current employes
-
కారుచీకట్లు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో అంధకారం అలుముకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు అల్లాడిపోయారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా సమైక్యవాదులు అడుగు ముందుకేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తెలంగాణ అంశంపై కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పును బట్టే ఉద్యమ స్వరూపం కూడా మారు సాక్షి, కడప: సమైక్య ఉద్యమం ఆదివారం జిల్లాను అంధకారంలోకి నెట్టింది. విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ఆదివారం ఉదయం 10.45 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె జనాలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆర్టీపీపీలో పూర్తిగా నిలిచిపోయిన విద్యుదుత్పత్తి: ఆర్టీపీపీ(రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)లోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం కలిపి 2,700మంది సమ్మెలోకి వెళ్లడంతో 5 యూనిట్లలోని 1050 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పాటు శ్రీశైలం నుంచి వచ్చే సరఫరాను కూడా గ్రిడ్‌కు అనుసంధానం చేయకపోవడంతో జిల్లాలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం చేతిపంపు నీటి కోసం తిరిగినా నగరంలో ఎక్కడా చేతిపంపులు కనిపించలేదు. కొంతమంది ఇరుగుపొరుగు ఇళ్లలోని నీటితో సర్దుకుంటే, మరికొందరు ఇంట్లో నిల్వచేసుకున్న కార్పొరేషన్ నీటినే సేవించాల్సి వచ్చింది. కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క చాలామంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం రాత్రి 7 గంటలకు కరెంటు వస్తుందనే ప్రచారంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకదశలో పూర్తిగా రాదని తెలియడంతో తీవ్ర ఆందోళన చెందారు. రాత్రి వేళలో కరెంట్ లేక దోమల బెడదతో అల్లాడారు. ఫ్యాన్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని పట్టణప్రాంతాల్లోనూ సంభవించింది. పల్లెల్లో కూడా కరెంటు సమస్యలు స్పష్టంగా కన్పించాయి. ఎట్టకేలకు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దసరాపై కరెంటు ప్రభావం దసరా ఉత్సవాలపై కరెంటుకోత ప్రభావం పడింది. శనివారం రాత్రి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రొద్దుటూరు అమ్మవారిశాల, శివాలయంతో పాటు కడపలోని విజయదుర్గాదేవి, అమ్మవారిశాల,మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రాజంపేటలోని అమ్మవారి ఆలయాలు శనివారం విద్యుత్‌దీప కాంతులతో వెలుగులీనాయి. అయితే ఆదివారం కరెంటుకోతతో ఆలయాల్లో చిమ్మచీకట్లు కమ్మాయి. కొన్నిచోట్ల జనరేటర్లను ఉపయోగించి సమస్యను అధిగమించారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు నిలిపేయడం సరికాదు: థామస్, ఇంజనీర్, కడప సమైక్య ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. బంద్‌లతో పాటు అన్ని నిరసన కార్యక్రమాలకు సహకరించారు. చివరకు ప్రభుత్వ పాఠశాలలు మూసి ప్రైవేటు పాఠశాలలు తెరిచినా ఉద్యమం కోసం సహించారు. కానీ చివరకు కరెంటును తొలగించడం దారుణం. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఇబ్బంది పడారు. వెంటనే కరెంటును సరఫరా చేయాలి. వెంటనే కరెంటు సరఫరా చేయాలి: ప్రసన్నకుమారి, విద్యార్థిని, కడప సమైక్య ఉద్యమం తప్పుదారి పడుతోంది. కరెంటు తీసేయడం దారుణం. పగలంటే సరే. రాత్రి పూట కరెంటు తీసేస్తే దొంగతనాలు జరిగే ప్రమాదముంది. తాగునీటితో పాటు రాత్రి పూట నిద్రపోవాలన్నా కష్టంగానే ఉంది. కరెంటు నిలిపేయడం సరైన చర్యకాదు. వెంటనే కరెంటు సరఫరా చేయాలి. -
సమ్మె చీకటి
అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మెతో అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, హిందూపురం, మడకశిర, తాడిపత్రి, గుంతకల్లు, పెనుకొండ, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్యోగుల సమ్మె కారణంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం, కడపలోని ఆర్టీపీపీ, విజయవాడలోని వీటీపీఎస్‌లో సేవలు నిలిచిపోయాయి. దీంతో జిల్లాకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తాయి. ఈ నెల 11న అర్ధరాత్రి నుంచి జిల్లాలోని రెండు వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. హిందూపురం, తాడిపత్రి, అనంతపురం, గుత్తి, కదిరి డివిజన్లలో 24 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఇవి పునరుద్ధరణకు నోచుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 150 గ్రామాల్లో మూడు రోజులుగా చీకట్లు అలుముకున్నాయి. జిల్లా కేంద్రంలో సైతం సమస్యలు తలెత్తాయి. స్థానిక ఎంజీ పెట్రోల్ బంక్ ప్రాంతం, 3,4,5,6వ రోడ్లు, రంగస్వామినగర్, తపోవనం, ఆజాద్‌నగర్, హైదరవలి కాలనీ, విమలా ఫరూక్నగర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలు 48 గంటల పాటు అంధకారం నెలకొంది. ఇక్కడ 12వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రారంభమైన తొలిరోజు పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా.. శుక్రవారం సాయంత్రం నుంచి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సమస్యలు మొదలయ్యాయి. అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఉదయం పూట విద్యుత్ సరఫరాను నిలిపేశారు. హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, కళ్యాణదుర్గం పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,200 గ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమలకు దెబ్బ విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని పలు పరిశ్రమలలో మూడు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. తాడిపత్రిలోని గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమలు, హిందూపురంలోని స్టీల్ ప్లాంట్లు, రాయదుర్గంలోని టెక్స్టైల్స్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెండు రోజుల పాటు వాటికి సెలవు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, పది శాతం మంది ఉద్యోగులు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలు కూడా అందించలేకపోయామని ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ రమణమూర్తి తెలిపారు. ముగిసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె విద్యుత్ ఉద్యోగుల సమ్మె శనివారం అర్ధరాత్రి ముగిసింది. సమ్మె ముగియగానే ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరయ్యారు. సమ్మె సమయంలో తలెత్తిన విద్యుత్ సమస్యలను ఆదివారం మధ్యాహ్నంలోపు పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. -
సమ్మె చీకట్లు
నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో గురువారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల ఫీడర్లల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో ఆయా విభాగాల్లో పని చేస్తున్న దాదాపు 1950 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయా సబ్స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లల్లో ఫ్యూజులు పోయి పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీరు సరఫరా, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయి. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని బుజబుజ నెల్లూరు, వెంకటాచలం మండలం, కాకుటూరు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకే సరఫరా నిలచిపోయింది. నెల్లూరు నగరంలోని నవాబుపేట ఫీడర్లో ఒక బిట్, టౌన్-2 ఫీడర్ పరిధిలోని పోలీసుకాలనీ, ప్రభుత్వాస్పత్రి ఎదురు ప్రాంతాలు, రాజరాజేశ్వరి దేవాలయం ఎదురుగా ఉన్న పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సూళ్లూరుపేట డివిజన్ పరిధిలోని అక్కంపేట, మాంబట్టు ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సరఫరా ఆగిపోయింది. గూడూరు డివిజన్ పరిధిలోని చాగణం, పోతేగుంట ఫీడర్లలోని పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. విడవలూరు మండలం ఊటుకూరు, గిద్దలూరు ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, ఉదయగిరి డివిజన్లోని గండిపాళెం ఫీడర్లో పూర్తిగా సరఫరా ఆగిపోయింది. వీటితో పాటు ఆత్మకూరు, రాపూరు, కావలి, వెంకటగిరి డివిజన్లలో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. ఇబ్బందుల్లో ప్రజలు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లలో ఫ్యూజులు మాత్రమే పోయినట్టు ఆశాఖ ఉన్నతాధికారి తెలిపారు. జిల్లాలో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురికాలేదని చెబుతున్నారు. అయితే అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ సిమ్ కార్డులను వెనక్కి ఇవ్వడంతో విద్యుత్ సమాచారంపై ఎవరికి ఫోన్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఒక్క రోజుకే జిల్లాలో పలు ప్రాంతాల్లో సరఫరా బంద్ కావడంతో రానున్న రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నాం విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో పలు ప్రాంతాల్లో బుధవారం సరఫరా ఆగింది. ఆయా సబ్స్టేషన్లలో పని చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయిస్తున్నాం. సాధ్యమైనంత వరకు సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కరిస్తున్నాం. -నందకుమార్, ఎస్ఈ, ట్రాన్స్‌కో -
ఇక అంధకారమే!
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమాన్ని విద్యుత్ ఉద్యోగులు తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు నిరాహారదీక్షలు, ర్యాలీలు, పెన్‌డౌన్‌లు, ధర్నాలకే పరిమితమైన విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు పూర్తిగా విధులను బహిష్కరించనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం కానుంది. జిల్లాలో ఆయా డివిజన్లలోని డీఈలు విద్యుత్ భవన్లో ఎస్ఈ నందకుమార్‌ను బుధవారం కలిసి సిమ్‌కార్డులను వెనక్కి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఈ నుంచి డీఈ వరకు సెల్ఫోన్లు పని చేయవు. నేడో రేపో జిల్లాలో పని చేస్తున్న దాదాపు 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు కూడా విధులకు దూరం కానున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే జిల్లా అంధకారంగా మారునుంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ సంస్థలోని 13 సంఘాలు ఏకమై గడచిన 30 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నాయి. ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు, అధికారులు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలైన రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు, శ్రీశైలం, నాగార్జునసాగర్, వీటీపీఎస్, సింహాద్రి తదితర ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. భవిష్యత్తులో విద్యుత్ పరంగా మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.