dagadarthi
-
రైతుల జీవితాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటం
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దగదర్తి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సున్నపుబట్టి సమీపంలో నేషనల్ హైవే పక్కనే ఉన్న కార్తీకవనంలో శుక్రవారం జరిగింది. సీఐ గంగా వెంకటేశ్వర్లు కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలం జగదేవిపేట దర్బలమిట్టకు చెందిన బత్తల ఆంజనేయులు (50) భార్య కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో, పిల్లలు వేరేగా ఉండటంతో రెండేళ్ల క్రితం సున్నపుబట్టికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఆంజనేయులు తనకు సన్నిహితంగా ఉండే మరోక వ్యక్తితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో అతను కార్తీకవనంలో మృతి చెందడంపై అనేక అనుమానాలకు తావిస్తుందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి తలపై గాయాలు కూడా ఉండటం అనుమానాలకు బలం చేకూర్చుతుంది. ఘర్షణ పడిన వ్యక్తే ఆంజనేయులను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నోట్లో విషగుళికలు వేసినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎరువుల వాడకం తగ్గించాలి
దగదర్తి : రైతులు సాగులో రసాయనికి ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రకతి వ్యవసాయంపై దష్టిసారించాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కుప్పయ్య అన్నారు. మండలంలో ప్రకతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కుప్పయ్య మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం అంతా ప్రకతి సేద్యంపైనే ఆధారపడి ఉండబోతుందన్నారు. రైతులు అవగాహన లోపంతో రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా అనర్థాలు ఎదురవుతాయన్నారు. ప్రకతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనువాసులురెడ్డి, ఎంపీఈఓ పాల్గొన్నారు.