crakers
-
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
భయంకరంగా టపాసుల రేట్లు.. ఖాళీగా షాపులు
-
చీకటి వెలుగుల రంగేళి
తిమిరంతో సమరానికి ప్రతీకగా దీపాల పండుగ మళ్ళీ వచ్చింది. టపాకాయలపై వివాదాన్ని తిరిగి తెర మీదకు తెచ్చింది. కాలుష్యానికి కారణమవుతున్న టపాసులు కాల్చడం సమంజసమేనా? తక్కువ కాలుష్య కారకాలతో, కొంత మేర పర్యావరణానికి అనుకూలమైన ‘హరిత టపాసులు’ కాలిస్తే ఫరవాలేదా? ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో విధించిన షరతులు, పశ్చిమ బెంగాల్– ఢిల్లీ– హర్యానా లాంటి రాష్ట్రాల్లో పూర్తి నిషేధాల మధ్య సుప్రీమ్ కోర్టు సోమవారం ఆచరణవాద ధోరణితో మళ్ళీ ఆదేశాలివ్వక తప్పలేదు. వేల కోట్ల రూపాయల వ్యాపారం, లక్షల కుటుంబాల జీవనం ఆధారపడ్డ టపాసులపై కలకత్తా హైకోర్టు అక్టోబర్ 29న విధించిన సంపూర్ణ నిషేధపుటుత్తర్వులను ‘తీవ్రమైనవి’గా పేర్కొంటూ, సర్వోన్నత న్యాయస్థానం వాటిని పక్కనపెట్టింది. దీపావళి, కాళీపూజ, ఛఠ్ పూజ మొదలు క్రిస్మస్ లాంటి పర్వదినాలకు టపాసుల కొనుగోళ్ళు, అమ్మకాలు, కాల్చడాన్ని దేశంలో ఎక్కడా గుడ్డిగా నిషేధించలేమని తేల్చింది. అంటే – దేశంలో గాలి నాణ్యత నాసిగా లేని ప్రతి పట్నంలో జనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు సుప్రీమ్ గతంలో పలు పర్యాయాలు ఆదేశించినట్టు గ్రీన్ క్రేకర్స్ కాల్చుకోవచ్చన్న మాట. హానికారక రసాయనాల వినియోగం, టపాసులపై పెట్టిన షరతులు అమలయ్యేలా యంత్రాంగాన్ని పటిష్ఠం చేసుకోవాలని పశ్చిమ బెంగాల్‌కి సుప్రీమ్ చెప్పింది. దేశమంతటా క్షేత్రస్థాయిలో అది ఏ మేరకు అమలవుతుందన్నది పక్కన పెడితే, టపాసుల వ్యాపారులకు ఇది ఊరటే! గంపగుత్త నిషేధం అసంభావ్యమని సుప్రీమ్ కోర్టు అంగీకరించడం గడచిన కొద్ది రోజుల్లో ఇది రెండోసారి. నిజానికి, కలకత్తా హైకోర్టు ఆదేశాలిచ్చిన రోజునే, టపాసులపై పూర్తి నిషేధం సముచితం కాదని మరో కేసులో సుప్రీమ్ పేర్కొంది. రాష్ట్రాలలో ఎక్కడైనా నిషేధిత టపాసులను వినియోగిస్తే, అక్కడి ఛీఫ్ సెక్రటరీలు, ప్రభుత్వ, పోలీసు అధికారులే వ్యక్తిగతంగా బాధ్యులని అప్పుడే హెచ్చరించింది. టపాసుల వ్యవహారం కొన్నేళ్ళుగా కోర్టులకెక్కుతూనే ఉంది. సుప్రీమ్ 2018లోనే టపాసుల్లో బేరియమ్ సాల్ట్స్ వినియోగాన్ని నిషేధించింది. ‘హరిత టపాసుల’నే అనుమతించింది. నిజానికి, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలోని ‘పెట్రోలియమ్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ (పెసో) ఇప్పటి దాకా 4 రకాలనే ‘హరిత టపాసులు’గా పేర్కొంది. ఈ సెప్టెంబర్ తొలి వారానికి దేశంలో 169 టపాసుల తయారీ సంస్థలు మాత్రమే ఈ గ్రీన్ క్రేకర్స్ తయారీకి దాని నుంచి అనుమతి పొందాయి. కానీ, విపణిలో అమ్ముతున్నవన్నీ నిజంగా ‘గ్రీన్’యేనా? మామూలు వాటికన్నా కేవలం 30 శాతమే తక్కువ కాలుష్యకారకమైన హరిత టపాసులైనా ఏ మేరకు సురక్షితం? కలకత్తా హైకోర్ట్ అన్నట్టు నిషేధిత టపాసులకూ, వీటికీ మధ్య తేడాను గుర్తించే వ్యవస్థ ప్రభుత్వాల వద్ద ఏ మేరకుంది? ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నార్థకమే! టపాసుల తయారీదార్లలో అత్యధికులు నకిలీ క్యూఆర్ కోడ్లతో తమ ఉత్పత్తులను ‘గ్రీన్’ అని ముద్ర వేస్తున్నారు. ఆ టపాసుల్లో నిషేధిత బేరియమ్ సాల్ట్స్ వాడుతున్నట్టు సీబీఐ సైతం కనిపెట్టింది. ఈ మాట సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టే ఆ మధ్య చెప్పింది. ఆరోగ్య, పర్యావరణ హాని అటుంచితే, చెవులు దిమ్మెత్తించే కాల్పులు, మోతల సంబరాన్ని ఓ ధార్మిక విశ్వాసానికి ముడిపెట్టి మాట్లాడడమూ ఇటీవల ఎక్కువైంది. పశుపక్ష్యాదుల నుంచి ప్రజల దాకా అందరికీ కాలుష్యంతో ఇబ్బంది తెచ్చే పద్ధతి మానుకొమ్మంటే, అది ఓ మతానికి వ్యతిరేకంగా కొందరు