crowded places
-
గూగుల్ అదిరిపోయే ఫీచర్, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!
షాపింగ్ చేయడానికో లేదంటే ఇతరాత్ర పనుల మీద బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కరోనానే కారణం. మహమ్మారి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మాట్లాడాలన్నా, ఫ్రీ గా తిరగాలన్నా సాధ్యం కావడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాలవైపు వెళ్లడమే మానేశాం. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'గూగుల్ మ్యాప్స్'లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని గుర్తిస్తుంది. హాలిడేస్‌లో సరదగా కుటుంబ సభ్యులకు బయటకు వెళ్లేందుకు, లేదంటే షాపింగ్ చేసేలా గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం గూగుల్ సంబంధిత ప్రాంతాలకు చెందిన వ్యాపార వివరాలు, డైరెక్టరీస్ (సంస్థల వివరాలు )ను సేకరించింది. వాటి సాయంతో లోకేషన్లో ఉన్న వ్యక్తుల కదలికలు, ఏ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉందో గుర్తించేందుకు సహాయపడనుంది. వరల్డ్ వైడ్‌గా గూగుల్ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం వరల్డ్ వైడ్‌గా అందుబాటులోకి తీసుకొనిరానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, మాల్స్, బస్సు, రైల్వేస్టేషన్లతో పాటు, భవనాల రహదారులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ జోడించబడిన తర్వాత, వినియోగదారులు ఒకే చోట అందుబాటులో ఉన్న అన్ని షాపులు, రెస్టారెంట్లు, విమానాశ్రయ లాంజ్‌లు, కార్ రెంటల్, పార్కింగ్ స్థలాల్ని ఈజీగా గుర్తించవచ్చని గూగుల్ ప్రకటనలో వెల్లడించింది. చదవండి : గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్‌లో చెలరేగిపోవచ్చు -
రెండో వేవ్ ముగియలేదు.. కాస్త తగ్గండి, ముందుంది అసలు కథ!
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గి లాక్డౌన్ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాస్క్‌లను మరిచి గుంపులుగా తిరుగుతున్న జనసందోహాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీ: తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ మాట పక్కనపెట్టినా.. అందులో మాస్క్‌లు లేన్నోళ్లే ఎక్కువ. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పర్వం కొనసాగుతోంది. ‘మెంటల్ పీస్ కోసం పోతే.. రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు’ అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ తరుణంలో ‘యూరో 2020’ ప్రస్తావన తెస్తూ.. ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Tourists ‘watering down’ all #COVID19 norms at kempty Falls Mussorie … A steep fall straight into the ‘deep waters’ of #ThirdWave !#Covididiots #coronavirus #Covid #Mussorie Video- Scoopwhoop pic.twitter.com/LBruU0k3Xp — RAHUL SRIVASTAV (@upcoprahul) July 7, 2021 సగం జనాభాకి వ్యాక్సిన్, అయినా.. కిందటి ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్ కోసం.. గేట్లు తెరిచింది లండన్ వాంబ్లే స్టేడియం. నాకౌట్ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. జులై 8న 30 వేల కేసులు(జనవరి నుంచి ఇదే హయ్యెస్ట్?!) నమోదు అయ్యాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే 51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. స్టేడియంలోకే కాదు.. స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం-అభిమానం మధ్య చివరి మ్యాచ్ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్.. కొనసాగింపుగా వస్తున్న వేరియెంట్ల ముప్పు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. యూరో సాకర్ అభిమానులు ‘సూపర్స్పెడ్రర్లు’గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇంగ్లండ్ ప్రభుత్వానికి సూచించింది. మరి మన పరిస్థితి.. మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. సింగిల్ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి విమర్శలను తట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేన్నట్లుంది. అందుకే గుంపులుగా జనాల కదలికలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉండడంతో అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ‘యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు.. మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. అసలు కరోనా రెండో వేవ్ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన.. నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. ‘కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్ ఉధృతే అయిపోలేదు. కొవిడ్ ప్రొటోకాల్‌ను జాగ్రత్తగా పాటిస్తేనే.. దానిని పూర్తిగా ఎదుర్కొగలిగిన వాళ్లం అవుతాం. సరదాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. మాస్క్‌లు ధరించండి. ’’ అని అని కొవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. -
ఉగ్రవాదుల నయా ట్రెండ్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు తమ ట్రెండ్ మార్చారు. మార్కెట్లు, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కాకుండా.. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసి దాడులు జరపడానికి కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు తాజాగా అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల విచారణలో తేలింది. రాజకీయ నాయకులు, విదేశీయులు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపాల్సిందిగా వారికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు దేశవ్యాప్తంగా పలువురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్ఐఏ అధికారులు 12 మందిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.