ఎరువుల వాడకం తగ్గించాలి | dont use unneccesary things | Sakshi
Sakshi News home page

ఎరువుల వాడకం తగ్గించాలి

Published Thu, Jul 21 2016 4:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

dont use unneccesary things

 
దగదర్తి : రైతులు సాగులో రసాయనికి ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రకతి వ్యవసాయంపై దష్టిసారించాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కుప్పయ్య అన్నారు. మండలంలో ప్రకతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కుప్పయ్య మాట్లాడుతూ భవిష్యత్‌ వ్యవసాయం అంతా ప్రకతి సేద్యంపైనే ఆధారపడి ఉండబోతుందన్నారు. రైతులు అవగాహన లోపంతో రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా అనర్థాలు ఎదురవుతాయన్నారు. ప్రకతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. రైతులు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనువాసులురెడ్డి, ఎంపీఈఓ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement