వెంకయ్యనాయుడు దళిత ద్రోహి : రామ్మూర్తి
తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు రామ్మూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దళిత ద్రోహి అని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పసుల రామ్మూర్తి విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని వెంకయ్య చెప్పడం సరికాదన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ సాధ్యం కాదని రెండు నెలల క్రితం కేంద్ర న్యాయ శాఖ మంత్రి తేల్చిన విషయం వెంకయ్యకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే వెంకయ్యను మంత్రి పదవినుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.