పారిశ్రామికాభివృద్ధికి సహకారం
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వ యంత్రాగం సంపూర్ణ సహకారం అందిస్తుందని జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ చెప్పారు. జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక కార్యక్రమం (ఎక్స్పో-2014) శనివారం నగరంలోని స్వర్ణ భారతి కమ్మవారి కళ్యాణ మండపంలో జరిగింది. దీనిని కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికాభివృద్ధి (ఎంఎస్ఎంఈ) సంస్థ; ఖమ్మం వాణిజ్య సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని జేసీ సురేం ద్రమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ.. జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు బ్యాం కర్లు సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ ఇచ్చేందుకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా ప్రయత్నిస్తామన్నారు. సత్తుపల్లిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫుడ్ పార్క్ కోసం కేటాయించే ప్రక్రియలోని అడ్డంకులను తొలగించామన్నారు. ప్రస్తుతమున్న నియమాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో భూసేకరణ చాలా కష్టమని అన్నారు. మైదాన ప్రాం తాల్లో భూమి సేకరించవచ్చన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య దృష్ట్యా, సోలార్ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అన్నారు. బొగ్గు నిక్షేపాలతో, గోదావరి జలాలతో ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు.
ఎంఎస్ఎంఈ సంస్థ సంచాలకుడు జిఆర్.అక్కాదాస్ మాట్లాడుతూ... జాతీ య నైపుణ్యం అభివృద్ధి కేంద్రాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ డి.శ్రీనివాసనాయక్ మాట్లాడు తూ.. అవగాహన లోపం, ఆర్థిక స్థితిగతుల కారణంగా జిల్లాలో పరిశ్రమల నెలకొల్పటంలో వెనుకబాటు ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, గ్రానైట్ స్లాబ్ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు ఎస్.రమేష్‌రెడ్డి, జిల్లా చిన్నతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఎస్ఆర్ఎల్.ప్రసాద్, గ్రానైట్ టైల్స్ ఫ్యాక్టరీ ఓనర్స్ సంఘం అధ్యక్షుడు ఎన్.కోటేశ్వరరావు, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అధ్యక్షుడు ఎపికె.రెడ్డి, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏడీ కోటిరెడ్డి కూడా మాట్లాడారు. అనంతరం, ఎక్స్పోను జేసీ ప్రారంభించి తిలకించారు.