courses details
-
నచ్చిన కోర్సా.. మెచ్చిన కళాశాలా?
జేఎన్టీయూ : ఎంసెట్ రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈనెల 12 నుంచి ర్యాంకు కార్డులు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రోజే ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు. ఈ తరుణంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఏ కోర్సులో చేరాలి, ఏ కళాశాలను ఎంచుకోవాలి అనే సందిగ్దం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 16 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, 20కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వేల సంఖ్యలో సీట్లున్నా కళాశాలను, కోర్సును ఎంచుకోవడంలో తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఏ కళాశాలలో ఏయే కోర్సులు బాగున్నాయి, వాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని విస్తృతంగా పరిశీలిస్తున్నారు. కళాశాల ఎంపికే కీలకం నాణ్యమైన విద్యను అందించే కళాశాల ఎంపికే చాలా కీలకం. ఎంచుకున్న కళాశాలల ప్రాధాన్యత ఇంచు మించు ఒకేలా ఉన్నపుడే కోర్సు ఎంపిక ముఖ్యమవుతుంది. కళాశాలను ఎంపిక చేసుకునే క్రమంలో అక్కడ విద్యార్థికి దిశానిర్ధేశం చేసే వాతావరణం ఉందో లేదో తెలుసుకోవాలి. అక్కడి అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సాధించిన ఘనతను పరిగణలోకి తీసుకోవాలి. బోధన, ల్యాబ్ నాణ్యతగా ఉన్నాయా, లేదా అని పరీశీలించాలి. 100 శాతం ప్రాంగణ నియామకాలున్న వాటిపై దృష్టి పెట్టాలి. అలాగే కళాశాలకు రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆకతాయి చేష్టల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. భోదన, ప్రయోగశాల, గ్రంథాలయాలు, వసతి గృహం, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో వైబ్సైట్ల ద్వారానో, ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారానో తెలుసుకోవాలి. అక్కడ చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తెలిసిన వారితో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించాలి. వీటన్నింటికితోడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే నాలుగేళ్లపాటు చదవాల్సిన కళాశాల విషయంలో తప్పటడుగులు వేస్తే అది భవిష్యత్‌పై చెడు ప్రభావం చూపుతుంది. జిల్లాలో 8,050 సీట్లు జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలతోపాటు 16 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. 8,050 సీట్లు బీటెక్లోను, 360 సీట్లు బీఫార్మసీలోనూ ఉన్నాయి. ఎంసెట్‌కు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 7,600 మంది హాజరయ్యారు. ఇందులో 6,171 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు స్థానికులవుతారు. వచ్చిన ర్యాంకుల ఆధారంగా 85 శాతం సీట్లు వీరికే కేటాయిస్తారు. జేఎన్టీయూపైనే ఆసక్తి నాణ్యతతో కూడిన ఇంజనీరింగ్ విద్యనందించడం, ప్రాజెక్టుల్లో తర్ఫీదు ఇవ్వడం, టాప్ టెన్‌లో ఉన్న బహుళ జాతి సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌లు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు జేఎన్టీయూపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 285 మంది టీసీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సీటొస్తే ఉద్యోగం గ్యారంటీ అనే ధీమా వారిలో వ్యక్తమవుతోంది. ఎస్కేయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఇంజనీరింగ్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తారు. రెండు సంవత్సరాల నుంచి మెకానికల్ విభాగం ప్రారంభించారు. సివిల్, ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో నూతనంగా బీటెక్ బాలుర వసతి గృహాన్ని నిర్మించారు. నైపుణ్యమే ప్రామాణికం విద్యార్థి ఇంజనీరింగ్‌లో సాధించిన నైపుణ్యమే ఉద్యోగానికి తొలిమెట్టు. ప్రకటనల కన్నా స్వయంగా ఆయా కళాశాలలను పరిశీలించిన తర్వాతే చేరాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలి. 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. నాలుగేళ్లు ప్రణాళికాబద్ధంగా చదివితే ఎక్కడైనా ఉపాధి దొరుకుతుంది. - ఎ.