damaging loss
-
నిబంధనలకు ‘పొగ’బెట్టారు!
సాక్షి,కల్లూరు: కర్నూలు సమీపంలోని భారీ పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా పొగలు చిమ్ముతున్నాయి. ఫలితంగా సమీపంలోని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు మండల పరిధిలో పందిపాడు, లక్ష్మీపురం గ్రామాల మధ్య ఐరన్ (టీఎంటీ) పరిశ్రమ రెండు నెలల క్రితం పునః ప్రారంభమైంది. దీని నుంచి పొగ విపరీతంగా బయటకు వస్తోంది. పరిశ్రమ చుట్టూ ఉన్న పొలాలు పొగ చూరి పనికిరాకుండా పోతున్నాయి. పొగ వాసనను భరించలేక పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకల పరిశ్రమకు కార్మికులు రావడం మానేశారు. టీఎంటీ పరిశ్రమకు అనుబంధంగా బాయిలింగ్ ఐరన్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిస్తోంది. ఇదే జరిగితే బాయిలింగ్ పరిశ్రమ నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళి పైర్లపై పడి పంటలు పండే పరిస్థితులు ఉండబోవని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు పాటించాలి పరిశ్రమల నుంచి వస్తున్న పొగ, దుమ్ము, ధూళితో వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిబంధనల మేరకు పరిశ్రమలను నడపాలి. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పరిశ్రమలను సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ఎల్లరాముడు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు -
జీఎస్టీతో చిన్న చిత్రాలకు తీరని నష్టం
– టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఆర్.కె. గౌడ్ ‘‘ఫిలిం ఇండస్ట్రీపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ విధించడం తగదు. దీని ద్వారా సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకు వినోదం మరింత భారం అవుతుంది’’ అని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం చిన్న సినిమాకు 7 శాతం, పెద్ద సినిమాకు 15 శాతం, డబ్బింగ్ సినిమాకు 20 శాతం పన్ను ఉంది. ఇప్పుడు అన్నిటికీ 28 శాతం పన్ను విధించడం తగదు. క్లబ్బులు, క్యాసీనోలు, గుర్రపు రేసులకు విధించినట్టు సినిమా ఇండస్ట్రీపై 28 శాతం పన్ను విధించడం వల్ల చిన్న చిత్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, 10 శాతం జీఎస్టీ చేయాలి. సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చని రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ప్రేక్షకులపై మరింత భారం పడుతుంది. వెంటనే పెంచిన టిక్కెట్ ధరలను తగ్గించాలి. థియేటర్ లీజ్ విధానం, డిజిటల్ దోపిడీ, రూ. 7 మెయింటెనెన్స్ వల్ల చిన్న సినిమాలకు తీరని నష్టం’’ అన్నారు.