దళితులను వంచిస్తున్న కేసీఆర్: మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు అంబేడ్కర్‌కు విగ్రహాలు కడుతూ, దండలు వేస్తూ మరోవైపు దళితులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వంచిస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి వారిని మోసం చేశాడని విమర్శించారు. దళితులను మరోసారి మోసం చేయడానికే అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. దళిత జాతికి చెందిన రోహిత్ వేముల హంతకులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్, మోదీల అసలు స్వరూపాన్ని గుర్తించి, బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.