ఆనందరావు, అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్, జేఎన్టీయూ అనుభవంతో కూడిన అధ్యాపకులు ఉండాలి ఇంజినీరింగ్‌ను ఆషామాషీగా అభ్యసించకూడదు. ఇంటి దగ్గర నుంచి కార్పొరేట్ కొలువుల వరకు విద్యార్థులను తీసుకెళ్లే బాధ్యత కళాశాలలదే. వాటిలో అనుభవమున్న అధ్యాపకులు, ఈ లెర్నింగ్ లాంటి సదుపాయాలు ఉండాలి. అన్ని బ్రాంచుల వారు ఐటీ వైపు వెళ్లడానికి అవకాశం ఉంది కాబట్టి బ్రాంచ్ ఎంపిక కీలకం కాబోదు. - కె.హేమచంద్రారెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్టీయూ ప్రకటనలు చూసి మోసపోవద్దు ప్లేస్‌మెంట్స్ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఆ ఉద్యోగాలు ఎలాంటి కంపెనీల్లో వచ్చాయో పరిశీలించాలి. ఇంజినీరింగ్ అంటే అందమైన ఊహాలోకం అనుకోకుండా నాలుగేళ్ల కోర్సు కష్టపడి చదవాలి. కేవలం పట్టా కోసమే చదివితే సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం లేదు. కమ్యూనికేషన్స్ స్కిల్స్‌పై దృష్టి సారించాలి. - కె.విజయ్‌కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్, జేఎన్టీయూ -
విద్య ఉద్యోగ అవకాశాలు
ప్రవేశాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్, భువనేశ్వర్ పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు * యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, బయోఫిల్మ్ అండ్ బ్యాక్టీరియల్ ప్యాథోజెనెసిస్ * డెవలప్మెంట్ ఆఫ్ నావల్ ప్రమోటర్ విత్ ఎన్హాన్స్డ్ ఆక్టివిటీ * జెనెటిక్స్ అండ్ మాలిక్యులార్ ఎనాలిసిస్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ * జీనోమిక్ ఇన్‌స్టెబిలిటీ అండ్ డిసీజెస్ * డ్రగ్ డిజైన్ అండ్ డిస్కవరి, బయోఇన్ఫర్మాటిక్స్ * వాస్క్యులర్ బయాలజీ అండ్ ట్యూ మర్ యాంజియోజెనెసిస్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 1 వెబ్సైట్: www.ils.res.in హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, లక్నో కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హతలు: ఎంబీబీఎస్/బీడీఎస్/బీఫార్మసీ/ బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 20 వెబ్సైట్: www.sgpgi.ac.in 3 ఫెలోషిప్స్: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీపీఆర్ఐ), బెంగళూరు రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కేటగిరీ: జూనియర్ రీసెర్చ్ ఫెలో/సీనియర్ రీసెర్చ్ ఫెలో విభాగాలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. గేట్/నెట్లో అర్హత సాధించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 25 వెబ్సైట్: www.cpri.in 4 ఉద్యోగాలు: సీపీఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీపీఆర్ఐ), బెంగళూరు తాత్కాలిక పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అసోసియేట్స్ అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ(మెకానికల్ లేదా సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆటోక్యాడ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: www.cpri.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు. -
ఎయిమ్స్ నుంచి ఎంఎస్సీ బయోటెక్నాలజీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి? -శ్రీకాంత్, జడ్చర్ల. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ). మాస్ కమ్యూనికేషన్‌కు సంబంధించి బోధన, శిక్షణ, పరిశోధన అంశాల్లో దేశంలోనే ప్రధానమైన ఐఐఎంసీ. న్యూఢిల్లీలోని ప్రధాన క్యాంపస్‌తోపాటు ఐజ్వాల్ (మిజోరం), అమరావతి (మహారాష్ట్ర), దెంకనల్ (బడిశా), జమ్మూ-కాశ్మీర్, కొట్టాయం (కేరళ)లలో రీజనల్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిల్లో అందుబాటులో ఉన్న కోర్సులు.. పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఇంగ్లిష్) పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (హిందీ) పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (రేడియో/టెలివిజన్) పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం (ఒడియా) అర్హత: బ్యాచిలర్ డిగ్రీ. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: www.iimc.nic.in ఎయిమ్స్ అందిస్తున్న ఎంఎస్సీ (బయోటెక్నాలజీ) కోర్సు వివరాలను తెలపండి? -రవి, కోదాడ. దేశంలోని ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థల్లో ఒకటైనా.