పంజిమ్: భవనం పై నుంచి పడిన రెండేళ్ల పిల్లోడిని స్థానికులు కాపాడిన ఘటన డామన్ డయ్యూలో జరిగింది. డామన్‌లో మంగళవారం రాత్రి సమయంలో స్థానిక భవనంలోని మూడో అంతస్థు నుంచి రెండేళ్ల బుడ్డోడు కిందకు పడిపోయాడు. అయితే ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. భవనం కింద గుమిగూడి బుడ్డోడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు బుడ్డోడిని పట్టుకోడానికి గాలిలోకి చేతులు చాపారు. ఎట్టకేలకు ఓ యువకుడు బుడ్డోడిని క్యాచ్ పట్టగా అతను కిందపడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పక్కవాడి కోసం మనకెందుకులే అనుకునే ఈ సమాజంలో బుడ్డోడి ప్రాణాలు కాపాడిన యువకులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాబును రక్షించిన మీరు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారంటూ ఓ నెటిజన్ ఆనందం వ్యక్తం చేశాడు.
#WATCH Daman and Diu: A 2-year-old boy who fell from 3rd floor of a building was saved by locals, yesterday, in Daman. No injuries were reported. pic.twitter.com/bGKyVgNhyM
— ANI (@ANI) December 3, 2019
Comments
Please login to add a commentAdd a comment