చెన్నై ఎయిర్‌పోర్టులో 7.5 కేజీల బంగారం సీజ్
చెన్నై : విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి.ఈసారి సీన్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై విమానాశ్రయానికి మారింది. చెన్నై విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ముగ్గురు వ్యక్తుల నుంచి 7.5 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు.
వీరు కోల్‌కతాకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్టులోని ఓ టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో బంగారాన్నిఅధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. తరచూ కిలోల కొద్దీ బంగారాన్ని పట్టుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో వారు బంగారాన్ని తరలిస్తున్నారు.