CVC probe
-
సీబీఐ వివాదం : సీల్డ్ కవర్లో సుప్రీంకు నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ కేసులో ప్రాధమిక దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు సోమవారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సమర్పించింది. నివేదికను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ ఈ అంశంపై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. ఇక అక్టోబర్ 23న తాను సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలపై నివేదికను సీబీఐ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం సైతం రిజిస్ర్టీ తెరిచిఉంటుందని, అయితే నివేదిక సమర్పించే విషయమై రిజిస్ర్టార్‌కు ఎలాంటి సమాచారం లేదని ప్రధాన న్యాయమూర్తి ఆక్షేపించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై క్షమాపణలు చెబుతూ నివేదిక సమర్పించడంలో తమవైపు నుంచి కొంత జాప్యం జరిగిందని అంగీకరించారు. కాగా, అలోక్ వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది -
సీబీఐ వివాదం : సుప్రీం ముందుకు సీవీసీ నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో నిగ్గుతేలిన అంశాలపై సుప్రీం కోర్టు సోమవారం ఆరా తీయనుంది. ప్రాధమిక దర్యాప్తు నివేదికను నేడు సుప్రీం కోర్టు పరిశీలించనుంది. వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా అలోక్ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై రాకేష్ ఆస్ధానా చేసిన ఆరోపణలను పాయింట్ల వారీగా అలోక్ వర్మ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తోంది. కాగా, వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణకు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీం కోర్టు పర్యవేక్షకుడిగా నియమించింది. వర్మపై అవినీతి ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, సీవీసీలకు గత నెల 26న నోటీసులు జారీ చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ రగడ : సీవీసీ ఎదుట హాజరైన వర్మ
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి ఎదుట హాజరయ్యారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో వర్మ విచారణకు హాజరైనట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. కేవీ చౌదరి నేతృత్వంలో విజిలెన్స్ కమిషనర్లు శరద్ కుమార్, టీఎం భాసిన్, ఇతరులతో కూడిన కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. వర్మపై ఆస్థానా చేసిన ఆరోపణలను రెండు వారాల్లోగా నిగ్గుతేల్చాలని సుప్రీం కోర్టు గత నెల 26న సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం వర్మ గురువారం సైతం విజిలెన్స్ ఉన్నతాధికారులు చౌదరి, కుమార్‌లను కలిసిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ వర్మపై ఆస్ధానా చేసిన ఆరోపణలకు సంబంధించి పలువురు సీబీఐ అధికారులను సీవీసీ ప్రశ్నించినట్టు సమాచారం. సీబీఐలో ఇన్స్పెక్టర్ స్ధాయి నుంచి ఎస్పీ వరకూ పలువురు సిబ్బందిని విచారించి సీవీసీ సీనియర్ అధికారి సమక్షంలో వారి వాదనలను సీవీసీ రికార్డు చేసింది. మొయిన్ ఖురేషీ ముడుపుల కేసు, లాలూ ప్రసాద్ ప్రమేయం ఉన్న ఐఆర్సీటీసీ స్కామ్ సహా పలు కేసులను విచారించిన అధికారుల స్టేట్మెంట్లను సైతం సీవీసీ రికార్డు చేసింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం సీవీసీని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు
‘కోల్గేట్’ నిందితులను కలవడాన్ని తప్పుబట్టిన సుప్రీం సీబీఐ మాజీ డెరైక్టర్ తీరుపై ఆక్షేపణ జూలై 6లోగా నివేదిక ఇవ్వాలని సీవీసీకి ఆదేశం న్యూఢిల్లీ: కోల్గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సూచించింది. పలు కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను దర్యాప్తు అధికారుల పరోక్షంలో రంజిత్‌కుమార్ కలవడం ఆక్షేపణీయమని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి జూలై 6లోగా నివేదిక అందించాలని సీవీసీని ఆదేశించింది. ఆ సమావేశాల తర్వాత సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, దర్యాప్తు నివేదికల్లో ఏమైనా తేడాలున్నాయా గుర్తించాలని సూచించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు జరిగినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ భేటీలు అధికారిక రహస్యాల చట్టం పరిధిలోకి రావని, సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించడం ప్రజాప్రయోజనాల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కాగా, తనపై పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్‌భూషణ్ అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై ఆయన్ని విచారించాలని సీబీఐ మాజీ చీఫ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బొగ్గు స్కాంకు సంబంధించిన కేసులను బలహీనపరిచేందుకు రంజిత్‌కుమార్ అధికార దుర్వినియోగం చేశారంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు స్కాంలో నిందితులుగా ఉన్న అప్పటి రాజ్యసభ ఎంపీ విజయ్ దర్దా సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో రంజిత్‌కుమార్ సమావేశమైనట్లు ఆయన నివాసంలో ఉండే సందర్శకుల పుస్తకంలోని పేర్ల ద్వారా తెలుస్తోందని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని కోరారు.