CWC representatives
-
పోలవరం బ్యాక్ వాటర్ వివాదం పై CWC కీలక నిర్ణయం
-
1న పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు సెప్టెంబర్ ఒకటో తేదీన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఇందులో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరానికి నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి శాఖకు సీడబ్ల్యూసీ నివేదిక ఇస్తుంది. తర్వాత దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం జల్ శక్తి శాఖ పంపుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహాయ, సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీలో రాష్ట్ర అధికారుల బృందంతో కేంద్ర అధికారుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో 2017–18 ధరల ప్రకారం.. కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) నిర్ధారించిన మేరకు రూ.55,656.87 కోట్ల వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2,863 కోట్లను రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం కోసం రూ.10 వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని కోరారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో చెల్లించాలన్నారు. రాష్ట్ర అధికారులు చేసిన ఈ ప్రతిపాదనపై జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీకి కేంద్ర కమిటీ సూచించింది. దీంతో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు వచ్చే నెల ఒకటిన∙రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్‌గా భేటీ కానున్నారు. -
సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితునిగా సుబ్బరామిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయా త్మక కమిటీ సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వాని తునిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బరామి రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.సి.వేణుగోపాల్ నుంచి నియామకపు లేఖ అందింది. సుబ్బరామిరెడ్డి గతంలో కేంద్రమంత్రి, స్టాండింగ్ కమిటీ చైర్మన్, టీటీడీ చైర్మన్ పదవులు చేపట్టడంతో పాటు పార్టీ పరంగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాగా, సీడబ్ల్యూసీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రులు కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్విలకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక ఆహ్వానితునిగా యూపీ మాజీ ఎమ్మెల్యే అజయ్ కుమార్ లల్లూను నియమించారు. -
పోలవరాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్ విభాగం డైరెక్టర్ ఖయ్యూం అహ్మద్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుకను నింపి పూడ్చుతున్న విధానాన్ని పరిశీలించింది. ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాలను, డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిన్న భాగాలను తనిఖీ చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైన అంశాలు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా ఇక్కడ చేపట్టాల్సిన పనులపై సీడబ్ల్యూసీ బృందం నివేదికను రూపొందించింది. దీనిపై ఈనెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కోతకు గురైన ప్రాంతాలను పూడ్చివేసే విధానానికి మెరుగులు దిద్దుతారు. ఈనెల 18న జరిగే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సమావేశంలో ఈ విధానంపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. పురుషోత్తపట్నం వద్ద డ్రెడ్జింగ్ చేస్తూ ఇసుకను ప్రధాన డ్యామ్ వద్ద కోతకు గురైన ప్రాంతాల్లోకి పొరలు పొరలుగా పంపింగ్ చేస్తూ వైబ్రో కాంపాక్షన్ ద్వారా పటిçష్టపరచాలని రాష్ట్ర జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ వేసి పాత దానికి అనుసంధానం చేసే పద్ధతిని కూడా ప్రతిపాదించారు. కేంద్ర జలసంఘం బృందంలో డైరెక్టర్ రాహుల్ కుమార్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్లు సోమేష్‌కుమార్, అశ్వని కుమార్ వర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ గౌరవ్ తివారీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్ పి.దేవందర్‌రావు ఉన్నారు. ప్రాజెక్టు పనులను సీఈ సుధాకర్‌బాబు వారికి వివరించారు. -
ప్రభుత్వ పనితీరు బాగుంది
17 దేశాల ప్రతినిధులు కితాబు సిద్దిపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరు చాలా బాగుందని 17 దేశాలకు చెందిన ప్రతి నిధులు ప్రశంసించారు. తమ దేశాల కంటే.. ఇక్కడే అభివృద్ధి బాగా జరుగుతోందని చెప్పారు. సోమ వారం ఎన్ఐఆర్డీ సహకారంతో సీడబ్ల్యూసీ ప్రతినిధులు డాక్టర్ రజినీకాంత్, అనురాధల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్, భూటాన్, క్యామరూన్, బురుండి, కొలంబియా, ఫిజి, ఘణ, మడగస్కార్, మయన్మార్, శ్రీలంక, సుడాన్, శైర్యా, తునిస్యా, టన్జానియా, ఉజ్బెకిస్థాన్, జాంబియా, అఫ్ఘానిస్థాన్.. దేశాల ప్రతినిధులు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు, మిషన్‌కాకతీయ, భగీరథ, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, గ్రామంలోని సీసీ రోడ్లు, డంప్ యార్డుల నిర్మాణాలను, హాస్టళ్లల్లో, అంగన్వాడీల్లో విద్యార్థులకు సన్నబియ్యం, వాటర్ప్లాంట్ల ద్వారా సురక్షితమైన తాగునీరు ప్రజలు వినియోగిం చుకుంటున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పని బాగుందని, ఇందులో కూలీలు, రైతులు లబ్ధి పొందుతున్న తీరు ఆదర్శంగా ఉందన్నారు. పేద ప్రజలు అభివృద్ధి చెందే విధంగా పథకాలు అమలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని.. అలాగే ఇంకుడు గుంతలతో ఎంతో ఉపయో గాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజన కార్యక్రమం బాగుందని ప్రశంసించారు. అనంతరం గ్రామంలో నిర్వ హించిన బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలసి కోలాటం వేశారు.