Daman and Diu
-
వైరల్: ఆకాశంలో క్రేజీ కపుల్స్.. అంతలో అనుకోకుండా ..
ప్రస్తుత బిజీ లైఫ్‌లో తీరిక దొరికినప్పుడో, లేదా తీరిక చేసుకుని చాలా మంది విహారయాత్రకు వెళ్తుంటారు. అయితే కొందరు పర్యాటక ప్రాంతాల్లో అడ్వెంచర్స్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే టూర్‌కి వెళ్లడం సరదానిస్తే, అలాంటివి కిక్కునిస్తాయి. అయితే సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి లేదంటే ప్రమాదాలను కోరి తెచ్చుకన్నట్లే. తాజాగా ఓ జంట ఇలాంటి సాహసమే చేస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో గుజరాత్‌కు చెందిన ఓ జంట విహారయాత్రకని వెళ్లారు. దీవి కావడంతో సముద్రం, బోటింగ్, పారాసెయిలింగ్ సహజమే. ఆదివారం ఆ జంట ఉనా తీరం బీచ్‌లో పారాసెయిలింగ్ చేశారు. పడవలో ఉన్న మరో వ్యక్తి దీన్ని వీడియో తీశారు. అయితే ఆ దంపతులు చాలా ఎత్తుకు ఎగిరిన తర్వాత పడవ, పారాసెయిలింగ్ మధ్య ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ జంట సముద్రంలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందస్తు జాగ్రత్తగా ఆ జంట లైఫ్ జాకెట్లు ధరించడంతో సముద్రంలో మునిగిపోకుండా నీటిపై తేలారు. తక్షణమే స్పందించిన బీచ్‌రెస్క్యూ సిబ్బంది జంటను కాపాడారు. పారాసెయిలింగ్ బోటు సిబ్బంది తమను పట్టించుకోలేదని, కొంత సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి తమను కాపాడినట్లు వాళ్లుతెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోటు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దంపతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బోటు సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. @VisitDiu @DiuTourismUT @DiuDistrict @VisitDNHandDD Parasailing Accident, Safety measures in India, and they said very rudely that this is not our responsibility. Such things happens. Their response was absolutely pathetic.#safety #diu #fun #diutourism #accident pic.twitter.com/doN4vRNdO8 — Rahul Dharecha (@RahulDharecha) November 14, 2021 చదవండి: Umngot River In Meghalaya: ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!? -
డయ్యూ అభివృద్ధికి చేయూత
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 100 స్మార్ట్ సిటీ ల జాబితాలో టాప్–10లో నిలిచిన మహా విశాఖ నగరం.. మరో స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూతనందించనుంది. కేంద్ర పట్టణాబివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూను సిస్టర్ సిటీగా దత్తత తీసుకుంది. ఈ నగరంలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వాటికి సంబంధించి సలహాలందించేందుకు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. నగరాల్ని ఆర్థిక, సామాజిక, పర్యావరణ హిత సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. దేశంలో 5 విడతల్లో 100 నగరాల్ని ఎంపిక చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తోంది. తొలి జాబితాలోనే ఎంపికైన విశాఖ నగరం.. స్మార్ట్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. స్మార్ట్ ప్రాజెక్టుల అమల్లో విశాఖ నగరం ఆది నుంచి మంచి స్థానంలోనే కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్న విశాఖ నగరం.. ఇటీవలే బెస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు అవార్డును సైతం సొంతం చేసుకుంది. టాప్–20లో దూసుకుపోతున్న నగరాల మాదిరిగానే.. అట్టడుగున ఉన్న నగరాలను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ట్వంటీ 20 ఫార్ములా.. దిగువ స్థాయిలో ఉన్న నగరాలు సైతం.. అత్యుత్తమ సిటీలుగా గుర్తింపు పొందేలా ప్రోత్సహించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్వంటీ ట్వంటీ ఫార్ములాను అమలు చేస్తోంది. టాప్–20లో ఉన్న నగరాలతో.. దిగువ స్థాయిలో ఉన్న 20 నగరాలను అనుసంధానించిది. ఇందులో భాగంగా విశాఖ నగరానికి సిస్టర్ సిటీగా కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ స్మార్ట్ సిటీని అనుసంధానించారు. ప్రస్తుతం డయ్యూ నగరం 80వ స్థానంలో ఉంది. ఈ నగర బాధ్యతను విశాఖ స్మార్ట్ సిటీ చేపట్టనుంది. సిస్టర్ సిటీల్లో భాగంగా.. ట్వంటీ 20 ఫార్ములా ప్రకారం ఏఏ బాధ్యతలను చేపట్టాలనే విషయాలపై ఈ నెలాఖరున రెండు నగరాలూ ఒప్పందం కుదర్చుకోనున్నాయి. రూ.498 కోట్ల ప్రాజెక్టులకు సలహాలు.. గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలోని అరేబియా సముద్ర తీరంలో 40 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న డయ్యూ నగరంలో 12.14 కిలో మీటర్ల మేర స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.498.41 కోట్ల నిధులతో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీటి సరఫరా, స్మార్ట్ మొబిలిటీ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ, సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, స్మార్ట్ స్కూల్స్ నిర్వహణ మొదలైన అంశాలపై డయ్యూ స్మార్ట్ సిటీకి విశాఖ నగరం సలహాలు అందించనుంది. నిధుల వినియోగంలో డయ్యూ వెనుకంజ.. డయ్యూ నగరాన్ని సిస్టర్ సిటీగా ఎంపిక చేశారు. నిధుల వినియోగంలో డయ్యూ స్మార్ట్ సిటీ వెనుకంజలో ఉంది. ప్రాజెక్టు ప్రణాళికలు, వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మొదలైన అంశాల్లో సలహాలు ఇవ్వనున్నాం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఒప్పందం జరిగిన వెంటనే.. ఇంజినీర్లను పంపించి.. టెండర్లను ఎలా రూపొందించాలి.. మొదలైన అంశాలపై సలహాలు, సూచనలు అందించి.. బెస్ట్ స్మార్ట్ సిటీగా డయ్యూను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
రెండేళ్ల పిల్లోడిని క్యాచ్ పట్టారు..
పంజిమ్: భవనం పై నుంచి పడిన రెండేళ్ల పిల్లోడిని స్థానికులు కాపాడిన ఘటన డామన్ డయ్యూలో జరిగింది. డామన్‌లో మంగళవారం రాత్రి సమయంలో స్థానిక భవనంలోని మూడో అంతస్థు నుంచి రెండేళ్ల బుడ్డోడు కిందకు పడిపోయాడు. అయితే ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. భవనం కింద గుమిగూడి బుడ్డోడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు బుడ్డోడిని పట్టుకోడానికి గాలిలోకి చేతులు చాపారు. ఎట్టకేలకు ఓ యువకుడు బుడ్డోడిని క్యాచ్ పట్టగా అతను కిందపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పక్కవాడి కోసం మనకెందుకులే అనుకునే ఈ సమాజంలో బుడ్డోడి ప్రాణాలు కాపాడిన యువకులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాబును రక్షించిన మీరు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారంటూ ఓ నెటిజన్ ఆనందం వ్యక్తం చేశాడు. #WATCH Daman and Diu: A 2-year-old boy who fell from 3rd floor of a building was saved by locals, yesterday, in Daman. No injuries were reported. pic.twitter.com/bGKyVgNhyM — ANI (@ANI) December 3, 2019 -
రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది.