రెండు విడతలుగా కర్ఫ్యూ సడలింపు
సహారన్పుర్: ఉత్తరప్రదేశ్లోని సహారన్పుర్లో కర్ఫ్యూ సడలించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు విడతలుగా కర్ఫ్యూ సడలించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మొదట సడలింపుయిచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటలకు మరోసారి కర్ఫ్యూ సడలించనున్నామని సహారన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్ సంధ్య తివారి తెలిపారు.
ఈద్గా ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లోని మసీదుల్లో ముస్లిం ప్రార్థనల్లో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా కర్ఫ్య్యూ అమల్లో ఉండడంతో చాలా మంది పండుగను జరుపుకోవడానికి సన్నద్దం కాలేకపోయారు. శనివారం సహారన్పుర్లో ఒక వివాదాస్పద భూమి విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన హింసలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటివరకు 68 మందిని అరెస్ట్ చేశారు.