పంటల ఫలదీకరణకు డ్రోన్లు
టోక్యో: పంటల ఫలదీకరణకు సాయపడే కీటకాల పరిమాణంలో ఉండే డ్రోన్లు రానున్నాయి. జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. పుష్పాల నుంచి పుప్పొడి సేకరణలో కీటకాలు, తేనెటీగల పాత్ర ఎంతో కీలకం. అయితే ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు క్షీణిస్తుండటంతో ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది.
చవకగా కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణ పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే మియాకో, చెచెక్తాలు ఈ కీటక పరిమాణంలో ఉన్న డ్రోన్లను అభివృద్ధి చేశారు. పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించేందుకు గాను ఈ డ్రోన్లకు గుర్రపు వెంట్రుకలను అమర్చారు. తిరిగి వీటిద్వారానే మరో పువ్వులోకి ఈ పుప్పొడిని పంపించడం ద్వారా ఫలదీకరణం చెందుతున్నట్లు వీరు రుజువు చేశారు.