పాడి రైతులు సంఘటితం కావాలి
పాడి రైతులు సంఘటితం కావాలి
అనంతపురం అగ్రికల్చర్ : పాడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే రైతులు ఏకతాటిపైకి రావాల్సి ఉందని బొవైన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ (బీఎంసీ) చైర్మన్ నరసింహారావు పిలుపునిచ్చారు. స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో బీఎంసీ ఆధ్వర్యంలో శనివారం పాల రైతులతో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో నరసింహారావుతో పాటు డైరెక్టర్లు నరేంద్రబాబు, డాక్టర్ దేశాయ్ గోపాలరెడ్డి, మోహన్రావు తదితరులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, పశుసంవర్ధకశాఖ అమలు చేస్తున్న రాయితీ పథకాలు, కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవడంతో అవసరమైన మరికొన్ని వెసులుబాట్లు పొందాలంటే పాడి రైతులు ఒక్కటి కావాలన్నారు. సమైక్యంగా ఉన్నపుడే లబ్ధిపొందడానికి అవకాశం ఉంటుందన్నారు. అందుకోసం రైతులంతా ఒక సంఘంగా ఏర్పడితే పాడిపరిశ్రమ ద్వారా రైతు కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఇప్పటికే నాలుగు జిల్లాలలో సంఘాలు ఏర్పాౖటెనట్లు తెలిపారు.