council meet
-
ఢిల్లీలో నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం
-
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆతిథ్యం
సాక్షి, అమరావతి: సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశానికి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 4వ తేదీన తిరుపతిలో ఈ సమావేశాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. దీంతో పాటు ఈ సమావేశంలో చర్చించనున్న ఎజెండా అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి (ప్రస్తుతం సీఎం లేరు) నుంచి ముఖ్యమంత్రులు.. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ప్రధానంగా 26 అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజన్ గుల్జార్, అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ స్పెషల్ సెక్రటరీ మధుసూధన్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ శ్యామల రావు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆతిథ్యం
-
పంతాలకు పోయి..
‘అనంత’ నగర పాలక సంస్థ సమావేశం గందరగోళం అనంత మేయర్, ఎమ్మెల్యే వర్గాల మధ్య వాగ్వాదం సమావేశం నుంచి వాకౌట్ చేసిన చౌదరి వర్గం జిల్లా కార్యాలయాలకు స్థల కేటాయింపుపై వైఎస్సార్ సీపీ అభ్యంతరం అనంతపురం న్యూసిటీ : నగర పాలక సంస్థలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయుల తీరు మారలేదు. ఎప్పటిలాగే మేయర్ స్వరూపను లక్ష్యంగా చేసుకుని సర్వసభ్య సమావేశాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతపురం మేయర్ స్వరూప అధ్యక్షతన శనివారం జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కారణాలను చూపుతూ ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు గందరగోళాన్ని సృస్టించారు. ఆఖరుకు నల్లరిబ్బన్లు, ప్లకార్డుల ప్రదర్శన కూడా చేశారు. ప్రతి డివిజన్ కార్పొరేటర్‌కు అవకాశం కల్పిస్తామని, వారి పరిధిలో నెలకొన్న సమస్యలు వివరించాలని ఇందుకు చివరిలో అధికారులు వివరణ ఇస్తారని మేయర్ పేర్కొనడంతో డిప్యూటీ మేయర్ గంపన్న అభ్యంతరం తెలిపారు. సమస్య చెప్పిన వెంటనే సమాధానం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఆయనకు టీడీపీ కార్పొరేటర్లు సరిపూటి రమణ, విజయశ్రీ, బల్లాపల్లవి, సద్దల హేమలత, లక్ష్మిరెడ్డి మద్దతు పలికారు. ఇందుకు మేయర్ అంగీకరించకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేశారు. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కోఆప్సన్ సభ్యురాలు శివబాల వాపోయారు.తన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థకు చెందిన విలువైన స్థలాన్ని కలెక్టర్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బీసీ భవన్, బీసీ బాలికల వసతి గృహం నిర్మించేందుకు కేటాయించడాన్ని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బాలాంజినేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలను హిందూపురం నియోజకవర్గమైన రాప్తాడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకమని అన్నారు. ఈ మూడు అంశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, గూడూరు మల్లికార్జున, షుకూర్, గంగన హిమబిందు, టీడీపీ కార్పొరేటర్లు సైతం మద్దతు తెలిపారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు మేయర్ తెలిపారు. నడిమివంక వద్ద పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉందని గంగన హిమబిందు తెలిపారు. భరించలేని కంపుతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో పందులు, కుక్కలు స్వైర్యవిహారం చేస్తున్నాయని, చెత్త సేకరణ జరగడం లేదంటూ బోయ గిరిజమ్మ, జానకి, షుకూర్, చింతకుంట సుశీలమ్మ, పక్కీరమ్మ హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడిపత్రి రోడ్డు మార్గానికి రూ 25.09 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు కావడం వెనుక ఎమ్మెల్యే కృషి ఉందన్న మేయర్ వాదనను నాల్గో డివిజన్ కార్పొరేటర్ కోగటం శ్రీదేవి త్రోసిపుచ్చారు. ఎమ్మెల్యే కృషి కాదని, ఎంపీ దివాకర్‌రెడ్డి చొరవతోనే నిధులు మంజూరయ్యాని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న భవ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ షుకూర్, జానకి డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మేయర్ స్వరూప, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి పేర్కొన్నారు. అనంతరం అజెండాలోని 24 అంశాల్లో ఒకటి మినహా మిగిలిన వాటిని ఆమోదించారు. -
టీడీపీ కౌన్సిలర్ల దౌర్జన్యం
