలు ఇంటి మెనూలో స్థానం సంపాదించుకుంటున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్‌ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇల్లూ ఓ వంటిల్లే అయ్యింది. ప్రతి చేయీ గరిటె పట్టింది. కిచెన్‌లో చికెన్ వండుతోంది. మటన్‌లో మసాలా దట్టిస్తోంది. విభిన్న రకాల రుచులకు శ్రీకారం చుడుతోంది. ఏనాడూ వంటింట్లోకి వెళ్లని మగవాళ్లూ నలభీములే అవుతున్నారు. గృహిణులు సైతం రుచులకు మరింత సాన పెడుతున్నారు. మొత్తంగా నగరంలోని ఇల్లిల్లూ మధురమైన వంటకాలతో వర్ధిల్లుతోంది. టేస్టీ ఫుడ్‌కు దోస్తానాగా మారుతోంది. వంటగ్యాస్ సైతం విరివిగా వినియోగమవుతోంది. రోజూరెండు పాల పాకెట్లు తెస్తే ఉదయం, సాయంత్రం టీ, కాఫీలతో పాటు కొద్దిగా పెరుగు కూడా చేసుకొనేవాళ్లం. ఇప్పుడలా కాదు. రోజుకు 4 పాకెట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు సికింద్రాబాద్‌కు చెందిన కల్పన. గతంలో నాన్‌వెజ్ వారానికిరెండుసార్లు వండుకొనేవాళ్లం. ఇప్పుడు నాన్‌వెజ్ వినియోగం పెరిగింది. పిల్లల కోసం చికెన్ పకోడా, చికెన్ మలాయికోస్త,పీస్ మసాలా వంటి వెరైటీలు చేసుకుంటున్నామంటున్నారు కేపీహెచ్‌బీకి చెందిన కమలాదేవి సాక్షి, సిటీబ్యూరో: లాడ్‌డౌన్. హోటళ్లు.. రెస్టారెంట్లు బంద్, మెస్సులు లేవు. టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు కనిపించవు. బయట చాయ్ తాగాలన్నా చిక్కులే. కారణం కరోనా. ఏంతినాలన్నా ఇంట్లో తయారు చేసుకోవలసిందే. ఉదయం టీ, కాఫీ మొదలుకొని సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాల వరకు అన్నీ ఇంట్లో వండుకోవలసిందే. దీంతో నగరంలో ఇంటిఫుడ్ వినియోగం బాగా పెరిగింది. గతంలో ఉదయం టిఫిన్ చేసి లంచ్ బాక్సులు సర్దుకొని పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్లు ఆఫీసులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకొనేవారు. ఇక రాత్రి భోజనాల కోసం ఏదో ఒకటి వండుకొని తినేస్తే ఆ రోజు గడిచిపోయేది. పైగా వీకెండ్ సెలవులు, ఆదివారాలు, ఏ హోటలుకో, రెస్టారెంటుకో వెళ్లి ఇంటిల్లిపాది చక్కగా హాయిగా భోంచేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు లాక్డౌన్.. అన్నింటికీ బ్రేక్‌లు వేసింది. పానీ పూరీ మొదలుకొని పావ్‌బాజీ వరకు, ఇడ్లీ, వడ, చపాతి వంటి ఉదయపు అల్ఫాహారం నుంచి సాయంత్రం పూట ఆరగించే మిర్చీలు, ఆలూబజ్జీలు, జిలేబీలు, పిల్లలకు ఇష్టమైన కేకులు, ఐస్‌క్రీములు, స్వీట్లు...ఒకటేమిటి ఏం కావాలన్నా ఇంట్లో చేసుకోవలసిందే. దీంతో వంటింటిపైన భారం భారీగా పెరిగింది. ఉమ్మడి కుటుంబాల్లో వంటింటి పని భారం రెండు రెట్లు పెరిగింది. అందుకు తగినట్లుగానే గ్యాస్ వినియోగం కూడా బాగా ఎక్కువైంది. నలుగురు కుటుంబసభ్యులు ఉన్న ఇంట్లో గతంలో సిలిండర్ 35 రోజుల నుంచి 40 రోజుల వరకు వినియోగించుకొనేవాళ్లు. ఇప్పుడు 20 నుంచి 25 రోజులకే ఒక సిలిండర్ ఖర్చవుతుందని మౌలాలీ హౌసింగ్ బోర్డుకు చెందిన అన్నపూర్ణ తెలిపారు. ‘‘ పొద్దున పిల్లలకు టిఫిన్లు తినిపించేసి లంచ్ బాక్సులు పెట్టేస్తే సరిపోయేది. డబ్బులిస్తే స్కూళ్లలోనే ఏదో ఒకటి కొనుక్కొని తినేవాళ్లు, ఇప్పుడు అలాకాదు. పిల్లలతో సహా ఇంటిల్లిపాదికి టిఫిన్లు, స్నాక్స్ తప్పనిసరయ్యాయి. పని భారం పెరిగింది. వంటగ్యాస్వినియోగం కూడా ఎక్కువైంది.’’ అని చెప్పారు. వెరైటీల కోసం వెదుకులాట... నిత్యం ఉరుకులు పరుగులతోనిత్యం బిజీగా ఉండే నగరజీవి సాధారణంగా అయితే ఏదో ఒకటి తినేసి ఆకలితీర్చుకుంటాడు. తిరిగి పనిలో పడిపోతాడు. కానీ ఇప్పుడలా కాదు. పిల్లలు, పెద్దలు అంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఇంట్లో అందరి చూపులూ వంటింటిపైనే పడుతున్నాయి. ఏదో ఒక వెరైటీ కోసం వెదుకులాడుతున్నారు. గతంలో ఉదయం, సాయంత్రం మాత్రమే టీ,కాఫీ తాగేవాళ్లు ఇప్పుడు రోజుకు నాలుగైదుసార్లు తాగేస్తున్నారు. ‘‘ రెండు పాలపాకెట్లు తెస్తే ఉదయం, సాయంత్రం టీ,కాఫీలతో పాటు కొద్దిగా పెరుగు కూడా చేసుకొనేవాళ్లం. ఇప్పుడలా కాదు.రోజుకు 4 పాకెట్లు ఖర్చవుతున్నాయి. టీకాఫీలు ఎక్కువే తాగేస్తున్నాం.’’ అని చెప్పారు సికింద్రాబాదుకు చెందిన కల్పన. కాలక్షేపం కోసం టీలు తాగాల్సి వస్తోందంటూ విన్మయం వ్యక్తం చేశారు. మరోవైపు గతంలో వారానికి ఒకసారి మటన్, చికెన్ వండుకొనేవాళ్లు ఇప్పుడు వారంలో కనీసం రెండు, మూడుసార్లు తినేస్తున్నారు.పైగా వాటిలోనూ రకరకాల వెరైటీలు ఆరగించేస్తున్నారు. బిరియానీలు, పులావ్‌లు, ఫ్రైలు వంటి రకరకాల వెరైటీలు ఇళ్లల్లోనే వండుకుంటున్నారు. ‘‘ పిల్లల కోసం స్నాక్స్ చేస్తే వాళ్లు మాత్రమే తినరు కదా. ఇంట్లో అందరి కోసం ఎక్కువే చేయవలసి వస్తుంది. దీంతో వంటగ్యాస్ బాగా ఖర్చవుతుంది. గతంలో ఒక డబ్బా నిండా గారెలు చేస్తే కనీసం వారం, పది రోజులు వచ్చేవి. ఇప్పుడు నాలుగు రోజుల్లో డబ్బా ఖాళీ. ఇక స్వీట్లు కూడా అంతే. పెరిగిన వంట గ్యాస్ వినియోగం లాక్డౌన్లో ఇంటి వంటలు పెరగడంతో మహానగరంలో పది నుంచి ఇరవై శాతం వరకు వంట గ్యాస్ వినియోగం పెరిగింది. వంట గ్యాస్‌కు డిమాండ్ పెరిగినా.. బుకింగ్– బుకింగ్ కు మధ్య 14 రోజుల వ్యవధి నిబంధనతో సరఫరా మాత్రం సాధారణ రోజుల కంటే అదనంగా రెండు శాతానికి మించడం లేనట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రధాన చుమురు సంస్థలకు చెందిన సుమారు 26.21 లక్షల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 60 శాతం వరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్లు, మిగతా 40 శాతం డబుల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ఒక కుటుంబానికి ఏడు నుంచి 8 సిలిండర్లు, ఉమ్మడి కుటుంబానికి 11 నుంచి 12 సిలిండర్లు మించవు. సాధారణంగా మూడు ప్రధాన కంపెనీలకు చెందిన సుమారు 120కు పైగా డీలర్ల గోదాములకు కలిపి ప్రతి రోజు 80 వేల సిలిండర్లు వరకు దిగుమతి అవుతుండగా.. గృహ వినియోగదారులకు సుమారు 52 వేల 62 వేల వరకు సిలిండర్లు డోర్ డెలివరీ జరిగేది. తాజాగా మరో రెండు శాతం డెలివరీ పెరిగినట్లు గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. వాస్తవంగా గత నెల చివరి వారం లాక్డౌన్ విధించిన ఆరంభంలో వంటగ్యాస్ వినియోగదారుల ఆందోళన, ముందు జాగ్రత్త చర్యలతో ఒకే సారి చమురు సంస్థలకు గ్యాస్‌బుకింగ్ పెరిగింది. దీంతో ఆయిల్ కంపెనీలు అనవసర బుకింగ్‌ను కట్టడి చేసేందుకు 14 రోజుల వ్యవధికి నిబంధన అమలు వర్తింపజేయడంతో ఆ తర్వాత బుకింగ్ అదుపులోకి వచ్చింది. అప్పటికే బుకింగ్ జరిగిన కనెక్షన్లకు దశలవారిగా సిలిండరు డోర్‌డెలివరీ జరగడంతో వినియోగం పెరిగినా గ్యాస్ కొరత లేనట్లు కనిపిస్తోంది. వంట గ్యాస్ కొరత లేదు లాక్డౌన్లో వంట గ్యాస్ వినియోగం పెరిగింది వాస్తవమే. అయినా గ్యాస్ కొరత లేదు. ఎమర్జెన్సీ సర్వీసుల కింద సరఫరాయథావిధిగా ఉంటుంది. ఆందోళన చెందవద్దు. సిలిండర్ డోర్‌డెలివరీ సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కంటోన్మేంట్ జోన్‌ల్లోని గృహాలకు బారికేడ్ల వరకు మాత్రమే సిలిండర్ రీఫిల్ డెలివరీ చేస్తాం. సిలిండర్లను శుభ్రంగా డెటాల్స్‌తో శుభ్రపర్చుకోవాలి. – అశోక్, అధ్యక్షుడు,వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, హైదరాబాద్ అందరి కోసం ఏదో ఒకటి చేయాల్సిందే లాక్డౌన్ వల్ల ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. కాబట్టి వంటలు ఎక్కువే చేయవలసి వస్తోంది. గతంలో నాన్‌వెజ్ వారానికి రెండుసార్లు వండుకొనేవాళ్లం. ఇప్పుడు నాన్‌వెజ్ వినియోగం పెరిగింది. అలాగే పిల్లల కోసం చికెన్ పకోడ, చికెన్మలాయీకోస్తా, పీస్ మసాలా వంటి వెరైటీలు చేస్తున్నాను. టీవీల్లో ఏ వెరైటీ వంటకం కనిపిస్తే ఇంట్లో అది చేసేయ్యాలని పిల్లలు డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం వంట చేయడం కంటే టీ, కాఫీలు,స్నాక్స్ కోసం వంటింట్లో ఎక్కువగా గడపాల్సివస్తోంది. – కమలాదేవి, కూకట్పల్లి, హౌసింగ్ బోర్డు -
వంట గ్యాస్... మూడు మొక్కలు
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు...మీ ఇంటికి నిండు సిలిండర్‌తో పాటు ఇకపై మూడు మొక్కలు ఉచితంగా అందనున్నాయి.హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని సిటీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వినియోగదారులకు ఉచితంగా మొక్కలు అందచేయాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. ఈ మేరకు గ్యాస్ గోదాముల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు గృహ అవసరాలకు ఉపయోగించే తులసి, కరివేపాకు, ఇతర పండ్ల, పూల మొక్కలు గ్యాస్ వినియోగదారులకు కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు స్థలం లేని వారు సైతం కుండీల్లో పెట్టుకొని మొక్కలు పరిరక్షించేందుకు వీలుగా చిన్నిచిన్న మొక్కలనే అందించాలని నిర్ణయించారు. ప్రతి గృహోపయోగ గ్యాస్ వినియోగదారు ల కుటుంబం కనీసం ఒక మొక్క అయినా పరిరక్షించే విధంగా చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. ఇకపై వంట గ్యాస్ బుకింగ్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేసే బాయ్లే మొక్కలు కూడా వారికి అందచేస్తారు. గ్రేటర్లో 26.21 లక్షలు కుటుంబాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంట గ్యాస్ వినియోగ కుటుంబాలు సుమారు 26.21 లక్షలకు పైబడి ఉన్నారు. వీరికి మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 135 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతోంది. ప్రతి రోజు డిమాండ్ 1.20 లక్షలు సిలిండర్ల వరకు డిమాండ్ ఉండగా కనీసం 80 వేలకు తగ్గకుండా డోర్ డెలివరీ జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్యాస్ వినియోగదారులకు హరితహారంలో భాగంగా ఇంటింటికి సిలిండర్‌తోపాటు మొక్కలు అందించేందుకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. ఇటీవల గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం బాధ్యులు సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ను కలిసి హరిత హారంలో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నర్సరీల ద్వారా గ్యాస్ గోదాముల వారిగా మొక్కలు సరాఫరా చేసేందుకు అధికార వర్గాలు అంగీకరించాయి. 34 నర్సరీల్లో మొక్కల పెంపకం నగరంలోని 34 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వేప, జువ్వి, కానుగ, జమ్మితో పాటు పండ్ల మొక్కలైన సపోట, మామిడి, అల్లనేరేడు, బాదం తదితర పలు రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకునేందుకు ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. గృహోపయోగ గ్యాస్ వినియోగదారుల కోసం మాత్రం ఔషధ, పూల మొక్కలను సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ గోదాములకు మొక్కలు సరఫరా కాగానే సిలిండర్లతోపాటు వాటిని పంపిణీ చేసే విధంగా డిస్ట్రిబ్యూటర్లు సంసిద్ధులవుతున్నారు. మొక్కలను పరిరక్షించండి మానవుడి మనుగడకు పర్యావరణ పరిరక్షణ అవసరం. అందుకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి కార్యక్రమం. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇంటింటికీ సిలిండర్‌తో పాటు ఉచితంగా పంపిణీ చేసే మొక్కలు వృథాగా పారేయకుండా పరిరక్షించాలి. ఇంట్లో మొక్కలు నాటేందుకు స్థలం లేనివారు కూడా కుండీల్లో మొక్కలను పెంచుకోవచ్చు. అప్పుడే ఇంటి ముందు పచ్చతోరణం కళకళాడుతుంది. ఇది కుటుంబం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. – అశోక్‌కుమార్, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం, గ్రేటర్ హైదరాబాద్. -
రీఫిల్లింగ్ వ్యాపారం కాసుల వర్షం ..
యథేచ్ఛగా నల్ల బజారుకు తరలిపోతోంది. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా అధికార గణం గుడ్లప్పగించి చూడడాన్ని వ్యాపారులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.1200 వరకు ఆర్జిస్తున్న అక్రమార్కులు హోటళ్లకు సరఫరా చేయడం, వాహనాలకు రీఫిల్లింగ్ చేస్తూ తమ గ్యాస్ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తున్నారు. సత్తెనపల్లి : జిల్లాలో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ వ్యాపారం కాసుల వర్షం కురి పిస్తోంది. రీఫిల్లింగ్ వ్యాపారులు కిలో గ్యాస్‌ను రూ.100లు చొప్పున విక్రయిస్తున్నారు. 14.2 కిలోల గృహ సిలిండర్‌పై రూ.1600 వరకూ వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర కంటే రూ.1150లు అదనంగా సంపాదిస్తున్నారు. * ఇది కాకుండా మరో విధానంలో కూడా సంపాదిస్తున్నారు. మూడు వంటగ్యాస్ సిలిండర్లు కలిపి రెండు వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నారు. మూడు సిలిండర్ల ధర రూ.1,350 కాగా, ఒక్కో వాణిజ్య సిలిండరు 19 కిలోల వంతున రెండు సిలిండర్లకు రూ. 3,800 వసూలు చేస్తున్నారు. అంటే అదనంగా మిగిలిన రూ 2,450 జేబులో వేసుకుంటున్నారు. * వినియోగదారుడికి నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు రాయితీపై ఇస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు ఏజెన్సీలు సకాలం లో పంపిణీ చేయకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. దీంతో రీఫిల్లింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. * ఈ కేంద్రాలకు గృహాల నుంచే ఎక్కువ సిలిండర్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డబుల్ సిలిండర్ కలిగిన గృహ వినియోగదారుల నుంచి ఒక్కో సిలిండర్‌ను రూ. 700 నుంచి రూ. 800ల వరకు రీఫిల్లింగ్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. * హోటళ్ల నిర్వాహకులు కూడా రూ.800ల చొప్పున గృహ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఐదు కిలలో సిలిండర్‌కు అనుమతి ఎక్కడ ? జిల్లాలో ఏ గ్యాస్ కంపెనీ వారు కూడా ఐదు కిలోల వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించడం లేదు. జిల్లాలో వాటికి అనుమతి లేదు. అయితే లైట్లు, వంట కోసం ఐదు కిలోల సిలిండర్లను దుకాణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇవన్నీ రీఫిల్లింగ్ కేంద్రాల నుంచి వస్తున్న సిలిండర్లగా అర్థమవుతోంది. *ఒక గ్యాస్ సిలిండర్(14.2 కిలోలు)తో మూ డు ఐదు కిలోల సిలిండర్లు నింపుతున్నారు. దీంతో అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రమాదకరమని తెలిసినా ... *రీఫిల్లింగ్ విధానంలో పైపు ద్వారా ఒక సిలిండర్ నుంచి మరో దానికి గ్యాస్ నింపుతుంటారు. కార్లకైతే విద్యుత్ మోటార్ ద్వారా ఎక్కిస్తుంటారు. నివాస ప్రాంతాల నడుమ ఇలాంటి ప్రక్రియ ప్రమా దకరమని తెలిసినా లాభాలే లక్ష్యంగా అక్రమాలకు ఒడిగడుతున్నారు. *జిల్లాలో ఎక్కువగా పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, రేపల్లె, పొన్నూరు వంటి పట్టణాల్లో ఈ తంతు సాగుతోంది. *పధానంగా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్డు శివాలయ సమీపం లో రీఫిల్లింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ బహిరంగంగానే రీఫిల్లింగ్ చేస్తుంటారు. * ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి వంట గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.