Crores to vote
-
ముగ్గురు ఎమ్మెల్సీలు మూడు వందల కోట్లు
-
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఫలితాల్లో ‘బ్రీఫ్డ్ మీ’!
⇒ ఓటుకు కోట్లు తంత్రం విజయవంతం ⇒ అడుగడుగునా ప్రలోభాలు.. బెదిరింపులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు, కర్నూలు, కడప : బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గడానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘ఓటుకు కోట్లు’ తంత్రాన్ని విజయంతంగా అమలు చేసింది. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశం పార్టీ భావించింది. తమ అభ్యర్థి గెలుపు కోసం నాడు తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యేను రూ.5 కోట్లకు కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అధినేత సహా టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసు ఇంకా కోర్టు విచారణలో ఉంది. ఈ కేసు విచారణ పూర్తయి దోషులను శిక్షించి ఉంటే ఇపుడు రాష్ట్రంలోనూ అదే అవినీతి సంస్కృతి కొనసాగి ఉండేది కాదు. వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థలలో బలం లేదు. అయినా అభ్యర్థులను బరిలోకి దింపింది. మెజారిటీ స్థానిక ప్రజాప్రతినిధులున్న వైఎస్సార్సీపీ నుంచి ఓట్లను నల్లడబ్బుతో కొనుగోలు చేసింది. లొంగని వారిని బెదిరించింది. చెప్పినట్లు వినకపోతే నష్టపోతారంటూ కళ్లెర్ర చేసింది. నెల్లూరు జిల్లాలో 852 ఓట్లకు 851 పోల్ కాగా ఇందులో 8 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి పక్కన పెట్టేశారు. మిగిలిన 843 ఓట్లలో టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి 465 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డికి 378 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. కర్నూల్లో జిల్లాలో పోలైన 1077 ఓట్లలో 11 చెల్ల లేదు. మిగిలిన 1066 ఓట్లలో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డికి 564 రాగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి 502 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 62 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కడపలో రూ.100 కోట్లు తెలుగు రాష్ట్రాల ప్రజలు నివ్వెరపోయేలా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ పెద్దలు గెలుపు కోసం అక్షరాలా వంద కోట్ల రూపాయలు వెదజల్లారు.జిల్లాలో 521 మంది వైఎస్సార్సీపీ ఫ్యాను గుర్తుపై గెలిచినవారు ఉండగా, 300 మంది టీడీపీ సైకిల్ గుర్తుపై గెలిచిన వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ డబ్బుతో నిమిత్తం లేకుండా గెలుపే లక్ష్యంగా వ్యవహరించింది. జిల్లాలో పోలైన 839 ఓట్లలో 8 చెల్ల లేదు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి)కి 434 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి 396 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక్క ఓటు వచ్చింది. దీంతో టీడీపీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ప్రకటించారు. -
దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోయింది
- హైకోర్టుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి వెల్లడి - అందుకే ఓటుకు కోట్లు కేసులో ప్రత్యేక కోర్టును ఆశ్రరుుంచాం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో సక్రమంగా సాగుతూ వచ్చిన దర్యాప్తు అకస్మాత్తుగా ఆగిపోరుుందని, ఈ నేపథ్యంలోనే తాము ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. తమ ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు కేవలం దర్యాప్తునకు మాత్రమే ఆదేశించిందని, దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రరుుంచి స్టే పొందారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసుతో తనకేమీ సంబంధం లేదని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి నివేదికను సమర్పించేంత వరకు ఆయన వేచి చూడాల్సిందన్నారు. ఆ దర్యాప్తులో చంద్రబాబు 24 క్యారెట్ల బంగారంలా బయటకు వచ్చే వారేమోనని, హైకోర్టును ఆశ్రరుుంచడం వల్ల ఆయన ఈ బంగారు అవకాశాన్ని కోల్పోయారని సుధాకర్‌రెడ్డి వివరించారు. ఓటుకు కోట్లు కేసులో ఫిర్యాదుదారు (ఆళ్ల రామకృష్ణారెడ్డి)ను థర్డ్ పార్టీ అని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత అతనికి లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పదేపదే వాదిస్తున్నారని, వాస్తవానికి చంద్రబాబుకే ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదని ఆయన తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపివేస్తూ గత నెల 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రరుుంచారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును ఆదేశించింది. చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి విచారణ మొదలుపెట్టారు. గతవారం చంద్ర బాబు తరఫున సిద్దార్థ్ లూత్రా వాదనలు ముగించడంతో సోమవారం సుధాకర్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు. బాబు స్వర నమూనాల జోలికెళ్లడం లేదు ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్లో 22 సార్లు చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని, అరుుతే ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం లేదని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మొదట్లో దర్యాప్తును వేగంగా ప్రారంభించిన ఏసీబీ అధికారులు తరువాత కీలక దర్యాప్తును పక్కన పెట్టేశారన్నారు. వారు చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని నివేదించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారని, ఇది సరైన విధానం కాదన్నారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై భయాందోళనల ఆధారంగా చంద్రబాబు హైకోర్టును ఆశ్రరుుంచారని చెప్పారు. ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో భయాందోళనల ఆధారంగా ఓ వ్యక్తి దాఖలు చేసే పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఈ కేసులో చంద్రబాబు నిందితుడు కాదని, అలాంటప్పుడు ఆయన హైకోర్టును ఆశ్రరుుంచడానికి వీల్లేదని సుధాకర్‌రెడ్డి అన్నారు. ఏసీబీ అధికారులు చంద్రబాబును నిందితునిగా చేర్చలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి స్పందిస్తూ... మీరు చంద్రబాబును నిందితునిగా మీ ఫిర్యాదులో పేర్కొన్నారు.. మరోవైపు నిందితుడు కాదని చెబుతున్నారు.. ఎందుకీ పరస్పర విరుద్ధమైన వాదనలు అని ప్రశ్నించారు. చంద్రబాబు నిందితుడు కాదని, కాబోయే నిందితుడని (ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్) సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ అన్న ఉద్దేశంతోనే తాము ఫిర్యాదులో నిందితునిగా పేర్కొన్నామని, ఇది ప్రతీ పిటిషన్లోనూ జరిగే ప్రక్రియేనని వివరించారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ మంగళవారానికి వారుుదా పడింది. -
నన్నూ ఈ కేసులో చేర్చుకోండి...
ఓటుకు కోట్లు కేసులో ఉండవల్లి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో దర్యాప్తునకు ఆదేశిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంలో తననూ ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని అభ్యర్థిస్తూ మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్‌కుమార్ శుక్రవారం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో తెలంగాణ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్లో పలుమార్లు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారని ఉండవల్లి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆయనను నిందితునిగా చేర్చడం గానీ, సాక్షిగా విచారించడం గానీ చేయలేదని వివరించారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తన వాదనలను వినాలని ఆయన అభ్యర్థించారు. -
ఆ రెండు రోజులు ఏం జరిగింది?
‘ఓటుకు కోట్లు’ కేసులో పెరుగుతున్న పాత్రధారులు మే 30, 31వ తేదీలపై దృష్టి పెట్టిన ఏసీబీ టీడీపీ నేతల తుదిరోజు విచారణ ముగింపు హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన మే 31వ తేదీతో పాటు అంతకుముందు రోజున చోటు చేసుకున్న కీలక పరిణామాలన్నింటిపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈ కేసును విచారించే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి రావడంతో పాటు పాత్రధారులు, అనుమానితులు, సాక్షుల సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఓటుకు కోట్లు’ కుట్ర వెనుక మరిన్ని ‘పెద్ద అంశాలు’ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సాక్షులుగా నోటీసులు అందుకున్న నలుగురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డ్రైవర్ల రెండు రోజుల విచారణ మంగళవారంతో ముగిసింది. టీడీపీ నేతలు ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావుయాదవ్తోపాటు రేవంత్ డ్రైవర్ రాఘవేందర్రెడ్డిని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించారు. వారి నుంచి కేసుకు సంబంధించి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా మే 30, 31వ తేదీల్లో కార్యకలాపాల కేంద్రంగా విచారణ కొనసాగినట్లు సమాచారం. ఆ రెండు రోజుల్లో ఈ ఐదుగురూ ఎక్కడెక్కడికి వెళ్లారు, ఫోన్‌కాల్స్ వెళ్లిన సమయాల్లో ఎక్కడున్నారు, ఫోన్లు చేసిన ముఖ్యనేతలు ఏం మాట్లాడారు, వారితో మీకున్న సంబంధాలేమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. మరోవైపు రేవంత్ తన గన్‌మెన్‌ను వదిలేసి రెండు, మూడుసార్లు ఒంటరి వెళ్లడంపై రాఘవేందర్రెడ్డిని ప్రశ్నించారు. ఇక ఈ కేసును కొలిక్కి తీసుకురావడంతో పాటు సాక్ష్యాధారాలను పక్కాగా సిద్ధం చేయాలంటే మరికొంత మందిని విచారించాల్సి ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు త్వరలో మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పాయి. కాగా.. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం కేవలం స్టీఫెన్‌సన్‌కే పరిమితం కాదని.. దీనివెనుక పెద్ద కుట్రే ఉందని ఏసీబీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఒక ఎమ్మెల్యే కొనుగోలుకు ఈస్థాయిలో పథక రచన, ఇంత మంది సహకారం అవసరం లేదని అంచనా వేస్తోంది. దీనివెనుక వ్యవస్థీకృత నేరమేదో ఉండి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. -
‘ఓటుకు కోట్లు’పై పార్లమెంటులో ఆందోళన
వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి వెల్లడి పుష్కరాల తొక్కిసలాటలో ఏపీ సీఎం నిర్వాకంపై నిరసన న్యూఢిల్లీ: ప్రజా సమస్యలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమేయం ఉన్న ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంపై కూడా సభలో ఆందోళన చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఆ సంఘటన మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల జరిగి న తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయంపై కూడా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. అలాగే ప్రజానుకూలంగా ఉన్న బిల్లులకు మద్దతివ్వనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ బిల్లులో తమ సవరణలకు అనుకూలంగా ఉంటేనే దానికి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. ప్రత్యేక హోదా హామీ అమలులో పురోగతిలేని విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు పెంచకుండా ఆదర్శ శాంసద్ యోజన వంటి పథకాల అమలు సాధ్యం కాద ని స్పష్టం చేశారు. ‘హోదా’పై ఒత్తిడి: టీడీపీ లోక్‌సభాపక్ష నేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లో రాష్ట్ర విభజన చట్టం అమలుపైనే తమ ఎజెండా ఉంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని రైల్వేజోన్, ఓడరేవులు, మౌలిక వసతుల స్థాపనపై కేంద్రం తగిన కార్యాచరణ చేపట్టేలా ఒత్తిడి తెస్తామన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, స్పీకర్ సుమిత్రామహాజన్ సమక్షంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో కూడా తమ డిమాండ్లను వారి ముందుంచామని తెలిపారు. ఈ అంశాలను చర్చించేందుకు తగిన సందర్భాల్లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు.