Cost Management
-
రైట్స్ కు నేషనల్ అవార్డు
రైల్వే కన్సల్టెన్సీ సంస్థ రైట్స్... కాస్ట్ మేనేజ్మెంట్లో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ పబ్లిక్ సర్వీస్ సెక్టార్ (మీడియం) కేటగిరి కింద 13వ నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. దేశ రాజధాని ఢి ల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ నజీబ్ షా చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకుంటున్న రైట్స్ సీఎండీ రాజీవ్ మెహ్రొత్రా. -
వీడియోకాన్‌కు కాస్ట్ మేనేజ్మెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్
హైదరాబాద్ : వీడియోకాన్ కంపెనీకి కాస్ట్ మేనేజ్మెంట్లో ఎక్స్లెంట్(2014వ సంవత్సరం) అవార్డ్ లభించింది. ద ఇనిస్టిట్యూట్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) అందిస్తున్న ఈ అవార్డును వరుసగా మూడో ఏడాది గెల్చుకున్నామని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ సంస్థల కేటగిరిలో ప్రైవేట్ తయారీ రంగంలో ఈ అవార్డును గెల్చుకున్నామని వీడియోకాన్ గ్రూప్ సీఎఫ్ఓ సునీల్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డ్ స్వీకరించామని తెలిపారు. వీడియోకాన్ ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్లనే ఈ గుర్తింపు లభించిందని వివరించారు.