భూమ్ భూమ్ షకలక! | Vijayawada, Guntur large-scale real-ventures | Sakshi
Sakshi News home page

భూమ్ భూమ్ షకలక!

Published Sun, Sep 14 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

భూమ్ భూమ్ షకలక!

భూమ్ భూమ్ షకలక!

విజయవాడ, గుంటూరుల్లో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు, ప్రాజెక్టులు  యువతకు ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
 
విజయవాడ: స్థిరాస్తి నిపుణులకు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే ముందుగా అడిగే ప్రశ్న.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రియల్ బూమ్ ఎలా ఉందని? విజయవాడ, గుంటూరుల్లో ప్రస్తుతం ఎవరిని కదిపినా.. భూములు, స్థలాల ప్రస్థావనే. అక్కడ ధర ఎంతుందంటే.. ఇక్కడెంతుందంటూ చర్చలే చర్చలు. నిన్నమొన్నటిమ వరకు కార్పొరేట్ స్థాయి రియల్ సంస్థలు, నగరంలోని వందల మంది బిల్డర్లు, మధ్యవర్తులే ఈ రంగానికి చోదకులు. కానీ, ఇప్పుడు దశ తిరిగింది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతోన్న జోరు వందల మంది యువతకు ఉపాధిని కల్పిస్తోం ది. పెద్ద స్థాయిలో వెంచర్లు వేసి రియల్ రంగంలో అనుభవం ఉన్న పలు సంస్థలు మొదులుకొని, చిన్నపాటి సంస్థల వరకు అన్నీ కుర్రాళ్లను పెట్టుకొని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. మార్కెట్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద సంస్థల్లో ఒక్కో దానిలో సుమారు 200 నుంచి 400 మంది సిబ్బందిగా పనిచేస్తుండగా ఇందులో 60 శాతం మంది యువకులే ఉండటం గమనార్హం.

వాక్‌చాతుర్యం ఉంటేనే రాణింపు

ఈ రంగంలో వాక్‌చాతుర్యం ఉంటేనే రాణిస్తారు. ఈ రంగంలో రూ. కోట్లలొ చేతులు మారుతుంటాయి. మిగిలిన రంగాలకంటే అతి కష్టం, వరస కుదిరితే డబ్బు సంపాదించటం సునాయాసం. ఇది పూర్తిగా వ్యక్తిగా వ్యవహారం . ఒక సారి పెట్టుబడి పెట్టి జీవితాంతం అనుభవించే ఆస్తికి సంబంధించి ఒక ప్లాటు కొనిపించాలంటే అష్టకష్టాలు పడాల్సిందే నని ఈ రంగంలో నిపుణులు అంటుంటారు. ఒకోప్టాటు కొనిపించటానికి ఒకోసారి కుటుంబంలో అందరిని ఒప్పించాల్సిన పరిస్థితి వుంటుంది. ఆస్థిపై ఏవిదంగా పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు, తదితర అంశాలు వివరంగా చెప్పగలిగే సమర్ధత వుండాలి. ఈ రంగంలోరాణించాలంటే బంగారం, షేర్లు బిజినెస్‌లపై అవగాహన ఉండాలి.
 అనుభవంతో వేతనం

ఈ రంగంలోకి వచ్చిన యువతకు  తాము సాధించిన అనుభం, చాకచక్యం తెలివితేటలకు తగ్గట్టు పెద్ద సంస్తలు  వేతనాలు ఇస్తున్నారు. కొన్ని రకాల చిన్న సంస్థలు వారు చేసిన వ్యాపారాన్ని బట్టి ఇన్సెంటివ్‌లు, కమీషన్‌లు ఇస్తున్నారు.కొత్తగా  ఈ రంగంలోకి వచ్చే  యువతను 3-6నెలలు పని తీరు గమనిస్తారు. పెద్ద సంస్థలలో పని చేసే సిబ్బంది రోజుకు  ఉదయం, సాయంత్రం నలుగురిని  కలుస్తారు. ఈ విదంగా నెలలో ప్రతీ ఒక్కరు కనీసం వంద మందిని కలివాలి. వారిలో కనీసం 10 మందితో ప్లాటు కొనుగోలు చేయించేలా లక్ష్యాలు విదిస్తారు.  ఈక్రమంలో లక్ష్యాలను సాధించిన వారు మంచి వేతనంతో పాటు ఇన్సెంటివ్‌కూడా పొందుతారు. సాధారణంగా రియల్ ఏస్టేట్ బ్రోకర్లు ఆస్తుల అమ్మకాలపై రెండు శాతం కమీషన్ పొందుతుంటారు. అదేతరహాలో రియల్ ఏస్టేట్ సంస్థలు కూడా తమ ఏజెంట్లకు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి.

ఫ్రీలాన్స్ ఏజెంట్లుగా

ఈ రంగంలో మార్కెటింగ్ ఫీల్డ్‌లో అనుభవం సంపాదించాక కొందరు ఏజెంట్లు ఫీలాన్స్‌గా వ్యాపారం చేస్తున్నారు.   ఒకే  సంస్థలలో పని చేయటం ఇష్టం లేక ఫ్రీలాన్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారే 10 నుంచి 15 మంది యువకులను ప్రోగు చేసేకుని అన్ని రియల్ ఏస్టేట్ సంస్థలకు వెళ్లి వారి వెంచర్లను బ్రోచర్లను తీసుకుని మార్కెటింగ్ చేస్తుంటారు. వినియోగదారుని అభిరుచిని బట్టి ఆయా సంస్థలలో సౌకర్యాలు వసతులు, బ్యాంకులు ఇస్తున్న రుణాల వివరాలు చెప్పి అమ్మకాలు చేసి కమీషన్ పొందుటుంటారు. అతికష్టమైన ఈరంగంలో వందలాదిమం ది వచ్చి సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నాకని రియల్ ఏస్టేట్ రంగంలో నిపుణులు చెపుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement