Crisis agriculture
-
సాగు సంక్షోభంతోనే మాంద్యం
మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పందనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. దీన్ని పక్కనబెట్టి పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలపై మన ఆలోచనలు సాగినంతకాలం ఆర్థిక రంగం కోలుకోవడం కలలో మాటే. దేశాన్ని ఆవరిస్తోన్న ఆర్థిక రంగ క్షీణత అనూహ్యమైనదని, బహుశా గత 70 ఏళ్లలో ఇంతటి హీన పరిస్థితిని చవిచూడనట్లుందని సాక్షాత్తూ నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్వయంగా పేర్కొన్నారు. పైగా ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు కల్పించాలంటే అసాధారణ చర్యలు తీసుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. అయితే గత 17 ఏళ్ల కాలంలో అంటే 2000–17 మధ్య కాలంలో భారతీయ రైతులు దాదాపు రూ.45 లక్షల కోట్లను నష్టపోయి తీవ్రంగా దెబ్బతిన్నారనన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ నీతి అయోగ్ ఎలాంటి ప్రమాద హెచ్చరికలను చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ముందే చెప్పినట్లు మన వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని రీతిలో కనిపిస్తున్న ప్రస్తుత సంక్షోభం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత తారస్థాయికి చేరుకుంటోంది. అయినప్పటికీ మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ సంక్షోభంపై ఎలాంటి ప్రతిస్పం దనా వ్యక్తపర్చకపోవడం బాధాకరం. రైతులకు న్యాయంగా లభించాల్సిన ఆదాయాన్ని తిరస్కరించడం వల్లే వారు రూ. 45 లక్షల కోట్లను కోల్పోవలసి వచ్చిందని ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెల్పింది. అలాగే 2017–18లో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసుకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సమర్పించిన సర్వే ప్రకారం 2011–12 నుంచి 2017– 18 మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్లమంది సాధారణ కూలీలు (వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కార్మికులు) తమ ఉపాధి కోల్పోయారు. భీతిగొల్పుతున్న గ్రామీణ ఆర్థిక దుస్థితి సంకేతాలు ఇక్కడే ఉన్నాయి. కానీ అసలు విషయం ఏదంటే మన విధాన నిర్ణేతలు ఈ వాస్తవాన్ని చూడడానికి కూడా ఇష్టపడకపోవడమే. తీవ్ర సంక్షోభం బారిన పడుతున్నట్లు మన పారిశ్రామికరంగం సంకేతాలు వ్యక్తపరిచేంతవరకు, భారత ఆర్థిక వ్యవస్థను ఏదీ దెబ్బతీయలేదనే భ్రమల్లో మునిగిపోయాం. ఇంకా సూటిగా చెప్పాలంటే గ్రామీణ భారత్ అసలు ఉనికిలోనే లేనట్లు, అది ఎక్కడో సబ్– సహారా ఆఫ్రికాలో ఉంటున్నట్లు భావిస్తూ వచ్చిన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు మన రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోనంత దూరానికి జరిగిపోయారు. అయితే భారతీయ వ్యవసాయరంగాన్ని ఆవరిస్తున్న కఠిన వాస్తవాలపై నీతి ఆయోగ్ మేల్కొనకపోయి ఉన్నట్లయితే ఆర్థిక మందగమనం గురించి ఈ స్థాయిలో ఎవరూ గగ్గోలు పెట్టేవారు కాదు. వ్యవసాయ రంగ నిజ ఆదాయాలు తగ్గుముఖం పట్టి, గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కుప్పగూలడంతో దేశీయ డిమాండ్ క్షీణించిపోయిన పరిస్థితికి అనివార్య ఫలితమే ఆర్థిక మందగమనం. అంతే తప్ప ప్రస్తుత సంక్షోభానికి నిపుణులు నొక్కి చెబుతున్నట్లుగా దేశంలో ద్రవ్యలభ్యత లేకపోవడం కారణం కాదు. గత రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో వాస్తవాదాయం దాదాపు జీరో వృద్ధిరేటుకు పడిపోయింది. అంతకుముందు 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో అయిదేళ్లలో వ్యవసాయ రంగ వృద్ధి అర్ధశాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక్కడే భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత పతనాన్ని చవిచూస్తోందని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇక వ్యవసాయ రంగ ఆదాయాలు చూస్తే గత 14 ఏళ్లలో అత్యంత స్వల్పస్థాయికి దిగజారిపోయాయి. నమ్మలేని విషయం ఏమిటంటే 2011–2017 మధ్య కాలానికి వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు మొత్తం జీడీపీలో 0.3 నుంచి 0.4 శాతంగా మాత్రమే నమోదైనట్లు సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో వెల్లడయింది. వీటిని బట్టే, దేశంలోనే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఇన్నేళ్లుగా ఎంతటి దారుణ నిర్లక్ష్యానికి గురయిందో బోధపడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడమే ప్రాతిపదికగా అన్ని ప్రయత్నాలు ముందుకుసాగాలి. కానీ దీనికి భిన్నంగా, అసలు సమస్య వ్యవసాయరంగ సంక్షోభంలో కనిపిస్తుం డగా వాహనాల అమ్మకాలు పడిపోయాయి మొర్రో అంటున్న పరి శ్రమ విషాదగీతికే ప్రచారం పొందుతోంది. దేశవ్యాప్తంగా లోదుస్తుల అమ్మకాలు కూడా పడిపోయాయని, చివరకు అయిదు రూపాయిలు పెడ్జి బిస్కెట్లు కొనడానికి కూడా ఒకటికి రెండుసార్లు పేదవారు ఆలోచిస్తున్నందున దాదాపు 10 వేలమంది కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేయాల్సి వస్తోందని ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే బిస్కెట్స్ ప్రకటించడం వంటివి జాతీయ మీడియాలో విపరీత ప్రచారానికి నోచుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కన్నేసిన పారిశ్రామిక లాబీ బృందాలకు మన మీడియాలోని అతి పెద్ద సెక్షన్ పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఇలా పారిశ్రామికరంగానికి మద్దతుగా టముకు వాయిస్తున్న మీడియా కఠోర శబ్దాల మరుగున రైతులు, గ్రామీణ పేదలు మరోసారి తెరవెనక్కు పోతున్నారు. మందకొడిగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలంటే సంపన్నులకు మరిన్ని రాయితీలు, మినహాయింపులు కల్పించాల్సిం దేనంటూ మీడియాలో వస్తున్న ఆర్భాటపు ప్రకటనల సారాంశం ఒక్కటే. సమాజంలో ఇప్పటికే బలిసి ఉన్న సంపన్న వర్గాలకు మరింత డబ్బును అందుబాటులో ఉంచడమే ఈ ప్రచారం పరమార్థం. కానీ పారిశ్రామిక పెట్టుబడుదారులు పెడుతున్న ఈ గావుకేకలు, హాహాకారాలు డిమాండును సృష్టించడంలో ఎలా తోడ్పడతాయన్నది నాకు పరమాశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. పరిశ్రమలకు మరిన్ని పెట్టుబడులను, డబ్బును తరలిస్తే అది పేదల చేతుల్లో మరింత డబ్బు చేరడానికి ఎలా సహకరిస్తుందన్నది పెద్ద పజిల్. అన్నిటికంటే మించి ఆర్థిక మాంద్యానికి వాస్తవంగా కారకులైన వారి చేతుల్లో మరింత డబ్బును పెట్టడానికే విధాన నిర్ణేతలు అన్ని చర్యలూ తీసుకుంటుండటాన్ని నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ మొత్తం పరిస్థితిని చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ కె. సుబ్రమణియన్ గతంలో చేసిన ప్రకటనకు అన్వయించుకోవచ్చు. భారతీయ పారిశ్రామికవర్గం లాభాలను తమ సొంతం చేసుకుంటూ నష్టాలను సమాజపరం చేస్తోందా? అని ఆయన గతంలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నను సమర్ధిస్తున్న్టట్లుగానే, 2007 నుంచి గత 12 ఏళ్ల కాలంలో రూ. 8.5 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశారు. పైగా బ్యాంకులు తమపై ఇంకా రూ. 17 లక్షల కోట్ల రుణ భారం ఉందని ప్రకటిస్తున్నాయి. దీంట్లో కనీసం రూ. 12 లక్షల కోట్ల రుణాలు తిరిగి రానివే ఉంటాయని ఆర్థిక విశ్లేషకుల ఉవాచ. దేశీయ ప్రైవేట్ రంగం ఇప్పటికే బ్లాక్‌హోల్‌లో మునిగిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో 2009 నుంచి భారతీయ పరిశ్రమ ప్రతి సంవత్సరం రూ. 1.8 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన పథకాన్ని అందుకుంటూ వచ్చింది. గత పదేళ్లలోనే అది రూ.18 లక్షల కోట్లను బెయిలవుట్ ప్యాకేజీ రూపంలో అందుకుంది. అదనంగా జీడీపీలో 5 శాతం వార్షిక పన్ను మినహాయింపును కూడా పొందుతోంది. కష్టమొచ్చినప్పుడు పరిశ్రమ తనకు తానుగా నిలదొక్కుకోవాలే తప్ప ప్రభుత్వం వద్దకు పరుగెత్తకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు చెప్పింది సరైనదే. ఎయిర్ ఇండియా నష్టాలనుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీని ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ ఎయిర్‌లైన్‌ని ప్రైవేటీకరించాలని పరిశ్రమదారులు గావుకేకలు పెడుతుంటారు. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ప్రైవేట్ పరిశ్రమలు కూడా ఉద్దీపన ప్యాకేజీలకు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వాటిని మనం ఎందుకు జాతీయం చేయకూడదు? ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల జీవనదానాన్ని ఆర్బీఐ సమర్పిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పునరుద్ధరించాలంటే గ్రామీణ పేదలకు మరింత డబ్బును అందుబాటులోకి తీసుకురావడమే ఉత్తమ ఎంపిక. 17 రాష్ట్రాల్లో ఒక రైతు కుటుంబం సగటు ఆదాయం సంవత్సరాదాయం రూ.20,000లు మాత్రమే. అందుకే కేంద్రానికి అందుతున్న భారీ మొత్తంనుంచి ప్రధాన్ మంత్రి కిసాన్ స్కీం కింద రైతులకు అందిస్తున్న ప్రత్యక్ష నగదు సహాయాన్ని రెట్టింపు చేయాలి. ప్రస్తుతం భూమి ఉన్న రైతుకు ఏటా రూ.6 వేల రూపాయల నగదు సహాయం చేస్తుండగా దాన్ని కుటుంబానికి 12 కోట్ల రూపాయలకు పెంచాలి. అంటే నెలకు రైతుకు కనీసం వెయ్యిరూపాయల నగదు సహాయం అందుతుందన్నమాట. భూమిలేని రైతులను కూడా పీఎమ్ కిసాన్ పథకంలో భాగం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అలాగే వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. దీంట్లో భాగంగానే ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా 20,000 గ్రామీణ రైతు బజార్లను ఆధునిక మండీలుగా మార్చాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఎన్నికల వేళ రైతులకు తాయిలాలు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వ్యవసాయ రంగం సంక్షోభంపై ప్రతిపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీంతోపాటు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. వీటన్నిటినీ బేరీజు వేసుకుంటూ బీజేపీ నేతలు, ఎంపీలు, వివిధ వర్గాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రైతులకు భారీ ఆర్థిక ప్యాకేజీపాటు పలు ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ ప్రధాని మోదీకి ఇప్పటికే వివరించింది. ఇందులో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను చూపింది. ఏడు రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు, ఒడిశాలో ఇన్పుట్ సబ్సిడీ, తెలంగాణలో రైతు బంధు పథకం సహా వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వంటివి ఇందులో ఉన్నాయి. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎన్నికల లోపే ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాని మోదీ కారణమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారని, ఒకటి అంబానీ కోసం, మరొకటి రైతుల కోసం అని సోమవారం ట్వీట్ చేశారు. ‘ఒక్క విమానాన్ని కూడా నిర్మించకుండా అంబానీ రూ.30,000 కోట్ల రఫేల్ కాంట్రాక్టును పొందారు. కానీ నాలుగు నెలలు కష్టపడ్డ రైతులకు మాత్రం 750 కిలోల ఉల్లిపాయలకు రూ.1,040 వచ్చాయి’ అని మహారాష్ట్ర ఘటనను ఉదహరించారు. మరోవైపు ప్రభుత్వం తన విధానాలతో రైతులను ఒత్తిడి గురిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
వెనుకబడిన మండలాలు ఏడే?
