cruise Travel
-
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ..
ఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుంచి 3,200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. అస్సాంలోని దిబ్రూగర్ వద్ద తొలి పర్యటన ముగియనుంది. తొలి బ్యాచ్ లో 52 మంది స్విస్ టూరిస్టులు పాల్గొంటున్నారు. మొత్తం 51 రోజుల ప్రయాణానికి రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక ప్రయాణికుడికి ఒక రోజుకు రూ. 25,000- 50,000 ఖర్చు అవుతుంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఇందులో భాగంగానే వారణాసిలో టెంట్ సిటీకి మోదీ శ్రీకారం చుట్టారు. గంగ ఘాట్ వద్ద 200 టెంట్ల ఏర్పాటుతో పాటు రూ.1000 కోట్ల ఖర్చుతో ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ను ప్రారంభించారు. క్రూయిజ్ ప్రత్యేకతలు.. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది. చదవండి: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు -
గంగా నదిలో హైలెస్సా..
ప్రపంచంలో నదుల మీదుగా సాగే అరుదైన, అత్యంత సుదీర్ఘమైన నౌకా ప్రయాణానికి పుణ్యక్షేత్రం వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగావిలాస్ అని పిలిచే ఈ నౌకా ప్రయాణం 27 నదుల మీదుగా సాగుతుంది. సాధారణంగా నౌక ప్రయాణాలంటే సముద్ర జలాల మీదుగా సాగుతాయి. కానీ ఇలా నదుల మీదుగా సాగే అరుదైన నౌకా ప్రయాణం భారత్‌లో ప్రారంభం కావడం ఇదే తొలిసారి. భారత్ ఘనమైన సంస్కృతి, చరిత్రలను తెలుసుకుంటూ, మన దేశ వారసత్వ పరంపరని అవగాహన చేసుకుంటూ, జాతీయ ఉద్యాన వనాల అందాలను తిలకిస్తూ ఈ ప్రయాణం సాగుతుంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్ చారిత్రక, సాంస్కృతిక మూలాలను తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణం ద్వారా లభిస్తుంది. భారత్‌లో పర్యాటక రంగానికి పెరుగుతున్న ఆదరణని దృష్టిలో ఉంచుకొని ఈ నౌక ప్రయాణాన్ని తీర్చి దిద్దారు. ఈ నెల 13, శుక్రవారం నాడు ఈ నౌక ప్రయాణాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నౌకా ప్రయాణం విశేషాలేంటో తెలుసుకుందాం. ► వారణాసి నుంచి బయల్దేరే గంగా విలాస్ మొత్తం 3,200 కి.మీ. ప్రయాణించి బంగ్లాదేశ్ మీదుగా అసోంలో దిబ్రుగఢ్‌కు చేరుకుంటుంది. ► ఈ మొత్తం ప్రయాణానికి 51 రోజులు సమయం పడుతుంది. 27 నదుల్ని దాటుకుంటూ ప్రయాణం సాగుతుంది. ► మూడు అంతస్తులు ఉండే గంగా విలాస్‌లో 18 సూట్స్ ఉన్నాయి. ► గంగావిలాస్ మొదటి జర్నీ కోసం 32 మంది న్యూజిలాండ్ పర్యాటకులు ఏకంగా నౌక మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. ► ఇందులో ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి రోజుకి రూ.25,000 టిక్కెట్ ధరగా నిర్ణయించారు. అంటే మొత్తం ప్రయాణానికి 12 లక్షల 50 వేలు ఖర్చు అవుతుంది. ► antara luxury river cruises సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ► 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు , సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలుగా 1.4 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది . ► ప్రయాణికుల కోసం అత్యంత విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజూ నౌకలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జిమ్, స్పా వంటి సదుపాయాలతో పాటు వ్యక్తిగతంగా బట్లర్ సర్వీసు, నౌకపైకి వెళ్లి ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ► ప్రపంచ వారసత్వ కట్టడాలు, జాతీయ ఉద్యానవనాలు, నదుల ఒడ్డున ఉండే పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పట్టణాలు వంటి 50 పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ► బిహార్‌లో పట్నా, జార్ఖండ్‌లో సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్లో కోలకతా, బంగ్లాదేశ్‌లో ఢాకా, అసోంలో గౌహతి పట్టణాలను గంగా విలాస్ కవర్ చేస్తుంది. ► బీహార్ స్కూల్ ఆఫ్ యోగ, విక్రమశిల యూనివర్సిటీలను విజ్ఞానం పంచే ప్రాంతాలు, సుందర్బన్స్, బెంగాల్ డెల్టా ప్రాంతాలు, కజిరంగ నేషనల్ పార్క్ వంటి జాతీయ ఉద్యానవనాలను సందర్శించవచ్చు. ► మొదటి రోజు వారణాసిలో గంగా హారతిని సందర్శించిన అనంతరం ఈ నౌక బయల్దేరుతుంది. ఎనిమిదో రోజు పట్నాకి, 20వ రోజు కోల్‌కతాకి 35వ రోజున బంగ్లాదేశ్‌లో ఢాకాకి చేరుకుంటుంది. ఇక 50వ రోజు అంటే మార్చి 1న తిరిగి అసోంలోని దిబ్రుగఢ్‌కి చేరుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘గణేషు’నితో బేరాలు..!
గణేష్ మండళ్లకు అభ్యర్థుల తాయిలాలు * ‘గాలం’ తగిలితే వెయ్యి ఓట్లు ఓకే.. * ప్రధానపార్టీలకు తప్పని పాట్లు * అష్టవినాయక మందిరాలు చూపిస్తామని ఒకరి హామీ * ‘ఫ్రీ పిక్నిక్’ పేరుతో మరొకరి వాగ్దానం * ముందుగానే రిజర్వేషన్లు చేయించాలని డిమాండ్ చేస్తున్న మండళ్లు సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల సెగ పెరిగింది. బహుముఖ పోటీ నెలకొనడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ ఐడియాలతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు వివిధ గణేష్ మండళ్ల సభ్యులను ఉచితంగా తీర్థయాత్రలకు అదేవిధంగా విహార యాత్రలకు తీసుకెళ్తామనీ దీంతో తమకు ఓటు వేయమని అర్థిస్తున్నారు. వర్సోవాకు చెందిన ఓ గణపతి మండల్ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభ్యర్థులు తమకు ఓటు వేస్తే రాష్ట్రంలో ఉన్న ఎనిమిది అష్టవినాయక మందిరాలను చూపిస్తామని హామీ ఇచ్చారన్నారు. రాజకీయ పార్టీ నాయకులు ‘ఫ్రీ పిక్నిక్’ పేరుతో ఓటర్లకు ఎర వేస్తున్నారన్నారు. కానీ ఎన్నికల్లో గెలుపు సాధించిన తర్వాత ఈ నాయకులు తమ ముఖాలనే చూపించరని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు అష్టవినాయక దర్శనం, అదేవిధంగా విహార యాత్ర పేరు చెప్పి తమ ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఇందులో కొంచెం మార్పు చేసి దివాలీ పార్టీలు, క్రికెట్ టోర్నమెంట్లను ఏర్పాటు చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. గణేష్ మండళ్ల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఓ సమావేశంలో దీనిని ప్రతిపాదించారు. అయితే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఈసారి వివిధ రాజకీయ పార్టీలు గణేష్ మండళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఒక్కో మండలి నుంచి 500 నుంచి 1,000 ఓట్లను పొందవచ్చని అవి అంచనా వేస్తున్నాయి. అయితే ఎన్నికల ముందే విహారయాత్రలకు, గణపతి దర్శనాలకు టికెట్లు బుక్ చేసి ఇవ్వాలని ఆయా మండళ్లు అభ్యర్థులకు షరతులు విధిస్తుండటంతో వారు తలగోక్కోవాల్సి వస్తోంది. తాము ఏ రాజకీయ పార్టీలను నమ్మబోమని, ప్రతిసారీ ఇలా హామీలు ఇవ్వడం.. ఎన్నికల తర్వాత వాటిని పట్టించుకోకపోవడం సదరు నాయకులకు పరిపాటిగా మారిందని, అందుకే ఎన్నికలకు ముందే టికెట్లు బుక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామని మండళ్ల ప్రతినిధులు చెబుతున్నారు.