The corporate Level
-
భూమ్ భూమ్ షకలక!
విజయవాడ, గుంటూరుల్లో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు, ప్రాజెక్టులు యువతకు ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం విజయవాడ: స్థిరాస్తి నిపుణులకు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే ముందుగా అడిగే ప్రశ్న.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రియల్ బూమ్ ఎలా ఉందని? విజయవాడ, గుంటూరుల్లో ప్రస్తుతం ఎవరిని కదిపినా.. భూములు, స్థలాల ప్రస్థావనే. అక్కడ ధర ఎంతుందంటే.. ఇక్కడెంతుందంటూ చర్చలే చర్చలు. నిన్నమొన్నటిమ వరకు కార్పొరేట్ స్థాయి రియల్ సంస్థలు, నగరంలోని వందల మంది బిల్డర్లు, మధ్యవర్తులే ఈ రంగానికి చోదకులు. కానీ, ఇప్పుడు దశ తిరిగింది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతోన్న జోరు వందల మంది యువతకు ఉపాధిని కల్పిస్తోం ది. పెద్ద స్థాయిలో వెంచర్లు వేసి రియల్ రంగంలో అనుభవం ఉన్న పలు సంస్థలు మొదులుకొని, చిన్నపాటి సంస్థల వరకు అన్నీ కుర్రాళ్లను పెట్టుకొని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. మార్కెట్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద సంస్థల్లో ఒక్కో దానిలో సుమారు 200 నుంచి 400 మంది సిబ్బందిగా పనిచేస్తుండగా ఇందులో 60 శాతం మంది యువకులే ఉండటం గమనార్హం. వాక్చాతుర్యం ఉంటేనే రాణింపు ఈ రంగంలో వాక్చాతుర్యం ఉంటేనే రాణిస్తారు. ఈ రంగంలో రూ. కోట్లలొ చేతులు మారుతుంటాయి. మిగిలిన రంగాలకంటే అతి కష్టం, వరస కుదిరితే డబ్బు సంపాదించటం సునాయాసం. ఇది పూర్తిగా వ్యక్తిగా వ్యవహారం . ఒక సారి పెట్టుబడి పెట్టి జీవితాంతం అనుభవించే ఆస్తికి సంబంధించి ఒక ప్లాటు కొనిపించాలంటే అష్టకష్టాలు పడాల్సిందే నని ఈ రంగంలో నిపుణులు అంటుంటారు. ఒకోప్టాటు కొనిపించటానికి ఒకోసారి కుటుంబంలో అందరిని ఒప్పించాల్సిన పరిస్థితి వుంటుంది. ఆస్థిపై ఏవిదంగా పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు, తదితర అంశాలు వివరంగా చెప్పగలిగే సమర్ధత వుండాలి. ఈ రంగంలోరాణించాలంటే బంగారం, షేర్లు బిజినెస్‌లపై అవగాహన ఉండాలి. అనుభవంతో వేతనం ఈ రంగంలోకి వచ్చిన యువతకు తాము సాధించిన అనుభం, చాకచక్యం తెలివితేటలకు తగ్గట్టు పెద్ద సంస్తలు వేతనాలు ఇస్తున్నారు. కొన్ని రకాల చిన్న సంస్థలు వారు చేసిన వ్యాపారాన్ని బట్టి ఇన్సెంటివ్‌లు, కమీషన్లు ఇస్తున్నారు.కొత్తగా ఈ రంగంలోకి వచ్చే యువతను 3-6నెలలు పని తీరు గమనిస్తారు. పెద్ద సంస్థలలో పని చేసే సిబ్బంది రోజుకు ఉదయం, సాయంత్రం నలుగురిని కలుస్తారు. ఈ విదంగా నెలలో ప్రతీ ఒక్కరు కనీసం వంద మందిని కలివాలి. వారిలో కనీసం 10 మందితో ప్లాటు కొనుగోలు చేయించేలా లక్ష్యాలు విదిస్తారు. ఈక్రమంలో లక్ష్యాలను సాధించిన వారు మంచి వేతనంతో పాటు ఇన్సెంటివ్కూడా పొందుతారు. సాధారణంగా రియల్ ఏస్టేట్ బ్రోకర్లు ఆస్తుల అమ్మకాలపై రెండు శాతం కమీషన్ పొందుతుంటారు. అదేతరహాలో రియల్ ఏస్టేట్ సంస్థలు కూడా తమ ఏజెంట్లకు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. ఫ్రీలాన్స్ ఏజెంట్లుగా ఈ రంగంలో మార్కెటింగ్ ఫీల్డ్‌లో అనుభవం సంపాదించాక కొందరు ఏజెంట్లు ఫీలాన్స్గా వ్యాపారం చేస్తున్నారు. ఒకే సంస్థలలో పని చేయటం ఇష్టం లేక ఫ్రీలాన్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారే 10 నుంచి 15 మంది యువకులను ప్రోగు చేసేకుని అన్ని రియల్ ఏస్టేట్ సంస్థలకు వెళ్లి వారి వెంచర్లను బ్రోచర్లను తీసుకుని మార్కెటింగ్ చేస్తుంటారు. వినియోగదారుని అభిరుచిని బట్టి ఆయా సంస్థలలో సౌకర్యాలు వసతులు, బ్యాంకులు ఇస్తున్న రుణాల వివరాలు చెప్పి అమ్మకాలు చేసి కమీషన్ పొందుటుంటారు. అతికష్టమైన ఈరంగంలో వందలాదిమం ది వచ్చి సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నాకని రియల్ ఏస్టేట్ రంగంలో నిపుణులు చెపుతున్నారు. -
‘ఆదర్శ’ చదువులు ఇలా..
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉత్తమమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ఆదర్శ మోడల్ పాఠశాలలను అందుబాటులోకి తెచ్చింది. 2013-14 విద్యాసంవత్సరంలో జిల్లాకు 13 పాఠశాలలు మంజూ రు కాగా, ఏడు మండలాల్లో పాఠశాలలను ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ, పోటీ పరీక్షలకు తయారు చేయడం బాధ్యతగా పాఠశాలలో బోధన ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇంటి వాతావరణాన్ని మరిపిస్తూ, చదువుపై ఆసక్తి పెరిగేలా ఉపాధ్యాయుల బోధన ఆకట్టుకుంటుంది. ఇందులో ఆరో తరగతిలో ప్రవేశించిన విద్యార్థికి మహర్దశ చేకూరనుంది. ఒక్కసారి ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య వరకు ఉచితంగా బోధించనున్నారు. ప్రవేశం పొందిన బాల, బాలికలకు చదువుతోపాటు దుస్తులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించనున్నారు. ప్రవేశం జిల్లాలోని మందమర్రి, ఆసిఫాబాద్, కుంటాల, బజర్హత్నూర్, జైనథ్, ఆదిలాబాద్, దండేపల్లి మండలాలకు పాఠశాలలు మంజూరయ్యాయి. 2014-15 విద్యా సంవత్సరంలో ఆరో తరగతితో పాటు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలోకి విద్యార్థులను చేర్చుకోనున్నారు. ఆరో తరగతిలో చేరడానికి ఐదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో గానీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన విద్యార్థి దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. రిజర్వేషన్ ఆధారంగా డ్రా పద్ధతిన విద్యార్థులను ఆరో తరగతికి ఎంపిక చేస్తారు. పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ఇంటర్లో విద్యార్థికి ప్రవేశం కల్పిస్తారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. బాలబాలికలకు కలిపి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తారు. సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు ఉంటారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపులో 20 మంది విద్యార్థులకే అవకాశం ఈ విద్యా సంవత్సరంలో ఉంటుంది. దరఖాస్తు 2014-2015 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 15న పూర్తయ్యింది. ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలల వారీగా డ్రా తీయనున్నారు. ఇంటర్లో ప్రవేశానికి ఈనెల 30 తేదీలోగా పాఠశాలల వారీగా పాఠశాల మండల పరిధిలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశం పొందిన విద్యార్థులకు జూన్ 12 తేదీ నుంచి తరగతులను నిర్వహిస్తారు. వసతి బాల, బాలికలకు ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచితంగా వసతి కల్పించనున్నారు. జిల్లాలో వసతి గృహాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విద్యార్థులు ఇంటి నుంచే పాఠశాలకు రావలసి ఉంటుంది. బోధన ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇస్తారు. చదువుతో పాటు ప్రతి రోజు రెండు గంటల సమయాన్ని వెచ్చించి కంప్యూటర్ విద్య, కళలు, క్రీడలు నేర్పుతారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు గ్రాడ్యుయేట్(డిగ్రీ)తోపాటు బీఈడీ చదివిన వారు బోధిస్తారు. తొమ్మిది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ)తోపాటు బీఈడీ చదివిన వారు తరగతులను నిర్వహిస్తారు.