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)-న్యూఢిల్లీ, మెడిసిన్‌తోపాటు హెల్త్‌కేర్‌కు సంబంధించి వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తుంది. వాటిల్లో మాస్టర్ ఇన్ బయోటెక్నాలజీ (ఎం. బయోటెక్నాలజీ) ఒకటి. రికాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీ, ఇమ్యునాలజీకి సంబంధించిన అధునాతన బయోటెక్నాలజీ పద్ధతులను ఉపయోగించి మెరుగైన చికిత్స అందించే అంశాలపై ఈ కోర్సులో శిక్షణనిస్తారు. ఈ కోర్సులో రికాంబినెట్ డీఎన్ఏ టెక్నాలజీ, టి సెల్ క్లోనింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ బయోమెడిసిన్ తదితర అంశాలు ఉంటాయి. అర్హత: 60 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ/ బీఫార్మసీ/బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరిపీ/బీఎస్సీ. ప్రవేశం: దేశ వ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ఏప్రిల్/మేలో వెలువడుతుంది. పరీక్షను జూన్/జూలైలో నిర్వహిస్తారు. పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో సంబంధిత సబ్జెక్ట్‌పై 90 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 90 నిమిషాల్లో సమాధానాలను గుర్తించాలి. వివరాలకు: www.aiimsexams.org చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న కోర్సులేవి? -చరణ్, గద్వాల్. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ను 1989లో ప్రారంభించారు. దీనికి 1996 నుంచి స్వయంప్రతిపత్తి హోదా లభించింది. దేశంలో మ్యాథమెటికల్ సెన్సైస్‌కు సంబంధించి బోధన, పరిశోధన రంగాల్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా దీని గుర్తింపు ఉంది. ఆఫర్ చేస్తున్న కోర్సులు.. బీఎస్సీ (ఆనర్స్-మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్- మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు) బీఎస్సీ (ఆనర్స్-మ్యాథమెటిక్స్, ఫిజిక్స్- మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్) పీహెచ్డీ (మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్) ప్రవేశం పొందిన విద్యార్థులకు కోర్సును బట్టి నెలవారీగా స్కాలర్షిప్ లభిస్తుంది. వివరాలు.. బీఎస్సీ (ఆనర్స్)- రూ. 4,000 (వీరికి ప్రైవేట్ డొనేషన్స్ ద్వారా నెలకు రూ. 1,000 అదనంగా లభిస్తుంది). ఎంఎస్సీ-రూ.6,000. పీహెచ్డీ-రూ. 16,000. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. పీహెచ్డీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి ఎన్బీహెచ్ఎం/సీఎస్ఐఆర్, జెస్ట్ స్కోర్ ఇంటర్వ్యూ ద్వారా. వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014 వివరాలకు: www.cmi.ac.in ఐఐటీ-రాజస్థాన్ ఆఫర్ చేసే బీటెక్ (బయాలాజికల్లీ ఇన్స్పైర్డ్ సిస్టమ్ సైన్స్) కోర్సు వివరాలను తెలపండి? -కిరణ్, ఖమ్మం. కాలక్రమేణా వస్తున్న మార్పులకనుగుణంగా ఐఐటీలు ఎన్నో నూతన కోర్సులను ప్రారంభిస్తున్నాయి. అలాంటి కోర్సుల్లో ఒకటి.. ఐఐటీ-రాజస్థాన్ ఆఫర్ చేస్తున్న బీటెక్ (బయాలాజికల్లీ ఇన్స్పైర్డ్ సిస్టమ్ సైన్స్). శాస్త్రం-దాని మూల భావనల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలనుకునే వారికి సరిపోయే కోర్సు ఇది. మానవ జీవితంలో కీలకమైన సమాజం, శాస్త్రం (సైన్స్), తత్వశాస్త్రం ఒకదానితోఒకటి ఎలా సంధానమై ఉన్నాయో విపులంగా వివరించడానికి ఈ కోర్సు దోహద పడుతుంది. కాలానుగుణంగా సైన్స్ పరిణామం, దాని స్వభావాన్ని వివరించేందుకు ఉద్దేశించిన ఈ కోర్సు నాలుగు మాడ్యుల్స్‌గా ఉంటుంది. మొదటి మాడ్యూల్లో సైన్స్ చారిత్రక నేపథ్యం, తాత్విక పునాదుల గురించి వివరిస్తారు. రెండో మాడ్యూల్లో ప్రధాన భావనలపై విశ్లేషణ, మూడో మాడ్యూల్లో ఇప్పటి వరకు సైన్స్ గురించి చోటు చేసుకున్న ముఖ్యమైన చర్చలు వంటి అంశాలను చేర్చారు. నాలుగో మాడ్యూల్లో జీవ శాస్త్రాల్లోని తాత్విక సమస్యలను చర్చిస్తారు. ఈ కోర్సులో పొందిన అవగాహన ద్వారా విద్యార్థులు సిస్టమ్ సైన్స్, పర్యావరణ వ్యవస్థ, వ్యాపార, ఆర్థిక రంగాల్లోని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పొందుతారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హెల్త్ కేర్, డిజైన్, పునరుత్పాదక ఇంధన రంగం, మెటీరియల్ సైన్స్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిర పడొచ్చు. వివరాలకు: www.iitj.ac.in