చేస్తున్న కుట్ర అనే మాటలూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. టపాసులను రోడ్డు మీద కాల్చద్దంటూ, పిల్లలకు రహదారి భద్రతను బోధిస్తూ నటుడు ఆమిర్ ఖాన్‌తో టైర్ల సంస్థ ‘సియట్’ వాణిజ్య ప్రకటన రూపొందిస్తే, దాన్ని కూడా వివాదాస్పదం చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి ఒకరు ఏకంగా ఇది ఓ మతానికి వ్యతిరేకమైన నటులు, ఆ మత విశ్వాసాలను దెబ్బతీసేలా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై మరో మతం చేసే దైవ ప్రార్థనల్నీ, రోజూ ప్రార్థన వేళల్లో మైకులో ఇచ్చే ఆ మతం పిలుపునూ తప్పుపట్టారు. వెరసి, టపాసుల కాలుష్యం కన్నా ధార్మిక విశ్వాసాలను రెచ్చగొట్టే భావ కాలుష్యం పెరగడం శోచనీయం. దీపాల వరుసనే అసలైన అర్థంలో ప్రమిదలను వెలిగించి, గోగునార కట్టలను వెలిగించి, దివిటీలు కొడుతూ సంబరం చేసుకోవడం తొలినాళ్ళ దీపావళి. కాలగతిలో దాన్ని కాలుష్యకారక టపాసుల పండగగా మార్చేశాం. ఇప్పుడు 10 లక్షల కుటుంబాలు ఆధారపడ్డ రూ. 5 వేల కోట్ల వ్యాపారంగా, బాల కార్మిక వ్యవస్థకూ, అసురక్షిత వాతావరణానికీ అది ఆలవాలమైంది. తమిళనాట శివకాశిలోనే దేశంలోని 80 శాతం టపాసులు తయారవుతున్నాయి. టపాసులతో జరుగుతున్న నష్టం తెలిశాక అయినా, ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అనే ఆర్ష సంస్కృతిని అనుసరిస్తూ, పర్యావణానికి హాని కలగని రీతిలో పండుగ జరుపుకొంటే ధార్మిక విశ్వాసాలను ధిక్కరించినట్టా? సమస్త ప్రకృతినీ దైవంగా భావించే సంస్కృతిని గౌరవించినట్టా? వృద్ధులు, పిల్లలు, చివరకు పెంపుడు జంతువులను కూడా భయపెట్టి, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా భారీ మోతల టపాసులు కాలిస్తేనే – ధర్మాన్నీ, దేవుణ్ణీ నమ్మినట్టా? ప్రపంచం పెనుముప్పులో పడి, పర్యావరణంపై ‘కాప్–26’ లాంటి సదస్సులు జరుపుతున్న వేళ వీటికి జవాబు తెలియనిదేమీ కాదు. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఎవరికీ లేదు. అందుకు ఎవరినీ అనుమతించరాదన్న సుప్రీమ్ మాటను ఇంట్లో చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనదే! -
దివ్వెల దీపావళి
సాక్షి, అమరావతి : ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నేపథ్యంలో దీపావళి వేడుకలను జాగ్రత్తల నడుమ నిర్వహించుకోవాలని కోరుతోంది. దీపావళి అంటేనే టపాసుల సంబరం కావడంతో పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రం రెండు గంటల పాటు పరిమితంగా వినియోగించేందుకు అనుమతించింది. ఈ సమయంలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పొరుగువారికి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలకు సూచిస్తోంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ రోజు ప్రజలంతా ఆనందంగా గడిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులు, ఎన్జీటీ ఆదేశాల ప్రకారం టపాసులు కాల్చడాన్ని, బాణసంచా విక్రయాలను నిషేధించగా కొన్ని చోట్ల నియంత్రించాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండు గంటలు ఓకే... దీపావళి రోజు రెండు గంటలు పాటు బాణాసంచా వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అనుమతిలేని బాణాసంచా దుకాణాలు, టపాసుల వినియోగంపై అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇష్టానుసారంగా తాత్కాలిక దుకాణాలకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. కాలుష్యం, కరోనా విస్తృతిపై ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా స్వచ్చందంగా టపాసుల వినియోగాన్ని తగ్గించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ దిశగా పోలీస్ యంత్రాంగానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ తగిన ఆదేశాలు