మెట్రో లగ్జరీ వోల్వో బస్సులను ప్రారంభించిన కేసీఆర్
* నాలుగు రూట్లలో ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు
*కనీస చార్జీ రూ.15, గరిష్ట చార్జీ రూ.110
*మహిళా ప్రయాణికులకు పటిష్ట భద్రత
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో మెట్రో లగ్జరీ వోల్వో బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో సిటీ రోడ్లపై 'కూల్'గా ప్రయాణం చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఉన్న పుష్పక్, శీతల్, నాన్ ఏసీ లోఫ్లోర్ బస్సుల కంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సులు రూపొందాయి.
అలాగే సిటీ బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ముందస్తు సమాచారం తెలిపేందుకు ప్రయోగాత్మకంగా వంద బస్టాపుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బోర్డులను కూడా కేసీఆర్ ఆరంభించారు. ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.80 కోట్లతో 80 మెట్రో లగ్జరీ బస్సులను జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా ఆర్టీసీ కొనుగోలు చేసింది.
మెట్రో లగ్జరీ వోల్వో బస్సుల రూట్లు ఇవీ...
*17 హెచ్/10 డబ్ల్లూ
*113ఎం/డబ్ల్యూ
*218 డి
* 222