Customs and Central Excise
-
పీడీఎస్ బియ్యం ఉన్నా షిప్‌ను సీజ్ చెయ్యలేం
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్‌పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ ఎన్వోసీ తప్పనిసరిపోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్‌లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్‌లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్‌పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్‌లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్‌కు అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు. స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సుఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టేక్‌హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదుషిప్లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్‌ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
అమరావతి జీఎస్టీ జోన్ ఎక్కడ?
అమరావతి: జీఎస్టీని అట్టహాసంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి మూడు రోజులు దాటినా రాష్ట్రంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటుకాలేదు. రాజధాని అమరావతి కేంద్రంగా జీఎస్టీ అమరావతి జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జూన్ 16నే సీబీఈసీ నోటిఫికేషన్ జారీ చేసినా ఇంతవరకూ ఏర్పాటు కాలేదు. ఇప్పటివరకూ విశాఖపట్నం కేంద్రంగా చీఫ్ కమిషనర్ నేతృత్వంలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం పని చేసేది. జీఎస్టీ అమలుకు విశాఖలోని చీఫ్ కమిషనరేట్ కార్యాలయాన్ని రద్దుచేసి దానిస్థానంలో జీఎస్టీ అమరావతి జోన్‌ను ఏర్పాటు చేశారు. అమరావతి కేంద్రంగా పనిచేసే ఈ జీఎస్టీ జోన్ కింద తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం కమిషనరేట్లతో కలిసి మొత్తం 113 రేంజ్లుంటాయి. అమరావతి జీఎస్టీ జోన్‌ను ఇంకా ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై స్పష్టత రాకపోవడం ఉద్యోగుల్లో గందరగోళానికి తెరతీస్తోంది. విశాఖ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే 256 మంది ఉద్యోగుల్లో చాలామంది అమరావతి రావడానికి సుముఖంగా లేరు. దీంతో దీనికి రాజకీయరంగు పులుముతున్నారు. విశాఖలో ఉన్న కేంద్ర సంస్థను అమరావతికి తరలించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులూ ప్రధాన కార్యాలయం అమరావతిలోనే ఉండాలంటున్నారు. చీఫ్ కమిషనరేట్ కూడా లేరు: అమరావతి జోన్‌ను ప్రకటించినా ఇంతవరకూ దీనికి చీఫ్ కమిషనర్‌ను కూడా నియమించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన చీఫ్ కమిషనర్ సందీప్ భట్నాగరేకే ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన కూడా మొత్తం హైదరాబాద్‌కే పరిమితమై రాష్ట్ర వ్యవహారాలు పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు కమిషనరేట్లతో కాలం గడుపుతున్నామని, ఇలాంటి కీలక సమయాల్లో ఉన్నతాధికారులు లేకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వారిలో 90 శాతం మంది రాష్ట్ర వాణిజ్యశాఖ పరిధిలోకి, 10 శాతం సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలోకి వస్తారు. రూ.1.50 కోట్ల టర్నోవర్ దాటితే బాధ్యతలను సమానంగా పంచుకుంటారు. కానీ ఈ పని విభజన ఇంకా పూర్తికాకపోవడంతో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉద్యోగులున్నారు. -
ఎగుమతుల్లో ఉమ్మడి రాష్ట్రానిది ఐదోస్థానం
కస్టమ్స్ చీఫ్ కమిషనర్ దీప బి దాస్‌గుప్తా కాకినాడ: పోర్టు ఎగుమతుల్లో అవిభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ దీప బి దాస్ గుప్తా పేర్కొన్నారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ), ది కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆంధ్రాబ్యాంకు, కృష్ణపట్నం పోర్టు సంయుక్తంగా మంగళవారం కాకినాడలోని హెలికాన్ టైమ్స్‌లో చర్చా గోష్టి ఏర్పాటు చేశాయి. ముఖ్య అతిథిగా దీప విచ్చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఐఈఓ సదరన్ రీజియన్ చైర్మన్ వాల్టర్ డిసౌజా మాట్లాడుతూ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తర్వాతి స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్దని అన్నారు. ఆంధ్రా పోర్టుల నుంచి ఈ ఏడాది సుమారు రూ.60 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయన్నారు. కాకినాడలో కస్టమ్స్ కమిషనరేట్ తొలి కమిషనర్‌గా శివనాగ కుమారి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనరేట్ కాకినాడలో ఏర్పాటు కానుంది. కమిషనరేట్ ఏర్పాటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, విశాఖలో ఉన్న కమిషనరేట్-2 కార్యాలయాన్ని కాకినాడకు తరలించడం ఒక్కటే మిగిలి ఉందని బుధవారం కాకినాడలో ఎగుమతి, దిగుమతిదారుల సమావేశానికి వచ్చిన చీఫ్ కమిషనర్ దీపా బి దాస్‌గుప్తా ‘సాక్షి’కి ధ్రువీకరించారు. విశాఖపట్నం-2 కమిషనరేట్ కమిషనర్‌గా పనిచేస్తున్న బీవీ శివనాగ కుమారి అదే హోదాలో ఇక్కడకు రానున్నారు.