ఇచ్చారు. నివాసాల మధ్య భద్రత లేని ప్రాంతాల్లో ఇష్టానుసారంగా టపాసులు విక్రయించకుండా చర్యలు చేపట్టారు. తాత్కాలిక దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు ఏర్పాటు చేసేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని స్థల యజమాని అంగీకారపత్రంతోపాటు అగ్నిమాపక నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆంక్షలకు కారణాలు ఇవీ.. – శీతాకాలంలో వైరస్లు వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది. ఈ సమయంలో టపాసులు పేల్చితే కాలుష్యం కారణంగా వైరస్ మరింత విస్తరించే ముప్పు ఉంది. వాయుకాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కరోనా బాధితులకు ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో బాణసంచా కాల్చడం, విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరు 30 వరకు బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. క్రిస్మస్ సహా నూతన ఏడాది వేడుకల్లోనూ బాణాసంచా కాల్చేందుకు కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ గతవారం 23 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబరు 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించడంపై ఎన్జీటీ చైర్మన్ ఆదర్శకుమార్ గోయల్ ధర్మాసనం రాష్ట్రాల స్పందన కోరింది. – కాలుష్యం నివారణకు బాణాసంచా వినియోగాన్ని నిషేధించాలంటూ కొందరు పర్యావరణ వేత్తలు 2018లో సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేలా అనుమతించింది. -
బాణసంచాపై నిషేధం..
సాక్షి, హైదరాబాద్ : పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదే శించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నవంబర్ 10–30 మధ్య బాణసంచా కాల్చకుండా నిషేధం విధించేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాశ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. బాణసంచా కాలిస్తే వాయుకాలుష్యం ఏర్పడుతుందని, శ్వాసకోశ సమస్యలు వచ్చి ప్రజల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారని ఇంద్రప్రకాశ్ వాదించారు. ఈ నేపథ్యంలో బాణసంచాను నిషేధించాలన్నారు. బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయని తెలిపారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిచంగా ఆ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. బాణసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. రాత్రి 3 గంటల వరకు కూడా బాణసంచా కాలుస్తూ ధ్వని, వాయు కాలుష్యానికి పాల్పడుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని చెబుతానని, విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేయాలని ఏజీ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించడంతో విచారణను వాయిదా వేసింది. అనంతరం బాణాసంచా నిషేధానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏజీ ప్రసాద్ నివేదించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు. వాయుకాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాణసంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కరోనాతో ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. వాయుకాలుష్యం ఏర్పడితే కరోనా రోగులు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బాణసంచా కాల్చకుండా నిషేధం విధించింది. ఇతర హైకోర్టులు సైతం బాణసంచా కాల్చకుండా నిషేధం విధించాయి. బాణసంచా కాల్చి వాయు కాలుష్యానికి పాల్పడకుండా ప్రజలను చైతన్యం చేయండి. ఈ మేరకు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించండి’’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
రాజకీయ మతా‘ల’బు!
కమలానగర్. అనంతపురంలోని ఈ వీధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి చుట్టూ దీపావళి సందడి ఉంటోంది. ఓ రాజకీయ పార్టీని అంటిపెట్టుకొని దందా సాగించే ఈ వ్యక్తి.. నేతలతో పాటు అధికారులకూ సుపరిచితుడు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. టపాసుల వ్యాపారంలో చక్రం తిప్పేది మాత్రం ఈయనే. ఎవరికి ఎంత ముడుపు ముట్టజెబితే పని అవుతుందో.. ఏ నాయకుడిని ఎలా బుట్టలో వేసుకోవాలో ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకేముంది.. మూడు రోజుల టపాసుల విక్రయం ఈ వ్యక్తి చేతిలో ‘వెలుగులు’ విరజిమ్ముతుంది. సాక్షి, అనంతపురం : దీపావళి పండుగకు నెల రోజుల ముందుగానే వ్యాపారస్తుల్లో సందడి మొదలైంది. మూడు రోజుల్లో పెట్టుబడి పోను లక్షల్లో ఆదాయం ఉండడంతో టపాసుల విక్రయం చుట్టూ అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దుకాణాల లైసెన్స్‌లకు ఇప్పటికే జిల్లా కేంద్రంలో 123 దరఖాస్తులు రాగా, జిల్లా వ్యాప్తంగా 263 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. వీళ్లే కాకుండా డీలర్లు పదుల సంఖ్యలో ఉన్నారు. అధిక శాతం గుంతకల్లు పట్టణంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి రాయలసీమ వ్యాప్తంగా టపాసులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యాపారమంతా ‘జీరో’లోనే సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఏమాత్రం పన్నులు చెల్లించకుండా వందల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ, అగ్ని మాపక శాఖ, తూనికలు కొలతలు, పోలీసుశాఖ.. ఇలా ఎవరి ముడుపులు వారికి ముడుతుండటం వల్లే అందరూ తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. మీరు టపాసుల వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీ వద్ద పెట్టుబడికి డబ్బులు లేవా? అయితే కమలానగర్ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ‘చంటి’గాడిని కలవండి. మీ పని అయిపోయినట్టే. మీరు వెళ్లి దుకాణంలో కూర్చుంటే చాలు.. అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు చేయాల్సిందల్లా.. టపాసులు అమ్మి పెట్టడమే. కాకపోతే ఖర్చులు పోను, వడ్డీ కూడా చెల్లించుకోవాలి మరి. ఆ వ్యక్తితో డీల్ కుదిరితే ఇక మీ ఇంట్లో ‘దీపావళి’ పండగే. అనంతలో చంటిగాడు టపాసుల వ్యాపారం గత కొన్నేళ్లుగా రాజకీయమైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి చెందిన అనుయాయులే ఈ వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. అయితే వీరి వెనుక ఉండి చక్రం తిప్పేది మాత్రం ఒక్కరే వ్యక్తి. ఓ రాజకీయ పార్టీని అడ్డుపెట్టుకొని కొన్నేళ్ల నుంచి ‘చంటి’గాడు ఈ తతంగం నడిపిస్తున్నాడు. టపాసుల వ్యాపారంలో చేయి తిరిగిన వ్యక్తి కావడంతో మిగిలిన వారు కూడా ఆయన దారిలోనే నడవాల్సిన పరిస్థితి. తమిళనాడులోని శివకాశి నుంచి తక్కువ ధరకు ప్రభుత్వాలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా జిల్లాకు టపాసులను రప్పించడం ఈ వ్యక్తి ప్రత్యేకత. బయటకు చూపించేందుకు రూరల్ పరిధిలో కొంత సరుకును ఉంచుతుండగా.. మిగిలిన సరుకు శింగనమల సమీపంలోని సొంత గోదాములో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఎవరి ముడుపులు వారికి.. రూ.కోట్లలో సాగిస్తున్న వ్యాపారంలో ఎవరూ అడ్డు తగలకుండా ఎవరి ముడుపులు వారికి అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ప్రభుత్వానికి పన్నులు చెల్లించారా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఈ అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన పాపాన పోలేదు. టాపాసుల విక్రయాల్లో వ్యాపారస్తులకు దాదాపు 80 నుంచి 90శాతం లాభాలే. ఎంఆర్పీ, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు, గడువు తేదీ తప్పనిసరిగా టపాసుల బాక్సులపై ముద్రించాలి. ప్రస్తుతం శివకాశి నుంచి దిగుమతి అవుతున్న సరుకులో ఇలాంటి విషయాలు ఏవీ ఉండవు. వ్యాపారస్తుడు చెప్పిందే ధరగా వినియోగదారుడు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు జీరోతో దిగుమతి చేసుకుంటుండడంతో వ్యాపారస్తులు భారీగా లబ్ధి పొందుతున్నారు. అనంతలో కీలకమైన ఆ వ్యాపారి రూ.కోట్లకు పడగలెత్తాడు. ప్రతి ఏటా దీపావళి వస్తే అనంతలో ఇతని సందడి అంతాఇంతా కాదు. వ్యాపారస్తులకు సైతం అప్పు రూపంలో సరుకు ఇచ్చి వడ్డీ సహా వసూలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల ఆశీస్సులు ఉండటంతో ఈ చంటిగాని దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దందా ‘సిండికేట్’ టపాసుల వ్యాపారం జిల్లా కేంద్రంలో దాదాపు ‘సిండికేట్’ కనుసన్నల్లో నడుస్తోంది. అలాగని ఎంతో మంది ఉంటారనుకుంటే పొరపాటు. ఓ వ్యక్తి కనుసన్నల్లోనే ఈ దందా సాగుతోంది. 20 నుంచి 30 ఏళ్లుగా టపాసుల వ్యాపారంలో పండిపోయిన ఈ వ్యక్తి చెప్పిందే ఇక్కడ వేదం. ఎవరికి దుకాణం దక్కినా.. వ్యాపారం మాత్రం ఆయన మాటకు కట్టుబడి సాగించాల్సిందే. యేటా ఈ దందా ఆసక్తికరంగా ఉంటోంది. పండుగకు వారం రోజుల ముందు నుంచి ఒకటే హడావుడి. అక్కడా.. ఇక్కడ.. అదిగో.. ఇదిగో.. వాళ్లూ.. వీళ్లూ.. ఇలాంటి హడావుడి మధ్య పండుగకు ఒక రోజు, రెండు రోజుల ముందు ‘దుకాణం’ తెరుచుకుంటుంది. -
కాంతులే ధ్వనులు
శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పుడంటే సుప్రీంకోర్టు టపాకాయలు కాల్చడంపైనియంత్రణ విధించింది కానీ.. తమిళనాడులోని ఓ రెండు గ్రామాలవారు రెండు తరాలుగా బాణాసంచానే కాల్చడం లేదు! వాళ్లకై వాళ్లు ఏర్పరచుకున్న నిబద్ధత అది. దసరా వచ్చింది, సరదా తెచ్చింది.. అని పాడుకుంటూ ఉండగానే వచ్చేస్తుంది దీపావళి. నిజానికి పండుగ రెండురోజులే కానీ నాలుగైదు రోజులు టపాకాయలు పేలుస్తూ ఊరూవాడా హోరెత్తించేస్తారు పిల్లలు. ఉన్నట్లుండి ఉరమని పిడుగులా ఎప్పుడు ఏ లక్ష్మీ బాంబు పేలుతుందో తెలియదు. ఏ కాకరపువ్వు చిరచిరలాడుతూ బట్టల మీద నిప్పురవ్వలు రాలుస్తుందో తెలియదు. ఏ ఇంట్లో వదిలిన రాకెట్టు మన పెరట్లో ల్యాండ్ అవుతుందో ఊహించలేం. ఉతికిన దుస్తులు ఆరవేయాలంటే భయం, చెవుల్లో దూది తియ్యాలంటే భయం. టపాకాయలు వదిలిన పొగతో చంటిపిల్లలు, పెద్దవాళ్లు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటారు. మతాబుల్లా వెలిగే పిల్లల ముఖాలను చూసి ఈ కష్టాలన్నీ భరించేస్తాం. టపాకాయలు కాల్చే పిల్లలను పోనీ అనుకోవచ్చు, పెద్దవాళ్లు కూడా ఎవరికి ఏ ఇబ్బందులు ఎదురైనా సరే... మా సంతోషమే మాకు ముఖ్యం అనుకుంటుంటారు. అయితే పండుగ చేసుకోవడం ఇలా కాదంటున్న తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓ రెండు గ్రామాల వాళ్లు... పక్షులకు ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా పండుగ చేసుకుంటున్నారు! పక్షులకు ఆతిథ్యం కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు తమిళనాడు రాష్ట్రం, శివగంగ జిల్లాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో గడచిన రెండు తరాలుగా ఎవరూ టపాకాయలు కాల్చడం లేదు. గ్రామ పెద్దలంతా కలిసి చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. చలికాలంలో ఇక్కడికి ఉత్తర భారతదేశం, సైబీరియా, న్యూజిలాండ్‌ల నుంచి వలస పక్షులు తూర్పు తీర గ్రామాలకు వస్తుంటాయి. శీతాకాలం ప్రారంభంలో వచ్చి ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి. ఇలా వచ్చే పక్షులు బాణాసంచా మోతకు భీతిల్లిపోతున్నాయి. ఢామ్మనే శబ్దం రాగానే గూటిలో గుడ్ల మీద పక్షులు ఒక్కసారిగా ఎగిరి వెళ్లిపోయేవి. ఆ గుడ్ల నుంచి పిల్లలు సరిగ్గా ఏర్పడవు. కొన్నిసార్లయితే పక్షులు బెదిరిపోయి రెక్కలను అల్లల్లార్చుకోవడంతో గూడు కదిలి గుడ్లు కిందపడి పగిలిపోతుంటాయి కూడా. ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది కూరుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి?’ అని ప్రశ్నిస్తారు గ్రామస్థులు. ఇంకా చెప్పాలంటే మన ఆనందం కోసం వాటిని క్షోభ పెట్టడం ఏమిటి అని కూడా అడుగుతున్నారు. సైంటిస్టుల సూచన ఓ యాభై ఏళ్ల కిందటి వరకు అందరిలాగానే బాణాసంచా కాల్చేవారిక్కడ. అయితే రాను రాను విపరీతమైన శబ్దాలు చేసే రకాలు వస్తున్నాయి. భయంకరమైన శబ్దాలకు పక్షులు భయంతో కీచుగా అరవడం, గుడ్లు పగిలిపోవడం, పక్షులు పారిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ గ్రామాలు వేదకుండి బర్డ్ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన పక్షిశాస్త్రవేత్తలు (ఆర్నిథాలజిస్టులు) ప్రకృతి సమతుల్యతకు భంగం కలగకుండా పండుగ చేసుకోవాలని సూచించడంతో గ్రామపెద్దలు, గ్రామస్థులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కొల్లుకుడిపట్టి మాజీ సర్పంచ్ ఆర్ముగం చెప్పారు. దేశమంతటికీ బాణాసంచా కాల్చడం సంప్రదాయమైతే బాణాసంచాలేని నిశ్శబ్ద దీపావళి చేసుకోవడం మా సంప్రదాయం అంటున్నారు. ఈ గ్రామాల్లో దీపావళికి మాత్రమే కాదు తమిళనాడులో నెలరోజుల పాటు ఘనంగా చేసుకునే తిరువిఱ వేడుకల్లో కూడా బాణాసంచా కాల్చరు. పిల్లల సరదా తీరేదెలా? అస్సలే టపాకాయలు కాల్చవద్దంటే పిల్లల ముఖాలు పేలని చిచ్చుబుడ్డిలా చిన్నబోతాయి. అందుకే ఎక్కువ శబ్దం లేని టపాకాయలను మాత్రమే కాలుస్తారు. అది కూడా... స్కూలు హెడ్మాస్టరు పర్యవేక్షణలో చెట్లు, పక్షులు లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి మరీ టపాకాయల వేడుక చేసుకుంటారు. – మంజీర -
దీపావళి ధమాకా రెండు గంటలే
న్యూఢిల్లీ: దీపావళి పండుగను ధూంధాం ధమాకాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటి నుంచే టపాసుల కొనుగోలు ప్రారంభించారా? వెలుగులు చిమ్మే చిచ్చుబుడ్లు, వీధివీధంతా మార్మోగే లక్ష్మీబాంబులు, వరుస పేలుళ్ల లడీలు.. ఇలా ఏమేం కొనాలో లిస్ట్ రెడీ చేసుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ దీపావళిని మీరలా జరుపుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దీపావళే కాదు.. రానున్న క్రిస్మస్, న్యూఇయర్ పండుగలనూ పేలుళ్లతో కాదు.. ప్రశాంతంగా జరుపుకోవాల్సిందే. ఎందుకంటే పండుగ రోజు భారీగా విస్తరించే వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను, మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీపావళి తదితర పండుగల సందర్భంగా బాణసంచా పేలుళ్లను పూర్తిగా నిషేధించలేదు కానీ కొన్ని పరిమితులు విధించింది. తక్కువ వాయు కాలుష్యాన్ని వెదజల్లే బాణాసంచా (గ్రీన్ క్రాకరీ)ను మాత్రమే వినియోగించాలంది. అలాగే, దీపావళి నాడు రోజంతా కాకుండా, కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు.. అంటే కేవలం రెండు గంటల పాటే పటాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది.క్రిస్మస్, న్యూఇయర్‌లు అర్ధరాత్రి పండుగలు కాబట్టి, ఆ రోజుల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు, 35 నిమిషాల పాటు బాంబుల మోత మోగించవచ్చని పేర్కొంది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ఒకే దగ్గర అంతా టపాసులు పేల్చుకునే అవకాశం కల్పించే కమ్యూనిటీ ఫైర్ క్రాకింగ్’ను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వరుస పేలుళ్లు జరిపే లడీ తరహా బాణసంచా వినియోగాన్ని నిషేధించింది. వెలుగు, చప్పుడు తక్కువ వచ్చేలా ప్రమాదకర రసాయనాలను తక్కువగా వినియోగించి టపాసులను తయారు చేయాలని ఉత్పత్తిదారులను ఆదేశించింది. నిబంధనల మేరకు టపాసుల వినియోగం జరిగేలా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసు అధికారిదేనని స్పష్టం చేసింది. తయారీదారుల జీవించే హక్కుపై... వాయు కాలుష్యానికి కారణమవుతున్న బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. బాణసంచా వినియోగంపై నిషేధం బదులు పరిమితులు విధించాలని తయారీదారులు ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని అర్థించారు. వాయు కాలుష్యానికి బాణసంచాతో పాటు గాలి, ఉష్ణోగ్రతలు కూడా కారణమేనన్నారు. స్పందించిన ధర్మాసనం..130 కోట్ల దేశ ప్రజల ఆరోగ్య హక్కుతోపాటు బాణసంచా తయారీదారుల జీవించే ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లకుండా చూస్తామంది. సుప్రీం ఆదేశాల వివరాలు.. ♦ బాణసంచాల నుంచి వెలువడే ధ్వని, పొగ ప్రమాణాలను పెట్రోలియం, ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్వో, పెసో) ధ్రువీకరించాల్సి ఉంటుంది. వీటిల్లో వాడే రసాయనాలను కూడా పెసో నిర్దేశించిన మేరకే వినియోగించాలి. ఇలా ధ్రువీకరించిన, గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే ఉత్పత్తికి, విక్రయాలకు అనుమతించాలి. నిబంధనలను ఉల్లంఘించిన విక్రేతల లైసెన్స్‌లను పెసో రద్దు చేయవచ్చు. ♦ లైసెన్స్ పొందిన విక్రేతలే టపాసులను విక్రయించాలి. కోర్టు ఆదేశాలకు లోబడి తయారైన వాటిని మాత్రమే వారు అమ్మాల్సి ఉంటుంది. లేకుంటే లైసెన్స్ రద్దు తప్పదు. ♦ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు బాణాసంచాను విక్రయించరాదు. ♦ పరిమితికి మించి ధ్వని, కాలుష్య కారకాలను వెదజల్లే బాణసంచాను కాల్చకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. ఉత్స వాలు, పెళ్లిళ్ల సందర్భంగా వాడే బాణసంచా కూడా ప్రమాణాలకు లోబడి ఉండాలి. ♦ గ్రీన్ బాణసంచా వల్ల వ్యర్థాల పరిమాణం 15 నుంచి 20 శాతం వరకు తగ్గుతుంది. గ్రీన్ క్రాకర్స్ వల్ల ధ్వనితో పాటు కాంతి తీవ్రత కూడా 30 నుంచి 35 శాతం వరకు తగ్గుతుంది. దీంతోపాటు గాలిలో కలిసి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ల పరిమాణం కూడా గణనీయంగా పడిపోతుంది. ♦ భారీ వాయు, శబ్ద కాలుష్యం వచ్చే సిరీస్ క్రాకర్స్ లేక లారిస్(ఎత్తుకు వెళ్లి పేలడంతోపాటు మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే)తయారీ, విక్రయాలపై నిషేధం. రివ్యూ పిటిషన్ వేస్తాం సుప్రీం తీర్పుపై భిన్న స్పందనలు వెలువడ్డాయి. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని బాణసంచా తయారీ దారులు పేర్కొన్నారు. గ్రీన్ క్రాకరీ అనేదే లేదని, అలాంటి బాణసంచాను తయారు చేసేందుకు చాలా సమయం పడ్తుందని తెలిపారు. ఇప్పుడు తమ వద్ద ఉన్నది రెండేళ్లనాటి స్టాక్ అని చెప్పాయి. రెండు గంటల పాటే బాణసంచా పేలుళ్లకు అవకాశమివ్వడం వల్ల తమ బిజినెస్ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని శివకాశీలోనే దాదాపు 6 లక్షల మంది బాణసంచా తయారీతో ఉపాధి పొందుతున్నారని, అలాంటి వారి జీవనోపాధి సుప్రీంకోర్టు తీర్పుతో దెబ్బతింటుందని పేర్కొంది. మరోవైపు బాణసంచా పేలుళ్లతో వెలువడే వాయు, ధ్వని కాలుష్య స్థాయిలను కొలిచే పరికరాలు తమ వద్ద లేవని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, బాణసంచా విక్రేతలు సుప్రీంకోర్టు పేర్కొన్న పరిమితులలోపుఉన్న ఉత్పత్తులనే విక్రయించేలా చూడటం కూడా ఆచరణ సాధ్యం కాదన్నారు. కాగా, సుప్రీం తీర్పును పర్యావరణవేత్తలు స్వాగతించారు. -
కాలుష్యంతో 25 లక్షల మంది మృతి
-
కాలుష్యంతో 25 లక్షల మంది మృతి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్‌లోనే అత్యధికమని ఓ అధ్యయనంలో తేలింది. 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది చనిపోతే, ఒక్క భారత్‌లోనే 25 లక్షల మంది మృత్యువాత పడ్డారని పరిశోధకులు తెలిపారు. ఈ జాబితాలో 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో ఉందన్నారు. ఐఐటీ ఢిల్లీతో పాటు అమెరికాకు చెందిన ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. కాలుష్యం కారణంగా సంభవించే గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, ఊపిరితిత్తుల కేన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగానే భారత్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2015లో వాయు కాలుష్యంతో 65 లక్షల మంది చనిపోతే, నీటి కాలుష్యంతో 18 లక్షల మంది, పని ప్రదేశంలో కాలుష్యంతో 8 లక్షల మంది దుర్మరణం చెందారని పేర్కొన్నారు. పారిశ్రామికంగా వేగంగా పురోగమిస్తున్న భారత్, చైనా, పాక్, బంగ్లాదేశ్, మడగాస్కర్, కెన్యాల్లో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరు కాలుష్యం కారణంగానే మరణించారన్నారు. ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం న్యూఢిల్లీ: దేశరాజధానిలో టపాసుల క్రయవిక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలవరకు ఢిల్లీ టపాసుల చప్పుళ్లతో మార్మోగింది. సాధారణంగా ఢిల్లీలో క్యూబిక్ మీటర్ గాలిలో 60 నుంచి 100 మైక్రోగ్రాములు ఉండే పీఎం 2.5, పీఎం 10 అల్ట్రాఫైన్ రేణువులు సాయంత్రం ఆరు తర్వాత వరుసగా 424, 571 మైక్రోగ్రాములకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే దీపావళి వేడుకలు ఈసారి ప్రశాంతంగానే జరిగాయి. -
తిరుపతిలో బాంబు కలకలం
తిరుపతి క్రైం: తిరుపతిలో బుధవారం ఉదయం బాంబు కలకలం రేపింది. తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద బాంబు పెట్టారన్న సమాచారంతో అప్రమత్తమైన అలిపిరి పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. చివరికి దీపావళి టపాసులు దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే టపాకాయలు పేలడం వల్ల శబ్ధం వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నారావు సర్కిల్ వద్ద బాంబు పేలినట్లు గుర్తుతెలియని వ్యక్తులు 100కు ఫోన్ చేసినట్లు అలిపిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు