
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాని మోదీ కారణమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. మోదీ రెండు భారత్‌లను నిర్మిస్తున్నారని, ఒకటి అంబానీ కోసం, మరొకటి రైతుల కోసం అని సోమవారం ట్వీట్ చేశారు. ‘ఒక్క విమానాన్ని కూడా నిర్మించకుండా అంబానీ రూ.30,000 కోట్ల రఫేల్ కాంట్రాక్టును పొందారు. కానీ నాలుగు నెలలు కష్టపడ్డ రైతులకు మాత్రం 750 కిలోల ఉల్లిపాయలకు రూ.1,040 వచ్చాయి’ అని మహారాష్ట్ర ఘటనను ఉదహరించారు. మరోవైపు ప్రభుత్వం తన విధానాలతో రైతులను ఒత్తిడి గురిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.