cucumber crop
-
వేసవిలో ఈ పంటతో.. శ్రమ తక్కువ! ఆదాయం ఎక్కువ!
వేసవికాలంలో దోస పంట సాగుతో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. పంట సాగుకు రసాయన ఎరువులు వినియోగం ఉండదు. సాగు ఖర్చులు కూడా తక్కువే. తక్కువ శ్రమతో ఈ పంటను సాగు చేయవచ్చు. కరీంనగర్, నిర్మల్ మండలంలోని కనకాపూర్ గ్రామం దోసకాయలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. గ్రామానికి చెందిన 20 నుంచి 30 మంది రైతులు ఇతర గ్రామాల రైతులకు భిన్నంగా వేసవికాలంలో చల్లదనాన్ని ఇచ్చే దోసకాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిగిలిన పంటల కంటే తక్కువ సమయంలో సాగయ్యే దోస కేవలం 45 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రైతులు తాము పండించిన దోసకాలను స్వయంగా జాతీయ రహదారిపై కిలోకు రూ.60 నుంచి రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితో దోస పంటను సాగు చేస్తున్నామని కనకాపూర్ రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. మధ్య దళారీలు లేకపోవడంతో రైతులు పండించిన దోస కాయలను నేరుగా తమ గ్రామంలోని బస్టాండ్‌లో అమ్ముతున్నారు. ఎకరాకు ఖర్చులు పోనూ రూ.80 వేల నుంచి లక్ష వరకు లాభాలు వస్తున్నాయని రైతులు తెలిపారు. – రాజు, యువ రైతు, కనకాపూర్ సేంద్రియ ఎరువులతో సాగు దోస పంట సాగుకు ఇక్కడి రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటున్నారు. అధికంగా సేంద్రియ ఎరువులను పంట సాగుకు వినియోగిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. మంచి ఆదాయం.. ఎకరా విస్తీర్ణంలో దోస పంట సాగు చేశా. సాగు ఖర్చులు పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంట. – రఘు, యువ రైతు, కనకాపూర్ ఇవి చదవండి: Puthettu Travel Vlog: 12 చక్రాల బండి సాగిపోతోంది -
తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి
-
కడుపు మండింది.. పంటను తొక్కించింది
దొడ్డబళ్లాపురం: అన్నదాతకు అన్నీ కష్టాలే. భూమి దున్ని, విత్తనాలు చల్లి, నీరుకట్టి, ఎరువులు వేసి పగలు,రాత్రి కంటిపాపలా కాపాడుకున్న పంటకు గిట్టుబాటు ఉండదు. చేతుల కష్టానికి చిల్విగవ్వకూడా దక్కదు. ఇలాంటి పరిస్థితే ఓ మహిళా రైతుకు ఎదురైంది. ధరలేని పంటను తానే ట్రాక్టర్‌తో పొలంలోనే తొక్కించి తన ఆక్రోశాన్ని వెల్లగక్కింది. తాలూకాలోని ఆలహళ్లి గ్రామానికి చెందిన రైతు మహిళ ఉమ మూడు నెలల క్రితం తన రెండెకరాల భూమిలో రెండు లక్షలు ఖర్చు చేసి సాంబార్ దోసకాయ సాగు చేసింది. సాధారణంగా ఈ పంటకు మంచి డిమాండ్ ఉండేది. కేజీ కనీసం రూ.20లు పలికేది. అయితే ఉన్నఫలంగా ధరలు పడిపోయాయి. రైతు మహిళ ఉమ మొదటి కోతలో పంటకోసి చిక్కబళ్లాపురం, బెంగళూరు పెద్ద మార్కెట్లకు తీసికెళ్లగా కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాలేదు. రెండో కోతకు ధర వస్తుందని భావించి లోడ్ తెస్తున్నా మని వ్యాపారికి ఫోన్ చేసింది.అయితే సాంబార్ దోసకాయకు డిమాండు లేదని, పంటను తేవద్దని చెప్పారు. దీంతో ఉమ తీవ్ర నిర్వేదానికి గురైంది. ఆరుగాలం పడిన శ్రమంతా వృథా అయిందని మనో వేదనకు గురైంది. ఆక్రోశం తట్టుకోలేక పంటను తనే ట్రాక్టర్‌తో తొక్కించి నాశనం చేసింది. ఆమె మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర,తగిన మార్కెట్టు వ్యవస్థ కల్పించాలని ఉమ అభిప్రాయపడ్డారు. ఉమ భర్త కృష్ణేగౌడ మాట్లాడుతూ రైతుకు దెబ్బమీద దెబ్బ తగిలితే బతికేది ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
బిందుసేద్యంపై..రైతుల దృష్టి
పరిగి రూరల్: వర్షాభావ పరిస్థితులు, క రెంటు కోతల దృష్ట్యా రైతులు బిందుసేద్యంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం బిందుసేద్యం, స్ప్రింక్లర్ల సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు కూడా ఇస్తోంది. అంతేకాకుండా కూరగాయల సాగుకు డ్రిప్ ఎంతో బాగుంటంతో రైతులు మక్కువ చూపిస్తున్నారు. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, మాదారం, ఖుదావంద్‌పూర్, పొల్కంపల్లి తదితర గ్రామాల్లో రైతులు డ్రిప్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. బీర, కీర, కాకర, సొరకాయ తదితర కూరగాయలను పండిస్తున్నారు. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతల కారణంగా ఉన్న బోరు బావిలోని నీటిని పొదుపుగా వాడుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు శ్రీకారం చుట్టారు. తీగజాతి కూరగాయల సాగుతో మరింత లాభం డ్రిప్‌తో ఎక్కువగా కీర, కాకర, సొరకాయ తదితర తీగజాతి కూరగాయల సాగును ఎంచుకున్నారు. తక్కువ శ్రమ, ఎక్కువ లాభం ఉండటంతో రైతుల ఈ సాగుపై దృష్టి సారించారు. మార్కెట్లో కీర, కాకర, సొరకాయలకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో మూడేళ్లుగా రైతులు ఈ పంటలను సాగు చేస్తూ మంచి లాభాన్ని ఆశిస్తున్నారు. ఎకరా కీర సాగులో ఖర్చులన్నీ పోనూ ఈసారి రూ.70 వేలకు వరకు లాభం వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు.