coustmer
-
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా!
Swiggy Delivery Boy: ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఏసీ గదుల్లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా ఏదో కారణాలు చెబుతూ అసంతృప్తి చెందుతూ ఉంటారు. అయితే మరి కొంతమంది వారు చేసే ఉద్యోగం చిన్నదైనా.. ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళుతుంటారు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేసే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల్లా సాహసాలు చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'సాహిల్ సింగ్'. ఇంతకీ ఈ సాహిల్ సింగ్ ఎవరు? అతనికొచ్చిన కష్టమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సాహిల్ సింగ్ మేవార్ యూనివర్సిటీ నుంచి 2018లో బిటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత నింజాకార్ట్‌లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్‌లో కూడా పనిచేశాడు. అయితే దేశంలో అధికంగా కరోనా మహమ్మారి సమయంలో తన సొంతూరుకు వెళ్ళిపోయాడు. కాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తరువాత మళ్ళీ స్విగ్గిలో డెలివరీ బాయ్ ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్న 'ప్రియాన్సీ చాందెల్' అనే మహిళ స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఆమెకు డెలివరీ బాయ్ సాహిల్ సింగ్ ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చిన తరువాత మెట్లపైన ఆయాసపడుతూ కూర్చున్నప్పుడు ఆమె ఏమైందని పలకరించింది. అప్పుడతడు.. మేడమ్, ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆర్డర్ డెలివరీ చేసాను. నా దగ్గర డబ్బు లేదు. ఉన్న డబ్బు మా ఫ్లాట్మేట్కి అవసరం ఉన్నాయంటే ఇచ్చాను. (ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్‌కి ఇది కదా శుభవార్త - ఈ ఆఫర్స్‌తో పండగ చేసుకోండి!) నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ నేను గ్రాడ్యుయేట్ చేసాను. ఇప్పటికే నింజాకార్ట్, బైజూస్‌లో కొద పనిచేసాను. ఇప్పుడు ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే నాకు రూ. 20 నుంచి రూ. 25 మాత్రమే వస్తాయని, అందులోనూ కస్టమర్ ఇచ్చిన టైమ్ లోపల డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా సరిగ్గా తిండి తిని వారం రోజులైందని, కేవలం టీ.. వాటర్‌తో గడిపేస్తున్నాని, అమ్మానాన్న వయసు కూడా పెరుగుతోందని ఇప్పుడు కూడా వారిపై ఆధారపడటం ఇష్టం లేదని, కనీసం నెలకు 25 వేలు సంపాదించాలనుందని, ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పాడు. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఇదంతా విన్న ప్రియాన్సీ చాందెల్ అతడు చెప్పినవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్ వంటి వాటిని కూడా యాడ్ చేసింది. ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్ లాంటి ఏదైనా జాబ్ దయచేసి చెప్పండని రిక్వెస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అతనికి డబ్బు సహాయం కూడా చేసారు, మరి కొంతమంది ఫుడ్ ఆర్డర్ కూడా చేశారు. చివరికి అతనికి ఉద్యోగం వచ్చేసింది. సాహిల్‌కి ఉద్యోగం లభించిందని ప్రియాన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. -
లబ్ధిదారులకు SBI శుభవార్త
-
బిర్యానీ రెడీ
రెండు కూరలు, పప్పు, పచ్చడి, అప్పడం, పెరుగుతో భోం చేస్తే షరా మామూలే! వారానికోసారైనా బిర్యానీ లాగించెయ్యడమే ఇప్పుడు నగరవాసుల కొత్త టేస్ట్. అదీ ఇంటిలో చేసింది కాదు.. బిర్యానీ పాయింట్‌కి వెళ్లి బిర్యానీ తినాల్సిందే. దీనికి అనుగుణంగానే నగరంలో భారీగా బిర్యానీ విక్రయ సెంటర్లు వెలిశాయి. ర్యానీ పాయింట్.. ఇప్పుడు నగరంలో ఇదో పెద్ద వ్యాపారం. నగర ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ బిర్యానీ తయారీ సెంటర్లు వెలుస్తున్నాయి. రోజూవారీ అమ్మకాలు ఒక్కో పాయింట్లో రూ.25 వేల పైబడే జరుగుతున్నట్లు అంచనా. కొందరు బిర్యానీ ప్రియులు నెలకు సుమారు రూ.వెయ్యిరూపాయలు బిర్యానీకే వెచ్చిస్తున్నారు. అదికూడా బాస్మతి బియ్యంతో చేసిన బిర్యానీకి ఎక్కువ డిమాండ్ ఉంది. బిర్యానీలో మటన్ దమ్, మటన్ ఫ్రై, చికెన్ దమ్, చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్, చికెన్ బోన్‌లెస్ బిర్యాని, వెజ్ బిర్యాని రైస్ రకాలు లభిస్తున్నాయి. నగరంలో మద్రాస్ బిలాల్, వైస్రాయ్, న్యూ బావాచి, మౌర్యా, బాబు బిర్యాని పాయింట్, అజ్మీర్ మహరాజ్ తదితర పాయింట్లలో బిర్యాని లభిస్తోంది. వీటితోపాటు పెద్ద రెస్టారెంట్లలో కూడా పలు రకాల బిర్యానీలు లభిస్తున్నాయి. ఆర్డర్లపై బిర్యానీల సప్లయి.. వివాహాది, శుభకార్యాలకు బిర్యానీలు సప్లయి చేసేందుకు బిర్యానీ పాయింట్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. బిర్యానీ ధరలు రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. హోటళ్లలో మామూలు భోజనం ధర దాదాపు రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో రూ.100 పెట్టి బిర్యానీ తినేందుకు చాలామంది వెనుకాడడం లేదు. కొన్ని హోటళ్లలో తిన్నంత బిర్యానీ అందిస్తున్నారు. బిర్యానీ పార్సిల్‌కు కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంది. నాలుగేళ్లుగా బిర్యానీ చేస్తున్నా.. మా స్వస్థలం చెన్నై. నాలుగేళ్లుగా నేను బిర్యానీ చేస్తున్నాయి. నాతోపాటు హోటల్లో నలుగురు నిష్ణాతులైన బిర్యానీ మాస్టర్లు ఉన్నారు. నేతితో తయారుచేసిన బిర్యానీకి డిమాండ్ ఉంది. బిర్యానీని బాసుమతి బియ్యంతో తయారు చేస్తే ఆ రుచి మరింతగా బాగుంటుంది. మూడేళ్లుగా.. మూడేళ్లుగా బిర్యానీ అమ్మకాలను కొనసాగిస్తున్నాం. రుచికరమైన బిర్యానీని వినియోగదారులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో రోజురోజుకీ బిర్యానీ విక్రయించే పాయింట్లు పెరుగుతున్నాయి. - నసీర్, అజ్మీర్ మహారాజ్ బిర్యానీ పాయింట్ కస్టమర్లు ఆదరిస్తారు.. నాలుగేళ్లనుంచి బిర్యానీ అమ్మకాలు ప్రారంభించాం. నాణ్యతతో కూడిన నేతి బిర్యానీని అందిస్తే కస్టమర్లు ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. -మహ్మద్, బిర్యానీ మాస్టర్, హోటల్ బాబు బిర్యాని పాయింట్