cooperates
-
హైదరాబాద్‌లో వెలుగులోకి ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: తమ ముఠా కోల్పోయిన సొమ్ము, సొత్తు కోసం పరిధులు సృష్టించి మరీ కేసు నమోదు చేసిన అధికారి ఒకరైతే... కానిస్టేబుల్ పైరవీ చేయడంతో ఓ పిక్ పాకెటర్‌ను విడిచిపెట్టిన అధికారి మరొకరు... నల్లగొండలో జైలుకు వెళ్లిన కానిస్టేబుల్ ఈశ్వర్ వ్యవహారంతో నగర పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో దొంగలతో మిలాఖత్ అయిన, వారికి సహకరిస్తున్న పోలీసుల వ్యవహారాలను వెలికితీస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది చేసిన దందాలను గుర్తించారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తక్షణం మారిపోయిన సీన్.. చట్ట ప్రకారం నేరం ఎక్కడ జరిగితే కేసు ఆ పరిధిలోకి వచ్చే ఠాణాలోనే నమోదు చేయడమో, జీరో ఎఫ్ఐఆర్ కట్టి అక్కడికి బదిలీ చేయడమో జరగాలి. సామాన్యులు తీవ్రంగా నష్టపోయిన అంశాల్లోనూ పోలీసులు ఇదే చేస్తుంటారు. ఈ ‘బాధిత ముఠా’ కోసం సదరు అధికారి ఆ నిబంధనను తుంగలో తొక్కారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి వెస్ట్ జోన్ పరిధిలో ఉండగా గుట్ట వరకు ఎత్తుకుపోయారు అనే మెలిక పెట్టారు. దీంతో కేసు పరిధి పశ్చిమ మండలంలోని ఠాణాకు మారిపోయింది. ఈ కేసు ‘దర్యాప్తు’ చేసిన సదరు అధికారి అవతలి ముఠాను పట్టుకుని రూ.20 లక్షల వరకు ‘రికవరీ’ చేసి ‘బాధితులకు’ అందించాడు. తన వాటాగానూ పెద్ద మొత్తమే తీసుకున్నాడు. ఇది ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్ట వ్యవహారం వెస్ట్‌కు వచ్చింది.. 2019లో యాదగిరిగుట్టలో జరిగిన ఓ వివాదానికి సంబం«ధించిన కేసు నగరంలోని వెస్ట్‌జోన్ పరిధిలో ఉన్న ఓ ఠాణాలో నమోదైంది. ఈ కేసును ‘పరిష్కరించిన’ సదరు అధికారి రూ.10 లక్షలకు పైగా ‘రికవరీ’ చేసి తమ ముఠాకు అప్పగించాడు. 2018–19ల్లో రెండు పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ యాదగిరిగుట్ట పరిధిలో విరుచుకుపడ్డాయి. డబ్బు పంపకాలకు సంబంధించి వీటి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఓ గ్యాంగ్‌పై దాడి చేసిన మరో గ్యాంగ్ మొత్తం సొమ్ము కాజేసింది. ఈ ‘బాధిత గ్యాంగ్’తో అప్పట్లో పశి్చమ మండల పరిధిలోని ఓ ఠాణాలో పని చేసిన ఇన్స్పెక్టర్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చి జరిగిన విషయం ఈయనకు చెప్పడంతో వీళ్లకు రావాల్సిన డబ్బు రికవరీ కోసం భారీ స్కెచ్ వేశాడు. పిక్ పాకెటర్ నుంచి రూ.3 లక్షలు వసూలు.. ఈ అధికారి వ్యవహారం ఇలా ఉండగా.. మరో అధికారి ఏకంగా తన కార్యాలయంలోనే సెటిల్మెంట్ చేశారు. పక్షం రోజుల క్రితం ఈ ఉదంతం చోటుచేసుకుంది. నందనవనం ప్రాంతానికి చెందిన ఓ పిక్ పాకెటర్‌ను నగర పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ నాగోల్ వద్ద పట్టుకున్నారు. ఇతగాడిని తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించడానికి సిద్ధమయ్యారు. ఈలోపు విషయం తెలుసుకున్న ఓ ‘పోలీసు దొంగ’ రంగంలోకి దిగాడు. ఆ పిక్ పాకెటర్‌ను విడిచిపెట్టడానికి రూ.2 లక్షలు అధికారికి ఇచ్చేలా, వేరే ఇద్దరు నేరగాళ్లకు పట్టిచ్చేలా సెటిల్మెంట్ చేశాడు. ఇది తెలుసుకున్న కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెటిల్మెంట్లో ఇవ్వాల్సిన మొత్తం రూ.3 లక్షలకు పెరిగి ముగ్గురికీ గిట్టుబాటైంది. కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న కొత్వాల్.. నగరంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇవి పూర్తిగా మారిపోయాయి. సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఆయన వీలున్నంత వరకు సిబ్బందికి ఏ లోటు లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం, పోలీసు విభాగానికి మచ్చ తెచ్చే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించట్లేదు. ఈ నేపథ్యంలోనే గడచిన ఏడాది కాలంలో పదులు సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. ఈ పోలీసు దొంగల దోస్తీ వ్యవహారాన్నీ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ చేయిస్తుండటంతో ఈశ్వర్‌తో పాటు ముగ్గురు ఇన్స్పెక్టర్లు, అయిదుగురు కానిస్టేబుళ్ల వ్యవహారాలు బయటపడినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక విభాగంలోనూ పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై నివేదికల ఆధారంగా ఉద్వాసన చెప్పాలని కూడా కొత్వాల్ ఆనంద్ నిర్ణయించినట్లు సమాచారం. -
‘ప్రపంచ దేశాలన్నీ సహకరించుకోకపోతే వినాశనమే’
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోతే వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు. నరక కూపం దిశగా ప్రపంచ పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు. ఈజిప్ట్‌లోని షెర్మ్–ఎల్–షేక్‌లో సోమవారం కాప్–27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్ ప్రసంగించారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తుచేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని గుటేరస్ కోరారు. మనకున్న సమయం పరిమితం వాతావరణ మార్పులకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్–సిసీ ఉద్ఘాటించారు. మనం జోక్యం చేసుకోకపోతే వాతావరణ మార్పులు ఎప్పటికీ ఆగవని అన్నారు. సమయం పరిమితంగానే ఉందని, ప్రతి సెకెన్ కాలాన్ని వాడుకోవాలని సూచించారు. యుద్ధాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న పేద దేశాలకు ధనిక దేశాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని నైజీరియా పర్యావరణశాఖ మంత్రి మొహమ్మద్ అబ్దుల్లాహీ కోరారు. ఇందుకోసం క్లైమేట్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. -
ప్లీజ్.. సహకరించండి!
ఖాండ్వా: భూసేకరణ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. బిల్లులో రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్నైనా తొలగించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదానికి సహకరించాలని రాజ్యసభలోని విపక్ష సభ్యులను అభ్యర్థించారు. 'రాజ్యసభలో మాకు మెజారిటీ లేదనేది వాస్తవం. మీ(విపక్షం) మద్దతు లేకుండా అభివృద్ధి పనులు కొనసాగించలేం. మెజారిటీ ఉంది కదా అని అభివృద్ధిని అడ్డుకోవద్దని మిమ్మల్ని బహిరంగంగా అభ్యర్థిస్తున్నా' అన్నారు. 'నేను రైతు వ్యతిరేకిని కాదని రాజ్యసభలోని అన్ని పార్టీలకు చెప్పాను. బిల్లులో రైతు వ్యతిరేక ప్రతిపాదనలేమైనా ఉంటే చెప్పమన్నాను. వాటిని తొలగించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాను. కానీ వారు ఏమీ చెప్పలేదు. ఈ ప్రభుత్వం పనిచేయడం, దేశం అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు' అని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో శ్రీ సింగాజీ థర్మల్ విద్యుత్కేంద్రంలోని ఒక్కొక్కటి 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్లను గురువారం ప్రధాని జాతికి అంకితమిచ్చారు. అలాగే, ఆ ప్రాజెక్టు రెండోదశలో భాగంగా ఒక్కోటి 660 మెగావాట్ల సామర్థ్యం గల మరో రెండు విద్యుత్కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు, ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. నేను రైతు వ్యతిరేకిని కాదు. మేమెప్పటికీ రైతులను వ్యతిరేకించబోం. పాఠశాలలకు, ఆసుపత్రులకు, జలవనరుల ప్రాజెక్టులకు, రహదారుల నిర్మాణానికి, గృహ నిర్మాణానికి.. భూమిని సేకరించే ప్రతిపాదన గత ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టంలో లేదు. మేం వాటిని తాజా బిల్లులో పొందుపర్చాం. మీరు చెప్పండి.. ఆ సౌకర్యాలు మీకు అక్కర్లేదా? అన్ని వర్గాల సంక్షేమానికి అవసరమైన చర్యలను బడ్జెట్లో పొందుపర్చాం. మొత్తం 204 బ్లాకులకు గానూ కేవలం 19 బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా రూ. 1.1 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. మా విధానాల వల్ల బొగ్గు గనులున్న రాష్ట్రాలు కూడా అధిక లాభాలు ఆర్జిస్తాయి. 4 బ్లాకుల ద్వారా మధ్యప్రదేశ్ రూ. 40 వేల కోట్ల ఆదాయం పొందుతోంది.