ఖజానాను సుసంపన్నం చేసుకోవడం కోసం నిరుపేదల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వెనుకబడిన మండలాలకు మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని పరిమితం చేసేందుకు ప్రణాళిక రచించింది. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల మేరకు జిల్లాలో ఏడు మండలా లు మాత్రమే వెనుకబడినట్లు అధికారులు నివేదిక పంపడం గమనార్హం. మిగిలిన 59 మండలాల్లోనూ ఉపాధిహామీ పథకం అమలు చేయరన్నది స్పష్టమవుతోంది. వెనుకబడిన మండలాల ఎంపికకు నిర్ణయించిన ప్రాతిపదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష ప్రాంతమైన జిల్లాలో ఏడాది పొడవునా 1723 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతులు ఆర్థింకంగా దివాలా తీశారు. అధికశాతం గ్రామాలకు రహదారులు లేవు. గ్రామాల్లో అంతర్గత రహదారులు, పారిశుద్ధ్యం అంతంత మాత్రమే అన్నది బహిరంగ రహస్యం. కానీ.. అధికారులకు ఇవేవీ కన్పించలేదు. జిల్లాలో చౌడేపల్లి, కేవీబీపురం, పెద్దమండ్యం, కంభంవారిపల్లి, రామకుప్పం, రామసముద్రం, వెదురుకుప్పం మండలాలు మాత్రమే వెనుకబడినట్లు నెల పక్షం రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా నివేదిక పంపారు. వెనుకబడిన మండలాల ఎంపికను అత్యంత గోప్యంగా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాతిపదిక ఇదే.. తాగునీళ్లు, సాగునీళ్లు(చెరువులు, కుంటలు, చిన్న మ ధ్య తరహా ప్రాజెక్టులు, బోరు బావులు) లభ్యత, భూగర్భజలాల పరిస్థితి, రహదారులు, అంతర్గత రహదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వెనుకబడిన మండలాను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ మేరకు ఏడు మండలాలను మాత్రమే వెనుకబడినవిగా అధికారులు ఎంపిక చేయడం గమనార్హం. జిల్లాలో తూర్పున ఏడు మండలాల్లో మినహా తక్కిన 59 మండలాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సగటున 17.84 మీటర్ల లోతుకు భూగర్భజలమట్టం పడిపోయింది. చెరువులు, కుంటలే కాదు.. బోరు బావులు కూడా ఎండిపోయాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నోళ్లెళ్లబెట్టాయి. ఆయకట్టు మొత్తం బంజరుగా మారింది. కానీ.. అధికారులకు ఇవేవీ కన్పించకపోవడం గమనార్హం. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రాతిపదికన తీసుకుంటే జిల్లాలో 59 మండలాలు వెనుకబడినట్లుగా గుర్తించవచ్చు. కానీ.. సర్కారు రహస్య ఉత్తర్వుల మేరకే ఏడు మండలాలు మాత్రమే వెనుకబడినట్లు గుర్తించి నివేదిక పంపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఉపాధి ఎండమావే.. సొంతూల్లో పని కల్పించి వలసలను నిరోధించాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో చేపట్టారు. జిల్లాలో 66 మండలాల్లో 1,380 పంచాయతీల్లోని 11,580 గ్రామాల్లో ఈ పథకం అ మలవుతోంది. ఈ పథకం కింద 6.4 లక్షల మంది రైతు కూలీ, రైతు కుటుంబాలు జాబ్‌కార్డులు పొందా యి. ఉపాధిహామీ పథకం ప్రారంభించినప్పటి నుంచి నేటిదాకా రూ.1,682.21 కోట్లను మన జిల్లా లో ఖర్చు చేశారు. 2014-15లో రూ.94.78 కోట్లను వేతనాల రూపంలో రైతు కూలీలు, రైతులకు పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనుల వల్లే ఎనిమిదేళ్లుగా జిల్లాలో వలసలు లేవు. కానీ.. ఇప్పుడు ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చడంతో అప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఉపాధిహామీ పథకాన్ని వెనుకబడిన మండలాలకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగా జిల్లాలో ఏడు మండలాలు మాత్రమే వెనుకబడినట్లుగా గుర్తించింది. ఆ ఏడు మండలాల్లోని 385 పంచాయతీల్లో మాత్రమే 2015-16లో ఉపాధిహామీ పథకం అమలుచేయడానికి బడ్జెట్‌ను రూపొందించి.. ప్రభుత్వానికి పంపినట్లు డ్వామా(జిల్లా నీటి యాజమాన్య సంస్థ) అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. తక్కిన 59 మండలాల్లోనూ ఉపాధిహమీ పథకం కనుమరుగవడం ఖాయం. ఇది రైతు కూలీలు, రైతులకు శరాఘాతంగా మారడం ఖాయమని.. వలసలు పెరుగుతాయని.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని రైతు, సామాజిక, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.