– కౌన్సిల్‌మీట్‌లో ఇరువర్గాల మధ్య తోపులాట – పింఛన్ల మంజూరులో వివక్షపై ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన గుంతకల్లు టౌన్ : గుంతకల్లులో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ కోడెల అపర్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రణరంగమైంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కాకుండా జన్మభూమి కమిటీలు సూచించిన వారికే పింఛన్లు మంజూరు చేయడం పట్ల నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై పలువురు టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారు. సమావేశంలో కౌన్సిలర్ల సమస్యలేవి వినకుండా అజెండాను చదవమని చైర్పర్సన్ ఆదేశించారు. ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్‌మాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అహ్మద్‌బాషా, గోపి, పోలేపల్లి మధు, రంగన్న, నగేష్, కెవి.నాగరత్న, ఏపీ.శ్రీవిద్య, బీటీ.లక్ష్మిదేవి, మస్తానమ్మలు లేచి పింఛన్ల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనమేంటని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. అంతలోనే వైస్‌చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్ అజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ చైర్పర్సన్ పోడియంను ప్రతిపక్ష కౌన్సిలర్లు చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపక్ష కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి బయటకెళ్లేందుకు యత్నించారు. తమకు సమాధానం చెప్పేంతవరకు బయటకెళ్లొదని కౌన్సిల్‌హాల్ ఎంట్రెన్స్‌లో నిల్చున్న ప్రతిపక్ష కౌన్సిలర్లపై దురుసుగా ప్రవర్తించి ఈడ్చేశారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులంతా ప్రేక్షకపాత్రను పోషించారు. చివరకు అజెండాలోని అంశాలపై కూడా చర్చించకుండానే ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్లు ప్రకటించడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. అందరికీ సమానంగా మంజూరు చేశాం : మొత్తం 1,250 మందికి గానూ 700 పింఛన్లు మంజూరయ్యాయని, అన్నివార్డులకు సమానంగా పింఛన్లు మంజూరు చేశామని చైర్పర్సన్ కోడెల అపర్ణ, వైస్‌చైర్మన్ శ్రీనాథ్గౌడ్లు తెలిపారు. సీపీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ పార్టీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించలేదని, అనవసరమైన ఆరోపణలు చేయడం మాని, పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. -
ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు
► వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌పై దాడికి యత్నించడం దారుణం ► టీడీపీ కౌన్సిలర్లపై ప్రతిపక్ష నాయకుడు శివ ధ్వజం హిందూపురం అర్బన్ : కౌన్సిల్ సభలో ప్రతిపక్షాల మాటలకు నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ గొంతులు నొక్కేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు శివ ధ్వజమెత్తారు. కౌన్సిల్లో ప్రతిపక్ష నేతకు మాట్లాడే హక్కు ఉంటుందని చెబుతున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రహెమాన్‌పై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు చుట్టుముట్టి ముప్పేట దాడికి యత్నించడం దారుణమన్నారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి అధ్యక్షతన, ఇన్చార్జ్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. సభలో ప్రతిపక్ష నేత శివ మాట్లాడుతూ ‘గతంలో నీరు – చెట్టు కార్యక్రమం కింద వేలాది మొక్కలు నాటారు. అందులో సగం కూడా పెరగలేదు. ఇప్పుడు వనం – మనం అని తిరిగి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఫొటోల కోసం కాకుండా బాధ్యతగా నాటి వాటిని పరిరక్షించాలి’ అన్నారు. ఇంతలోనే చైర్పర్సన్ లక్ష్మి అడ్డుకున్నారు. మొక్కలు పెంచడం వృథా అంటున్నారా? గతంలో డయల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమం కూడా సొంత ఇమేజ్ కోసం అన్నార ని మండిపడ్డారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు శివను మాట్లాడకుండా విరుచుకుపడ్డారు. మొక్కల పెంపకంపై బాధ్యత ఉండాలని చెబుతుంటే ఏదేదో ఊహించుకుంటున్నారని శివ వాపోయారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు జనన సర్టిఫికెట్లు పొందటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నార ని దీనిపై స్పష్టత ఇవ్వాలని కౌన్సిలర్ శివ కోరగా.. సీపీఐ కౌన్సిలర్ దాదాపీర్ కూడా మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు చేసి నార్మల్ డెలివరీ అయినట్టు రాసిస్తూ ఆస్పత్రుల నిర్వాహకులు ఐటీ ఎగవేత చేస్తున్నార ని ఆరోపించారు. అలాంటి వాటిపై నిఘా ఉంచి సక్రమంగా నమోదులు చేయాలన్నారు. ‘నువ్వు నీ వార్డు గురించే మాట్లాడు.. చాలా వార్డులో సరైన రోడ్లు, డ్రైన్లు లేకపోవడంతో వర్షపునీరు చేరి ముంపునకు గురవుతున్నారని శివ తెలిపారు. ఇంతలో చైర్పర్సన్ కల్పించుకుని నువ్వు (శివ) నీ వార్డు గురించే మాట్లాడు అన్నారు. ఇంతలోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రహెమాన్ మాట్లాడుతూ శివకు మాట్లాడే హక్కు ఉందన్నారు. అప్పుడు వైస్‌చైర్మన్ రాము కుర్చోమని గట్టిగా చెప్పడంతో రెహమాన్ నువ్వు మధ్యలో మాట్లాడద్దన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు ఒక్కసారిగా లేచి రెహమాన్‌ను చుట్టుముట్టారు. ఒక దశలో దాడి చేసే విధంగా ప్రవర్తించారు. ఇంతలోనే చైర్పర్సన్ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించివేశారు.