కూల్ ప్యాడ్ కొత్త ఫోన్, ఫీచర్లెలా ఉన్నాయంటే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లోకి లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ కూల్ ప్లే6 పేరుతో బుధవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర సీఎన్వై 1,499గా కంపెనీ ప్రకటించింది. అంటే భారత్ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు 8900రూపాయలు ఉండొచ్చు. చైనాలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కంపెనీ, ఈ ఫోన్ ను మే 16నుంచి విక్రయానికి తీసుకొస్తోంది. మెటల్ ఫ్రేమ్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ రియర్ కెమెరా, 4060 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో స్పెషల్ ఫీచర్లు.
సాఫ్ట్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్ ను స్మార్ట్ ఫోన్ కింద భాగంలో కంపెనీ ఉంచింది. 5.5 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుంది. 64బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 653 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం, రెండు 13మెగాపిక్సెల్ సోనీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా, సెల్ఫీ కోసం ముందు భాగాన 8 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి..