విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల మోహన్(35), తన స్నేహితుడి పొలంలో విద్యుత్ మోటారు వేసేందుకు వెళ్లగా షాక్ కొట్టింది. దీంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.